
ఫర్హాన్ అక్తర్, షిబానీ దండేకర్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌లో ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇవే నిజమయ్యాయి. గత నెల 1న(సెప్టెంబర్) షిబానీ సోషల్ మీడియాలో పై ఫొటో షేర్ చేశారు. ఇప్పుడు అదే ఫొటోను మంగళవారం ఫర్హాన్ అక్తర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఓ లవ్ సింబల్ ఉంచారు.
అంతే.. వీరిద్దరూ తమ ప్రేమను ఫొటో ద్వారా చెప్పకనే చెప్పేశారని బీ టౌన్‌లో గుసగుసలాడుకుంటున్నారు. ఈ ఏడాది షిబానీ పుట్టినరోజుకి(ఆగస్టు 27) తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో ఆమె ఫొటోతో పాటు మూడు కిస్సింగ్ ఎమోజీలను ఫర్హాన్ అక్తర్ ఉంచిన విషయం గుర్తుండే ఉంటుంది.