కారు ప్రమాదం.. ఆ రూమర్స్‌ గురించి నమ్మొద్దు: సింగర్‌ మంగ్లీ | Tollywood Singer Mangli Comments On Her Accident | Sakshi
Sakshi News home page

కారు ప్రమాదం.. ఆ రూమర్స్‌ గురించి నమ్మొద్దు: సింగర్‌ మంగ్లీ

Published Mon, Mar 18 2024 4:19 PM | Last Updated on Mon, Mar 18 2024 5:44 PM

Tollywood Singer Mangli Comments On Her Accident - Sakshi

టాలీవుడ్‌లో సెన్సేషనల్‌ సింగర్ మంగ్లీ.. రోడ్డు ప్రమాదానికి గురి కావడం జరిగిందని వార్తలు వచ్చాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌-బెంగళూర్‌ దారిలో ప్రయాణిస్తుండగా ఆమె కారుని ఓ డీసీఎం వ్యాన్ ఢీకొట్టిందని. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. ఈ ఘటనలో మంగ్లీకి చిన్న గాయాలైనప్పటికీ ఆమె సురక్షితంగా బయటపడ్డారని పలు కథనాలు వైరల్‌ అయ్యాయి. ఈ సంఘటన గురించి మంగ్లీ రియాక్ట్‌ అయ్యారు.

మంగ్లీ తన సోషల్ మీడియాలో.. 'నేను క్షేమంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇది రెండు రోజుల క్రితం అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం. దయచేసి ఈ సంఘటన గురించి వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దు. నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.' అని ఆమె పోస్ట్‌ చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో తాజాగా ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. దీనికి హాజరైన మంగ్లీ.. అర్థరాత్రి తర్వాత మరో ఇద్దరితో కలిసి కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వస్తుండగా తొండుపల్లి బ్రిడ్జి దగ్గర కర్ణాటకు చెందిన డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి.. మంగ్లీ కారుని బలంగా  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే డీసీఎం వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement