
బాకు(అజర్‌బైజాన్): ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్ బంగారు బోనీ చేసింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల టీమ్ ఈవెంట్‌లో ఇలవేనిల్ వలరివన్, రమిత, శ్రేయా అగర్వాల్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది.
ఫైనల్లో టీమిండియా 12-5 పాయింట్ల తేడాతో అనా నీల్సన్, ఎమ్మా కోచ్, రిక్కీ మెంగ్ ఇస్బెన్‌లతో కూడిన డెన్మార్క్ జట్టును ఓడించింది. ఇదిలా ఉంటే.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్, రుద్రాక్ష్, పార్థ్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతక పోరులో 10-16తో క్రొయేషియా జట్టు చేతిలో ఓడిపోయింది.
చదవండి: Rafael Nadal: జొకోవిచ్‌కు షాకిచ్చిన నాదల్.. వరల్డ్ నంబర్ 1కు ఘోర పరాజయం