కళ్లకు గంతలు కట్టుకొని బ్యాటింగ్ చేస్తున్న ఎస్పీ రవికృష్ణ
– జిల్లా ఎస్పీ రవికృష్ణ
ఎమ్మిగనూరు : కళ్లులేకున్నా విశేష ప్రతిభ కనబర్చే అంధుల స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. శనివారం వీవర్సు కాలనీ మైదానంలో రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎస్పీ మాట్లాడారు. కర్నూలు అంధుల ఆశ్రమ విద్యార్థులతో తీరిక దొరికినప్పుడల్లా గడుపుతాననీ.. ఆ ఆనందమే వేరన్నారు. ముగ్గురు విద్యార్థులకు బ్యాంకు ఉద్యోగాలు కూడా వచ్చాయని, వారిలో పట్టుదల, కసి ఎక్కువగా ఉంటాయన్నారు. ఎస్పీ కూడా కళ్లకు గంతలు కట్టుకొని బ్యాటింగ్ చేశారు. కార్యక్రమంలో సీఐ ప్రసాద్, ఎస్‌ఐ హరిప్రసాద్, మల్లెల గ్రూప్స్ ఆల్‌ఫ్రెడ్ రాజు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.