![Tarun Shreya Block Buster Movie Nuvve Nuvve 20 years Celebrations - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/11/Untitled-3_1.jpg.webp?itok=q-wE_D8r)
టాలీవుడ్ హీరో తరుణ్, శ్రియ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'నువ్వే నువ్వే '. ఈ సినిమా విడుదలై సోమవారం(అక్టోబర్ 10)నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హీరో తరుణ్, హీరోయిన్ శ్రియ ,దర్శకుడు త్రివిక్రమ్, నటుడు ప్రకాష్‌రాజ్‌తో పాటు తదితరులు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రియ మాట్లాడుతూ.. 'ఇంత అందమైన స్టోరీ రాసిన త్రివిక్రమ్ సార్‌కు నా ధన్యవాదాలు. ప్రకాశ్‌రాజ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు మీరు తండ్రిలాంటి వారు. మా పేరెంట్స్‌లాగే నాకు మద్దతుగా నిలిచారు.ఈ సందర్భంగా తన కో స్టార్ తరుణ్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. అమేజింగ్ కో స్టార్ అంటూ ఆకాశానికెత్తేసింది. తరుణ్‌ను పొగుడుతూనే వేదికపైనే అందరూ చూస్తూండగా ముద్దు పెట్టేసింది. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని పొగడ్తలతో ముంచెత్తింది.' ఈ సినిమా ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రబృందం సభ్యులంతా ఎమోషనల్‌గా ఫీలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment