toofan movie
-
ఓటీటీలోకి వచ్చేసిన డబ్బింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో వీకెండ్ వచ్చేసింది. గురువారం 'కల్కి' సినిమా ఓటీటీలోకి రావడంతో థియేటర్లలో చూసిన చాలామంది మరోసారి షో వేశారు. అలానే కొత్తగా ఇంకేమైనా మూవీస్ వచ్చాయా అని సెర్చ్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లే రెండు తమిళ డబ్బింగ్ చిత్రాల తెలుగు వెర్షన్స్ తాజాగా అందుబాటులోకి వచ్చేశాయి. ఇంతకీ ఈ సినిమాలేంటి? ఏ ఓటీటీలో ఉన్నాయి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్)ధనుష్.. హీరోగా నటించిన దర్శకత్వం వహించిన సినిమా 'రాయన్'. ఇతడి కెరీర్లో ఇది 50వ సినిమా. కమర్షియల్ హంగులతో తీసిన ఈ సినిమాలో యాక్షన్, డ్రామా బాగానే వర్కౌట్ అయింది. తమిళంలో బాగానే డబ్బులొచ్చాయి కానీ తెలుగులో ఎందుకో సరిగా ఎక్కలేదు. తాజాగా ఇది అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది.'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. ఆగస్టు 09న తెలుగులో రిలీజైన ఈ సినిమాని రెండు వారాలైన కాకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ అనుకున్నారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఓటీటీలోనే కాబట్టి టైమ్ పాస్ చేసేయొచ్చు. 'కల్కి' కాకుండా ఓటీటీలో మరేదైనా మూవీస్ చూద్దామనుకుంటే వీటిని ట్రై చేయండి.(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ) -
విజయ్ ఆంటోని ‘తుఫాన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మళ్లీ ఆట మొదలు
దాదాపు ఆరేళ్ల క్రితం వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రంలో రన్నర్‌గా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశారు ఫర్హాన్ అక్తర్. ఈ చిత్రానికి ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్లో మరో స్పోర్ట్స్ మూవీ ‘తుఫాన్’ తెరకెక్కుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో ఫర్హాన్ కనిపిస్తారు. అసలు సిసలైన బాక్సర్‌గా ఫిజిక్‌ని మార్చుకోవడానికి ఫర్హాన్ కసరత్తులు చేశారు. ఈ పాత్రకు అనుగుణంగా లుక్ మార్చుకున్నాక, ఆగస్టులో షూటింగ్‌ని మొదలుపెట్టారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో మొదలైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబరు 2న విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘తుఫాన్’కు తెలంగాణ సెగ
అనంతగిరి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రాంచరణ్ నటించిన సినిమాలను ఈ ప్రాంతంలో ప్రదర్శించరాదంటూ తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. రాంచరణ్ నటించిన తుఫాన్ సినిమా ప్రదర్శనలను పలుచోట్ల అడ్డుకున్నారు. వికారాబాద్ పట్టణంలోని సినిమాక్స్, శైలజ థియేటర్లలో శుక్రవారం ఉదయం 11 గంటలకు మార్నింగ్ షో ప్రారం భం కాగానే తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ తదితరులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ సినిమాక్స్ థియేటర్లోకి దూసుకుపోయారు. తెరకు అడ్డుగా నిలవడంతో సినిమా ప్రదర్శన ప్రారంభం కాలేదు. తెలంగాణవాదులు థియేటర్లోనే ఆందోళన కొనసాగిస్తుండడంతో ప్రేక్షకులంతా బయటకు వచ్చారు. తెలంగాణవాదులు థియేటర్ మేనేజర్‌తో మాట్లాడి ప్రేక్షకులందరికీ డబ్బులు తిరిగి ఇప్పించారు. అదేవిధంగా శైలజ థియేటర్లోకి కూడా తెలంగాణవాదులు దూసుకుపోయి ప్రదర్శనను అడ్డుకున్నారు. అనంతరం థియేటర్ బయటకు వచ్చి వాల్‌పోస్టర్‌ను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యాదగిరి యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్‌ను యూటీ చేయాలని, లేదంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న చిరంజీవి వ్యాఖ్యలకు నిరసనగా సినిమా ప్రదర్శనలను అడ్డుకున్నట్టు స్పష్టం చేశారు. శంషాబాద్‌లో.. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరుస్తున్న చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్‌కు తగిన రీతిలో బుద్ధి చెబుతామని టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీ, ఏబీవీపీ నేతలు పేర్కొన్నారు. రాంచరణ్ తేజ ‘తుఫాన్’ చిత్ర ప్రదర్శనను స్థానిక గణేష్ 70ఎంఎం, శ్రీలక్ష్మీ టాకీస్‌లలో అడ్డుకున్నారు. సినిమా టికెట్లు ఇవ్వకుండా నిలిపివేశారు. తెలంగాణను అడ్డుకోడానికి కేంద్ర మంత్రి చిరంజీవి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలో టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి మంచర్ల శ్రీనివాస్, నాయకులు రాజేందర్, ఆనంద్, జేఏసీ, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. పరిగిలో.. రాంచరణ్ నటించిన తుఫాన్ సినిమాకు తెలంగాణ సెగ తగిలింది. పరిగిలో చిత్రం ప్రదర్శిస్తున్న సాయికృష్ణ, శారద థియేటర్ల వద్దకు టీఆర్ఎస్వీ నాయకులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. సినిమా పోస్టర్లను చించివేయడంతో పాటు శారద థియేటర్ ఎదుట పోస్టర్లను తగులబెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్య ఉద్యమానికి కొమ్ముకాస్తున్న చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యుల సినిమాలను ప్రదర్శించబోనివ్వమని నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు సతీష్, క్లెమెంట్, పృథ్వీ, రాజశేఖర్, తేజకిరణ్, ఎం.నగేష్, పి.తేజ, కె.రాజు, నరేష్, రాకేష్‌రెడ్డి, రాధాకృష్ణ, ప్రవీణ్, అఖిల్ పాల్గొన్నారు. అనంతరం పోలీసులు సినిమా థియేటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి చిత్ర ప్రదర్శన కొనసాగేలా చూశారు. -
‘తుఫాన్’కు ఉద్యమ సెగ
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ నటించిన తుఫాన్ సినిమాకు శుక్రవారం ఉద్యమ సెగ తగిలింది. పోలీసు రక్షణలో సినిమా ప్రదర్శించాలనుకున్న థియేటర్ యజమానుల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కర్నూలులో సమైక్యవాదులు ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజ సినిమా తుఫాన్ జిల్లాలోని నంద్యాల, డోన్, కోడుమూరు, ఆదోని ప్రాంతాల్లో విడుదల చేస్తున్నట్లు యజమానులు ముందుగా ప్రకటించారు. గురువారం రాత్రి 10 గంటల వరకు తుఫాన్ సినిమాను కర్నూలులో ప్రదర్శించడం లేదంటూ చెప్పిన యజమానులు తెల్లారే లోపే.. ఆనంద్, శ్రీరామ, రాజ్, వెంకటేష్(మినీప్లెక్స్) థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్లు వాల్ పోస్టర్లు వెలిశాయి. శుక్రవారం ఉదయం 9 గంటల మధ్య థియేటర్లకు చేరుకున్న అభిమానులు టిక్కెట్లు కొనుగోలు చేశారు. పోస్టర్ల వద్ద కోర్టు ఆదేశాల మేరకు సినిమాను అడ్డుకుంటే చర్యలు తప్పవన్న గోడ పత్రికలు వెలిశాయి. సినిమా ప్రదర్శిస్తున్నట్లు సమాచారం రావడంతో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కమిటీ, వివిధ సంఘాల నాయకులు సినిమా ప్రదర్శిస్తున్న ఆనంద్ థియేటర్‌కు ర్యాలీగా బయల్దేరారు. పోస్టర్లను చింపి వేసి థియేటర్‌పై దాడికి దిగారు. పెద్ద ఎత్తున సమైక్య నినాదాలు చేస్తూ కేంద్ర మంత్రి చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. క్యాంటిన్లోని వస్తువులను చిందరవందర చేసి ప్లాస్టిక్ వస్తువులను ధ్వంసం చేశారు. రసాభాసగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సర్ది చెప్పే యత్నాలు చేశారు. ససేమిరా అన్న సమైక్యవాదులు సినిమా ప్రదర్శనను ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించకూడదని వాగ్వాదానికి దిగారు. ఎంతకూ సద్దుమణగకపోవడంతో థియేటర్ నిర్వాహకులతో మాట్లాడిన పోలీసులు సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా బంగారు పేట సమీపంలోని శ్రీరామ థియేటర్లో సినమా ప్రదర్శిస్తున్నట్లు సమాచారం మేరకు సమైక్యవాదులు అక్కడికి చేరుకున్నారు. నిలుపుదల చేయాలంటూ నినాదాలు చేస్తూ థియేటర్లోని పోస్టర్లను చింపివేశారు. అప్పటికే 700 టిక్కెట్లను బుకింగ్‌లో ఇచ్చిన థియేటర్ నిర్వాహకులు టిక్కెట్టు డబ్బులను ప్రేక్షకులకు తిరిగి ఇచ్చారు. అదే విధంగా రాజ్, వెంకటేష్(మినీప్లెక్స్), థియేటర్లలోను ప్రదర్శనలు నిలిపివేశారు. -
తుఫాన్ సినిమా పోస్టర్లకు సమైక్య వాదుల నిప్పు
అనంతపురం:కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రాంచరణ్ హీరోగా నటించిన తుఫాన్ సినిమా విడుదల కాకముందే సమైక్యవాదుల సెగ తగిలింది. రేపు విడుదల కానున్న తుఫాన్ సినిమా వాల్ పోస్టర్ కు నిప్పుపెట్టిన ఘటన జిల్లాలోని కదిరి రాధిక థియేటర్ వద్ద చోటు చేసుకుంది. తుఫాన్ సినిమాను అడ్డుకుంటామని సమైక్యవాదు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, చిరంజీవి కుటుంబ సభ్యులు సినిమాలు ఆడనిచ్చేది లేదని ఎస్కేయూ విద్యార్థి జేఏసీ నేత సదాశివరెడ్డి హెచ్చరించారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని చిరంజీవి గుర్తించలేదన్నారు. తమ ప్రాంత మనోభావాలను గుర్తించి చిరంజీవి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సినిమాను భద్రత మధ్య ఆడిస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. -
రామ్ చరణ్‌కు అగ్నిపరీక్ష!
చిరంజీవి తనయుడు రామ్ చరణ్ బాలీవుడ్లో అరంగ్రేటం చేస్తున్న 'జంజీర్' హిందీ సినిమా విడుదలపై ఆసక్తి బదులు ఉత్కంఠ నెలకొంది. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా రేపు (సెప్టెంబర్ 6)న విడుదల కాబోతోంది. తెలుగులో 'తుఫాన్' పేరుతో ఈ సినిమా రూపొందింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో 'తుఫాన్'కు చిక్కులు ఎదురయ్యే అవకాశం కన్పిస్తోంది. ఈ సినిమాను అడ్డుకుంటామని సమైక్య, వేర్పాటు ఆందోళనకారులు వేర్వేరుగా ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. అందరివాడుగా ఉన్న చిరంజీవి రాజకీయాల్లోకి రావడంతో ఆయన కుటుంబ సభ్యుల సినిమాలకు చిక్కులు ఎదురవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం జరిగిన రోజుల్లో చిరంజీవి సమైక్యవాదానికి మద్దతు తెలపడంతో తెలంగాణలో ఆయన కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకునేందుకు ఆందోళనకారులు యత్నించారు. రాష్ట్ర విభజన తర్వాత చిరంజీవి 'యూటీ' పాట ఎత్తుకోవడంతో రెండు ప్రాంతాలవారు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రభావం 'తుఫాన్'పైనా పడనుంది. 'జంజీర్' కంటే ముందు విడుదల కావాల్సిన రామ్ చరణ్ 'ఎవడు' ఈ కారణంగానే వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' కూడా విడుదలకు సిద్ధమయినా అనుకూల పరిస్థితుల కోసం ఎదురు చూస్తోంది. ఎవడు విడుదల వాయిదా పడడంతో తుఫాన్ విడుదల తేదీ కూడా వచ్చేసింది. జంజీర్ హిందీలోనూ విడుదలవుతుండడంతో తెలుగు వర్షన్‌నూ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే తమ సినిమాను అడ్డుకోకుండా చూడాలంటూ 'జంజీర్'ను నిర్మించిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తుఫాను, జంజీర్ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద రక్షణ కల్పించాలని, భద్రతా చర్యలు తీసుకోవాలని డీజీపీ, హోం శాఖలను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ 'తుఫాన్'ను అడ్డుకుంటామని సమైక్య ఆందోళనకారులు అంటున్నారు. విజయనగరంలో తుఫాన్ పోస్టర్లను దహనం చేశారు. తెలంగాణలోనూ అడ్డుకుంటామని విద్యార్థి జేఏసీలు ప్రకటించాయి. హైదరాబాద్‌లో 7న ఏపీఎన్జీవో సభ నేపథ్యంలో తెలంగాణ బంద్‌కు ఆందోళనకారులు పిలుపునివ్వడంతో 'జంజీర్' చిక్కుల్లో పడింది. ఇన్ని అవాంతరాల నడుమ 'తుఫాన్' ఎలా ముందుకు వస్తుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్లో కంటే ముందు సొంత రాష్ట్రంలోనే రామ్ చరణ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
'తుఫాను'కు రక్షణ కల్పించండి: హైకోర్టు
తుఫాను, జంజీర్ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద రక్షణ కల్పించాలని, భద్రతా చర్యలు తీసుకోవాలని డీజీపీ, హోం శాఖలను హైకోర్టు ఆదేశించింది. తమ చిత్రాన్ని అడ్డుకోకుండా చూడాలని జంజీర్ సినిమా నిర్మాతలు నిన్న హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 6న విడుదల కానున్న జంజీర్, తుఫాన్ సినిమాల ప్రదర్శన కేంద్రాలకు తగిన భద్రత కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రిలయన్స్ బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. ‘విభజన’ ఆందోళన వల్ల ఈ సినిమాల ప్రదర్శనకు ఆందోళనకారులు ఇబ్బందులు సృష్టిస్తే, తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని బుధవారం దాఖలు చేసిన పిటిషన్లో ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శిబాశిష్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను ప్రతివాదులుగా చేర్చారు. చట్ట వ్యతిరేక శక్తులు ఈ సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటామని ప్రకటించాయన్నారు.