గీత స్మరణం | song from nuvve nuvve | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Tue, Jan 7 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM

గీత స్మరణం

గీత స్మరణం

 పల్లవి :
 అతడు: అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది
 ఓ ముద్దమందారంలా ముస్తాబయ్యింది
 ఆమె: వైశాఖమొచ్చేసింది ఇవ్వాళో రేపో అంది
 ఓ మంచి ముహూర్తం చూసి సిద్ధం కమ్మంది
 అ: ఓ ఓ ఓ... ఈ కబురు విన్న ఎదలో
   ఎన్నెన్ని పొడుపుకథలో
 ఆ: మనువే కుదిరి కునుకే చెదిరి
 మురిపెం ముదిరి నా మనసు నిలవనంది
 కొమ్మల్లో చిలక మోమాటం పడక వచ్చి వాలమ్మా
 ॥
 చరణం : 1
 అ: ఈ గాలి రోజూలా వీస్తున్నా ఈవేళ వేరేలే వింటున్నా
   సన్నాయి రాగాలుగా
 ఆ: నావైపు రోజూలా చూస్తున్నా
   ఈనాడే ఏదోలా ఔతున్నా
 నీ కన్ను ఏమన్నదో... నా ఈడు ఏం విన్నదో
 అ: ఆశపెట్టి పెట్టి పెట్టి చంపొద్దమ్మా ఇట్టా
 ఆ: నువ్వు పట్టి పట్టి పట్టి చూస్తూవుంటే ఎట్టా
 అ: ఎన్నెన్నో అనిపించి ఉక్కిరిబిక్కిరి ఔతున్నా
 ॥॥
 చరణం : 2
 ఆ: ముత్యాల మేనాలే రప్పించి మేఘాల వీధుల్లో
   తిప్పించి ఊరేగనీ హాయిగా
 అ: అందాల హద్దుల్నే తప్పించి వందేళ్ల కౌగిళ్లే అందించి
   ఊరించు ఆ వేడుక... ఓ... ఊహించ నీ నన్నిలా
 ఆ: ఏంటి గిచ్చి గిచ్చి రెచ్చగొట్టేలా నువ్వు
 అ: ఇంత పిచ్చి పిచ్చి పిచ్చి పెంచేస్తోందే నువ్వు హోయ్
 ఆ: కవ్వించి కరిగించి కరిగే వయసును కాపాడు
 ఆ: కొమ్మల్లో చిలక మోమాటం పడకా వచ్చి వాలమ్మా
 ॥
 చిత్రం : నువ్వే నువ్వే (2002), రచన : సిరివెన్నెల
 సంగీతం : కోటి, గానం : రాజేష్, కౌసల్య
 
 నేడు తరుణ్ బర్త్‌డే
 
 నిర్వహణ: నాగేశ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement