
సింగర్ మంగ్లీ.. ఈ పేరు తెలియని సంగీతప్రియులుండరంటే అతిశయోక్తి కాదు. అంతలా జనాల్లోకి చొచ్చుకుపోయిందీ సింగర్. జానపద పాటలతో గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ పండగకు తగ్గట్లుగా పాటలు రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అటు సినిమా పాటలతోనూ తన సత్తా చాటుతోంది.
ఇటీవలే స్వధా ఫౌండేషన్ నిర్వహించిన ‘మార్గా 2024’ ఈవెంట్‌లో ఉషా ఉతుప్, సుధా రఘునాథన్ లాంటి గాయకులతో కలిసి మంగ్లీ వేదిక పంచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గానూ సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్’ యువ పురస్కారానికి మంగ్లీ ఎంపికైంది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మున్ముందు మరెన్నో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
చదవండి: ఆ రోజు జుట్టు ఊడిపోయి, మంచం మీద లేవలేని స్థితిలో.. ఏడ్చేసిన కుమారుడు
Comments
Please login to add a commentAdd a comment