
తెలంగాణలో బతుకమ్మ పండగ అంటే మంగ్లీ పాటలు ఉండాల్సిందే.. అంతలా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో శివరాత్రి పండుగ సందర్భంగా ప్రతి ఏడాది శివుడి పాటలు పాడి అందరి ఇంట్లో తన గొంతును వినిపిస్తున్నారు. అయితే, తాజాగా ఆమె ఈ శివరాత్రి కోసం 'భం.. భం.. భోళా' అంటూ అదిరిపోయే సాంగ్‌ను ఆలపించారు. చరణ్ అర్జున్ రచించిన ఈ పాటు మంగ్లీ సిస్టర్స్ పాడటమే కాకుండా తనదైన స్టైల్లో స్టెప్పులు కూడా వేశారు. శివభక్తుల్లో మంచి జోష్ నింపేలా సాంగ్ ఉండటంతో నెట్టింట వైరల్ అవుతుంది.

కోయంబత్తూర్‌లోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్యాత్మిక కేంద్రం ఈషా ఫౌండేషన్‌లో ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భారత్ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా శివభక్తులు వస్తుంటారు. అక్కడ కూడా మంగ్లీ పాటలు పాడుతారు. కొన్నేళ్లుగా ఆమె సద్గురుతో పాటు శివరాత్రి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment