త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మంగ్లీ? స్పందించిన సింగర్‌! | Is Mangli Marriage Fixed, See How Singer Mangli Denies Rumours About Her Wedding - Sakshi
Sakshi News home page

Singer Mangli Marriage Rumours: త్వరలో మంగ్లీ పెళ్లి అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సింగర్‌..

Published Wed, Oct 4 2023 3:41 PM | Last Updated on Wed, Oct 4 2023 4:01 PM

Is Mangli Marriage Fixed, See How Singer Mangli Denies Rumours About Her Wedding - Sakshi

ఈ మధ్య జానపద పాటలు సినిమాల్లో వాడటం ట్రెండ్‌ అయిపోయింది. అయితే ఎక్కడ జానపదం ఉంటే అక్కడ మంగ్లీ ఉండాల్సిందే! బతుకమ్మ, బోనాలు.. ఇలా పండగల పాటలే కాదు, జానపదాలు, సినిమా పాటలూ పాడుతూ ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది సింగర్‌ మంగ్లీ.

Singer Mangli Marriage Rumours

అయితే మంగ్లీ త్వరలో పెళ్లి చేసుకోనుందంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మరో రెండు నెలల్లో ఆమె పెళ్లి పీటలెక్కనుందని, స్వయానా తన బావతోనే మనువాడనుందని సదరు వార్త సారాంశం. ఇప్పటికే తను సైన్‌ చేసిన ప్రాజెక్టులను చకాచకా పూర్తి చేసి ఆ తర్వాత పెళ్లి పనుల్లో నిమగ్నం కానుందని జోరుగా ప్రచారం నడిచింది. తాజాగా ఈ రూమర్స్ విన్న మంగ్లీ ఘొల్లున నవ్వేసింది.

Mangli Reacts On Marriage News

ఏంటి? నాకు పెళ్లా? ఓరి భగవంతుడా.. నాక్కూడా తెలియకుండానే నాకు పెళ్లి చేసేస్తున్నారా? అని సదరు వార్తలు కేవలం పుకార్లేనని కొట్టిపారేసింది. సోషల్‌ మీడియా తన పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చేసింది. ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచనే లేదంటోంది. ఇంతకీ బావతో ఏడడుగులు వేస్తున్నానన్నారు. నాకు తెలియక అడుగుతున్నా.. నాకే తెలియని నా బావ ఎవరో చెప్తారా? ఈ పుకారు సృష్టించినవాళ్లైనా దీనికి సమాధానం చెప్పండయ్యా.. అంటూ సెటైర్లు వేసింది.

చదవండి: హారర్‌ సిరీస్‌తో భయపెడతానంటున్న ఓంకార్‌ అన్నయ్య.. స్ట్రీమింగ్‌ ఎక్కడ? ఎప్పుడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement