
చైల్ట్ ఆర్టిస్ట్‌గా చేసిన అందరూ హీరోయిన్‌గా మారుతారనే గ్యారెంటీ లేదు. అందుకు ఉదాహరణ శ్రేయా గుప్తా. సినిమాల్లో రాణించలేకపోయినా, వెబ్ సిరీస్‌లలో తన ప్రతిభను నిరూపించుకుంటోంది. అలా స్క్రీన్ లైఫ్‌ను రీస్టార్ట్ చేసిన ఈ వెబ్‌స్టార్ గురించి కొన్ని మాటలు..
►శ్రేయా పుట్టి, పెరిగింది చెన్నైలో
► క్రిస్ట్ట్ యూనివర్సిటీ ఆఫ్ బెంగళూరులో మాస్ కమ్యూనికేషన్స్ కోర్సు చేసింది. అనంతరం ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్‌లో చేరింది. కొంతకాలం థియేటర్ ఆర్టిస్ట్‌గానూ పనిచేసింది.
► ఒకవైపు థియేటర్ షోలు, యాడ్ షూట్‌లు చేస్తూనే సినిమా అవకాశాల కోసమూ ప్రయత్నించింది.
► ‘పల్లికూడమ్’తో తనను చైల్ట్ ఆర్టిస్ట్‌గా పరిచయం చేసిన తమిళ ఇండస్ట్రీనే ఆర్టిస్ట్‌గానూ మళ్లీ ఆమెకు అవకాశాన్నిచ్చింది.
► సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’ సినిమాతో పాటు ‘ఆరంభం’, ‘రోమియో జూలియట్’ తమిళ సినిమాల్లో నటించింది.
► అయినా రావాల్సిన గుర్తింపు రాలేదు. దాంతో మళ్లీ థియేటర్ షోలు చేద్దామనుకొని ముంబై వెళ్లింది.
► మంచినీళ్లు అడిగితే, మజ్జిగ ఇచ్చినట్లు స్టేజ్ షోల కోసం వెళ్లిన ఆమెకు అవధుల్లేని వెబ్ తెర మీద జీవించే చాన్స్ దొరికింది.
► 2017లో ‘రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్ రిటర్న్స్’ సిరీస్‌తో వెబ్‌దునియాలోకి ఎంట్రీ ఇచ్చి, వరుస సిరీస్‌లలో నటిస్తూ వెబ్‌స్టార్‌గా ఎదిగింది. వాటిల్లో ‘దిల్’, ‘దోస్తీ ఔర్ కరోనా ’, ‘కపుల్స్ ఇన్ లాక్‌డౌన్’, ’ది ఫర్‌ఫెక్ట్ డేటా’, ‘బ్యాంగ్ బ్యాంగ్’ మంచి ప్రేక్షకాదరణ పొందాయి. పలు షార్ట్ మూవీస్‌లోనూ కనిపించింది.
నా కంఫర్ట్ జోన్.. కెమెరా ముందు నిలబడటం. దాని ఫ్రేమ్‌లో నటిస్తూ నన్ను నేను మర్చిపోతా. నాకు అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది.
– శ్రేయా గుప్తా
Comments
Please login to add a commentAdd a comment