
తెలుగులో సింగర్స్ చాలామంది ఉన్నారు. కానీ తనదైన వాయిస్ తో వరస అవకాశాలు దక్కించుకుంటున్న గాయని మంగ్లీ. తెలంగాణకు చెందిన పల్లె పాటలు, ఫోక్ గీతాలు పాడటంలో ఎక్స్ పెర్ట్ అని చెప్పొచ్చు. అదే టైంలో స్టేజీ షోలు కూడా బోలెడన్ని చేస్తూనే ఉంటుంది.
(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత పారితోషికమా?)
ఇలా సింగర్ గా రెండు చేతులా సంపాదిస్తున్న మంగ్లీ.. ఇప్పుడు ఓ ఇల్లు కట్టుకుంది. సోమవారం గృహప్రవేశం జరగ్గా.. బిగ్ బాస్ ఫేమ్ రోహిణి ఈ వేడుకలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. కెరీర్ విషయానికొస్తే.. ఊరూ పల్లెటూరు (బలగం), రాములో రాముల (అల వైకుంఠపురములో), సారంగ దరియా(లవ్ స్టోరీ) తదితర గీతాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చెల్లెలు ఇంద్రావతి కూడా సింగరే. 'ఊ అంటావా మావా' పాటతో ఫేమ్ తెచ్చుకుంది. ఇలా ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు.. ఓ ఇంటికి యజమానులయ్యారు.
(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్.. ఫోటోలు వైరల్)



Comments
Please login to add a commentAdd a comment