'తుఫాను'కు రక్షణ కల్పించండి: హైకోర్టు | andhra pradesh high court order provide security to zanjeer, toofan theatres | Sakshi
Sakshi News home page

'తుఫాను'కు రక్షణ కల్పించండి: హైకోర్టు

Published Thu, Sep 5 2013 12:10 PM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM

'తుఫాను'కు రక్షణ కల్పించండి: హైకోర్టు

'తుఫాను'కు రక్షణ కల్పించండి: హైకోర్టు

తుఫాను, జంజీర్ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద రక్షణ కల్పించాలని, భద్రతా చర్యలు తీసుకోవాలని డీజీపీ, హోం శాఖలను హైకోర్టు ఆదేశించింది. తమ చిత్రాన్ని అడ్డుకోకుండా చూడాలని జంజీర్ సినిమా నిర్మాతలు నిన్న హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 6న విడుదల కానున్న జంజీర్, తుఫాన్ సినిమాల ప్రదర్శన కేంద్రాలకు తగిన భద్రత కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది.

‘విభజన’ ఆందోళన వల్ల ఈ సినిమాల ప్రదర్శనకు ఆందోళనకారులు ఇబ్బందులు సృష్టిస్తే, తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని బుధవారం దాఖలు చేసిన పిటిషన్‌లో ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శిబాశిష్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను ప్రతివాదులుగా చేర్చారు. చట్ట వ్యతిరేక శక్తులు ఈ సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటామని ప్రకటించాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement