మళ్లీ ఆట మొదలు | FARHAN AKHTAR TO NOW TURN A BOXER FOR TOOFAN | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆట మొదలు

Published Fri, Oct 25 2019 5:49 AM | Last Updated on Fri, Oct 25 2019 5:49 AM

FARHAN AKHTAR TO NOW TURN A BOXER FOR TOOFAN - Sakshi

ఫర్హాన్‌ అక్తర్‌

దాదాపు ఆరేళ్ల క్రితం వచ్చిన ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ చిత్రంలో రన్నర్‌గా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు క్రియేట్‌ చేశారు ఫర్హాన్‌ అక్తర్‌. ఈ చిత్రానికి ఓం ప్రకాష్‌ మెహ్రా దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో స్పోర్ట్స్‌ మూవీ ‘తుఫాన్‌’ తెరకెక్కుతోంది. బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాక్సర్‌ పాత్రలో ఫర్హాన్‌ కనిపిస్తారు. అసలు సిసలైన బాక్సర్‌గా ఫిజిక్‌ని మార్చుకోవడానికి ఫర్హాన్‌ కసరత్తులు చేశారు. ఈ పాత్రకు అనుగుణంగా లుక్‌ మార్చుకున్నాక, ఆగస్టులో షూటింగ్‌ని మొదలుపెట్టారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో మొదలైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబరు 2న విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement