స్టార్ సింగర్ మంగ్లీ కారుకి ప్రమాదం | Singer Mangli Met With Car Accident In Hyderabad | Sakshi
Sakshi News home page

Singer Mangli: త్రుటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న మంగ్లీ

Mar 18 2024 10:00 AM | Updated on Mar 18 2024 10:07 AM

Singer Mangli Car Accident In Hyderabad Latest - Sakshi

సినిమా పాటలు, ఆల్బమ్ సాంగ్స్‌తో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ.. ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారుని ఓ డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మంగ్లీకి చిన్న గాయాలైనప్పటికీ సురక్షితంగా బయటపడింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో తాజాగా ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. దీనికి హాజరైన మంగ్లీ.. అర్థరాత్రి తర్వాత మరో ఇద్దరితో కలిసి కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వస్తుండగా తొండుపల్లి బ్రిడ్జి దగ్గర కర్ణాటకు చెందిన డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి.. మంగ్లీ కారుని బలంగా గుద్దింది.

అయితే ఈ ప్రమాదంలో మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మంగ్లీ ప్రయాణిస్తున్న కారు వెనక భాగం కాస్త దెబ్బతింది. అయితే డీసీఎం వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement