nuvve nuvve
-
వేదికపై రచ్చ.. అందరూ చూస్తుండగా నటుడికి ముద్దు పెట్టిన శ్రియ!
టాలీవుడ్ హీరో తరుణ్, శ్రియ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'నువ్వే నువ్వే '. ఈ సినిమా విడుదలై సోమవారం(అక్టోబర్ 10)నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హీరో తరుణ్, హీరోయిన్ శ్రియ ,దర్శకుడు త్రివిక్రమ్, నటుడు ప్రకాష్‌రాజ్‌తో పాటు తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రియ మాట్లాడుతూ.. 'ఇంత అందమైన స్టోరీ రాసిన త్రివిక్రమ్ సార్‌కు నా ధన్యవాదాలు. ప్రకాశ్‌రాజ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు మీరు తండ్రిలాంటి వారు. మా పేరెంట్స్‌లాగే నాకు మద్దతుగా నిలిచారు.ఈ సందర్భంగా తన కో స్టార్ తరుణ్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. అమేజింగ్ కో స్టార్ అంటూ ఆకాశానికెత్తేసింది. తరుణ్‌ను పొగుడుతూనే వేదికపైనే అందరూ చూస్తూండగా ముద్దు పెట్టేసింది. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని పొగడ్తలతో ముంచెత్తింది.' ఈ సినిమా ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రబృందం సభ్యులంతా ఎమోషనల్‌గా ఫీలయ్యారు. -
తరుణ్ స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
బాల నటుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కొద్ది మందిలో తరుణ్ ఒకరు. మనసు మమత మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన తరుణ్ బాలనటుడిగా మూడు నంది అవార్డులు తీసుకున్నాడు. హీరోగా ఎన్నో హిట్స్ అందుకున్నాడు. అందులో నువ్వే నువ్వే సినిమా ఒకటి. ఈ సినిమాతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారాడు. నువ్వే నువ్వే సినిమా రిలీజై సోమవారం(అక్టోబర్ 10)నాటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకల్లో తరుణ్ మాట్లాడుతూ.. 'నువ్వే నువ్వే వచ్చి 20 ఏళ్లు గడిచాయి. నాకు మాత్రం ఇప్పుడే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్లు ఉంది. ఎప్పుడైనా బోర్ కొడితే యూట్యూబ్‌లో నా సినిమాలోని కామెడీ సీన్స్ నేనే చూసుకుంటా! త్రివిక్రమ్‌గారి విషయానికి వస్తే నా తొలి సినిమాకు ఆయన డైలాగులు రాశారు. ఆయన తొలి సినిమాకు నేను హీరోగా చేశాను. ఆయన ఎంతమంది హీరోలతో చేసినా తనకు నేనే ఫస్ట్ హీరోను. ఇప్పటికీ నాకు బయట ఎవరు కలిసినా నువ్వే నువ్వేలాంటి సినిమా ఇంకొక్కటి చేయండి అని అడుగుతుంటారు. త్రివిక్రమ్ గారికి చాలా థ్యాంక్స్' అని చెప్పుకొచ్చాడు. తరుణ్ మాట్లాడుతుంటే త్రివిక్రమ్ ఎమోషనలయ్యాడు. స్టేజీపైనే తన కన్నీళ్లు తుడుచుకుని నిలబడ్డాడు. చదవండి: విడాకులు వద్దనుకుంటున్న ధనుష్, హీరో తండ్రి ఏమన్నాడంటే? కంటెంటే రేవంత్ వెనకాల పరిగెడుతోంది.. -
నువ్వే.. నువ్వే... 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Nuvve Nuvve@20 Years: 'నువ్వే నువ్వే’లోని ఈ డైలాగ్స్ గుర్తున్నాయా?
త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ... ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన సినిమా 'నువ్వే నువ్వే'. తరుణ్, శ్రియ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2002లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల అభిమానంతో పాటు పురస్కారాలూ దక్కాయి. నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో 'సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్'గా 'నువ్వే నువ్వే' నిలిచింది. వెండి నందిని 'స్రవంతి' రవికిశోర్‌కి అందించింది. ఉత్తమ సంభాషణల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు అందుకున్నారు. ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాశ్ రాజ్ పురస్కారం అందుకున్నారు. ఈ సినిమాలోని డైలాగ్స్ అప్పట్లో బాగా పేలాయి. ‘నువ్వే నువ్వే’ విడుదలై సోమవారానికి (అక్టోబర్ 10) నాటికి 20 ఏళ్ళు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు.. ► అమ్మ, ఆవకాయ్, అంజలి... ఎప్పుడూ బోర్ కొట్టవు. ► ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు... పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు. ► కన్నతల్లిని, దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరకు రావాలని కోరుకోవడం మూర్ఖత్వం. ►ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్లు ఏడుస్తారు. పెళ్లి చేసుకొని వెళ్లేటప్పుడు మనల్ని ఏడిపిస్తారు. ►సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. ►డబ్బుతో బ్రెడ్ కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ కొనగలరు, నిద్రని కొనలేరు. ► మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్లు. మనం ఏం చేసినా భరించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు. ►ఒకడు రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని... వారి కొడుక్కి కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమనడం అంత బాగుండదు. ►ఎక్కడికి వెళ్లాలో తెలిసినప్పుడు... ఎలా వెళ్లాలో చెప్పడానికి నేనెవర్ని? ►నీ జీవితంలో వంద మార్కులు ఉంటే 20 నాకు, 80 వాడికి. ఇంకో పదిహేను మార్కులు వేసి మీ నాన్నను పాస్ చేయలేవమ్మా? ► డబ్బులు ఉన్నవాళ్ళంతా ఖర్చుపెట్టలేరు. ఖర్చు పెట్టేవాళ్లంతా ఆనదించలేరు. ►తాజ్ మహల్... చార్మినార్... నాలాంటి కుర్రాడు చూడటానికే! కొనడానికి మీలాంటి వాళ్ళు సరిపోరు. ► నేను దిగడం అంటూ మొదలుపెడితే ఇది మొదటి మెట్టు. దీని బట్టి నా ఆఖరి మెట్టు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. -
గీత స్మరణం
పల్లవి : అతడు: అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది ఓ ముద్దమందారంలా ముస్తాబయ్యింది ఆమె: వైశాఖమొచ్చేసింది ఇవ్వాళో రేపో అంది ఓ మంచి ముహూర్తం చూసి సిద్ధం కమ్మంది అ: ఓ ఓ ఓ... ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపుకథలో ఆ: మనువే కుదిరి కునుకే చెదిరి మురిపెం ముదిరి నా మనసు నిలవనంది కొమ్మల్లో చిలక మోమాటం పడక వచ్చి వాలమ్మా ॥ చరణం : 1 అ: ఈ గాలి రోజూలా వీస్తున్నా ఈవేళ వేరేలే వింటున్నా సన్నాయి రాగాలుగా ఆ: నావైపు రోజూలా చూస్తున్నా ఈనాడే ఏదోలా ఔతున్నా నీ కన్ను ఏమన్నదో... నా ఈడు ఏం విన్నదో అ: ఆశపెట్టి పెట్టి పెట్టి చంపొద్దమ్మా ఇట్టా ఆ: నువ్వు పట్టి పట్టి పట్టి చూస్తూవుంటే ఎట్టా అ: ఎన్నెన్నో అనిపించి ఉక్కిరిబిక్కిరి ఔతున్నా ॥॥ చరణం : 2 ఆ: ముత్యాల మేనాలే రప్పించి మేఘాల వీధుల్లో తిప్పించి ఊరేగనీ హాయిగా అ: అందాల హద్దుల్నే తప్పించి వందేళ్ల కౌగిళ్లే అందించి ఊరించు ఆ వేడుక... ఓ... ఊహించ నీ నన్నిలా ఆ: ఏంటి గిచ్చి గిచ్చి రెచ్చగొట్టేలా నువ్వు అ: ఇంత పిచ్చి పిచ్చి పిచ్చి పెంచేస్తోందే నువ్వు హోయ్ ఆ: కవ్వించి కరిగించి కరిగే వయసును కాపాడు ఆ: కొమ్మల్లో చిలక మోమాటం పడకా వచ్చి వాలమ్మా ॥ చిత్రం : నువ్వే నువ్వే (2002), రచన : సిరివెన్నెల సంగీతం : కోటి, గానం : రాజేష్, కౌసల్య నేడు తరుణ్ బర్త్‌డే నిర్వహణ: నాగేశ్