Tarun Kumar
-
పెళ్లి చేసుకోమని చాలామంది అమ్మాయిలు వెంటపడేవారు
-
హీరో తరుణ్ కి ఇష్టమైన ఫుడ్
-
నేను అసలు యాక్టర్ అవ్వాలనుకోలేదు..!
-
మీ వల్లే ఇలా అయిపోయిందా: తరుణ్ కుమార్
-
తరుణ్ స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
బాల నటుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కొద్ది మందిలో తరుణ్ ఒకరు. మనసు మమత మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన తరుణ్ బాలనటుడిగా మూడు నంది అవార్డులు తీసుకున్నాడు. హీరోగా ఎన్నో హిట్స్ అందుకున్నాడు. అందులో నువ్వే నువ్వే సినిమా ఒకటి. ఈ సినిమాతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారాడు. నువ్వే నువ్వే సినిమా రిలీజై సోమవారం(అక్టోబర్ 10)నాటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకల్లో తరుణ్ మాట్లాడుతూ.. 'నువ్వే నువ్వే వచ్చి 20 ఏళ్లు గడిచాయి. నాకు మాత్రం ఇప్పుడే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్లు ఉంది. ఎప్పుడైనా బోర్ కొడితే యూట్యూబ్‌లో నా సినిమాలోని కామెడీ సీన్స్ నేనే చూసుకుంటా! త్రివిక్రమ్‌గారి విషయానికి వస్తే నా తొలి సినిమాకు ఆయన డైలాగులు రాశారు. ఆయన తొలి సినిమాకు నేను హీరోగా చేశాను. ఆయన ఎంతమంది హీరోలతో చేసినా తనకు నేనే ఫస్ట్ హీరోను. ఇప్పటికీ నాకు బయట ఎవరు కలిసినా నువ్వే నువ్వేలాంటి సినిమా ఇంకొక్కటి చేయండి అని అడుగుతుంటారు. త్రివిక్రమ్ గారికి చాలా థ్యాంక్స్' అని చెప్పుకొచ్చాడు. తరుణ్ మాట్లాడుతుంటే త్రివిక్రమ్ ఎమోషనలయ్యాడు. స్టేజీపైనే తన కన్నీళ్లు తుడుచుకుని నిలబడ్డాడు. చదవండి: విడాకులు వద్దనుకుంటున్న ధనుష్, హీరో తండ్రి ఏమన్నాడంటే? కంటెంటే రేవంత్ వెనకాల పరిగెడుతోంది.. -
'డబ్బే ముఖ్యమని హింసించారు.. నన్ను అర్థం చేసుకోలేదు'
సాక్షి, చిత్తూరు: తల్లిదండ్రుల డబ్బు ఆశకు తరుణ్ కుమార్ అనే యువకుడు బలయ్యాడు. ఈ ఘటన పుంగనూరులో చోటుచేసుకుంది. బీటెక్ చదివిన తరుణ్‌కు కొద్ది రోజుల క్రితం ఓ అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. అయితే కొద్ది రోజులకే ఆ వివాహ నిశ్చయం రద్దయింది. ఈ క్రమంలోనే తల్లి దండ్రులు డబ్బే ముఖ్యమంటూ హింసించారని వాట్సప్ స్టేటస్ పెట్టి తరుణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది నుంచి ఇంట్లో రకరకాలుగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు కావాలనే పెళ్లి రద్దు చేసి ఇబ్బంది పెట్టారని వాట్సప్ స్టేటస్‌లో తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (నా కారునే ఆపుతావా అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి) -
నీవెవరు?
రిజ్వాన్ కల్షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓమనిషి నీవెవరు’. కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు దర్శ కత్వం వహించారు. స్వర్ణ కుమారి దొండపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుంది. సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో పాత్ర ఉందని స్వర్ణకుమారిగారు చెప్పగానే అదృష్టంగా భావించి చేశాను’’ అన్నారు. ‘‘మా నిర్మాత నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతో పరిశోధన చేసి, ఈ సినిమా తీశా’’ అన్నారు కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు. ఈ చిత్రానికి సంగీతం: ప్రభాకర్, కెమెరా: సూర్య భగవాన్ మోటూరి, సహ నిర్మాత: జంపన దుర్గా భవానీ. -
ఉరివేసుకుని యువకుడి మృతి
మిర్యాలగూడ పట్టణంలోని పలల్వాడ్ కాలనీకి చెందిన కోళ తరుణ్ కుమార్(20) అనే యువకుడు ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి మిర్యాలగూడ వన్‌టౌన్ సీఐ బిక్షపతి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.