బాల నటుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కొద్ది మందిలో తరుణ్ ఒకరు. మనసు మమత మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన తరుణ్ బాలనటుడిగా మూడు నంది అవార్డులు తీసుకున్నాడు. హీరోగా ఎన్నో హిట్స్ అందుకున్నాడు. అందులో నువ్వే నువ్వే సినిమా ఒకటి. ఈ సినిమాతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారాడు. నువ్వే నువ్వే సినిమా రిలీజై సోమవారం(అక్టోబర్ 10)నాటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది.
ఈ వేడుకల్లో తరుణ్ మాట్లాడుతూ.. 'నువ్వే నువ్వే వచ్చి 20 ఏళ్లు గడిచాయి. నాకు మాత్రం ఇప్పుడే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్లు ఉంది. ఎప్పుడైనా బోర్ కొడితే యూట్యూబ్‌లో నా సినిమాలోని కామెడీ సీన్స్ నేనే చూసుకుంటా! త్రివిక్రమ్‌గారి విషయానికి వస్తే నా తొలి సినిమాకు ఆయన డైలాగులు రాశారు. ఆయన తొలి సినిమాకు నేను హీరోగా చేశాను. ఆయన ఎంతమంది హీరోలతో చేసినా తనకు నేనే ఫస్ట్ హీరోను. ఇప్పటికీ నాకు బయట ఎవరు కలిసినా నువ్వే నువ్వేలాంటి సినిమా ఇంకొక్కటి చేయండి అని అడుగుతుంటారు. త్రివిక్రమ్ గారికి చాలా థ్యాంక్స్' అని చెప్పుకొచ్చాడు. తరుణ్ మాట్లాడుతుంటే త్రివిక్రమ్ ఎమోషనలయ్యాడు. స్టేజీపైనే తన కన్నీళ్లు తుడుచుకుని నిలబడ్డాడు.
చదవండి: విడాకులు వద్దనుకుంటున్న ధనుష్, హీరో తండ్రి ఏమన్నాడంటే?
కంటెంటే రేవంత్ వెనకాల పరిగెడుతోంది..
Comments
Please login to add a commentAdd a comment