త్వరలో జగ్గుభాయ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ, ఆ హీరోకు విలన్‌గా.. | Jagapathi Babu Plays As Villain Role In Farhan Akhtar Pukar Movie | Sakshi
Sakshi News home page

jagapathi Babu: త్వరలో జగ్గుభాయ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ, ఆ హీరోకు విలన్‌గా..

Oct 20 2021 6:50 PM | Updated on Oct 20 2021 10:35 PM

Jagapathi Babu Plays As Villain Role In Farhan Akhtar Pukar Movie - Sakshi

ఒక‌ప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన జ‌గ‌ప‌తి బాబు కొంతకాలం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. సుదీర్ఘ విరామం తర్వాత బాలకృష్ణ ‘లెజెండ్‌’ మూవీతో విలన్‌గా రీఎంట్రీ ఇచ్చిన ఆయన తిరుగు లేని నటుడిగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఏ తరహా పాత్రలో అయినా ఇమిడిపోతు తనలోని నటుడిని తెరపై కొత్తగా ఆవిష్కస్తున్నారు. ఈ క్రమంలో ఆయన డిమాండ్‌ ఉన్న నటుడిగా మారారు.

చదవండి: ఘనంగా ముక్కు అవినాష్‌ పెళ్లి, ‘బ్లండర్‌ మిస్టేక్‌’ అంటూ వీడియో బయటికి!

పాన్‌ ఇండియా, భారీ బడ్జెట్‌ చిత్రాల్లోని హీరోలకు ధీటైన విలన్‌ ఎవరంటే జగ్గుభాయ్‌ పేరు వినిపించేంతగా ఆయన తెచ్చుకున్నారు. ఇక విలక్షణ నటుడిగా అందరి ఆదరణ పొందుతూ దక్షిణాన బిజీగా మారిన ఆయనకు కొంతకాలంగా బాలీవుడ్‌ ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే హిందీ సినిమాల్లో నటించే ఆసక్తి లేకపోవడంతో ఇప్పటి వరకు నో చెబుతూ వచ్చారట జగపతి బాబు. అయితే ఈ తాజా బజ్‌ ప్రకారం ఆయన త్వరలోనే బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో, ఫర్హాన్ అక్తర్ హీరోగా ‘పుకార్’ అనే సినిమా రూపొందనుంది.

చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత

ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌ కోసం జగ్గుభాయ్‌కి పిలుపు వచ్చిందట. ఇక వస్తున్న అవకాశాలను వదులేక ఆయన ఈ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫారెస్టు నేపథ్యంలో సాగే ఈ మూవీలో డిసెంబర్‌ నుంచి సెట్‌పై రానుందని టాక్‌. ఇందులో ఫర్హాన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హరోయిన్‌గా నటించనుంది. కాగ ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌ నీల్‌-ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘సలార్‌’ చిత్రంలో రాజమన్నార్‌ అనే విలన్‌ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement