తుఫాన్ సినిమా పోస్టర్లకు సమైక్య వాదుల నిప్పు | seemandhra supportes warned for toofan movie | Sakshi
Sakshi News home page

తుఫాన్ సినిమా పోస్టర్లకు సమైక్య వాదుల నిప్పు

Published Thu, Sep 5 2013 9:27 PM | Last Updated on Sun, Jul 14 2019 1:57 PM

seemandhra supportes warned for toofan movie

అనంతపురం:కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రాంచరణ్ హీరోగా నటించిన తుఫాన్ సినిమా విడుదల కాకముందే సమైక్యవాదుల సెగ తగిలింది. రేపు విడుదల కానున్న తుఫాన్ సినిమా వాల్ పోస్టర్ కు నిప్పుపెట్టిన ఘటన జిల్లాలోని కదిరి రాధిక థియేటర్ వద్ద చోటు చేసుకుంది. తుఫాన్ సినిమాను అడ్డుకుంటామని సమైక్యవాదు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, చిరంజీవి కుటుంబ సభ్యులు సినిమాలు ఆడనిచ్చేది లేదని ఎస్కేయూ విద్యార్థి జేఏసీ నేత సదాశివరెడ్డి హెచ్చరించారు.
 

సీమాంధ్రలో ఉద్యమాన్ని చిరంజీవి గుర్తించలేదన్నారు. తమ ప్రాంత మనోభావాలను గుర్తించి చిరంజీవి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సినిమాను భద్రత మధ్య ఆడిస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement