![Kiara Advani Interested South Films - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/24/kiyara.jpg.webp?itok=qEmujILF)
బాలీవుడ్ తారలు ఇప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమపై ఆసక్తి చూపుతున్నారనేది ఎవరు కాదనలేని నిజం. అక్కడి హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు సైతం సౌత్ ఇండియా పరిశ్రమలోని పలు చిత్రాల్లో నటించటానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం దక్షిణాది చిత్రాల అవకాశాలను ఏ మాత్రం వదులుకోవడం లేదు.
దీపిక పదుకొనే, కత్రినా కైఫ్, అలియా భట్, కంగనా రనౌత్ వంటి తారలు మన చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈ కోవలోకి నటి కియారా అద్వానీ చేరింది. బాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్. అక్కడ క్రేజీ కథానాయికగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తోంది. కాగా నటి కియారా అద్వానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ పేర్కొంటూ తాను చేసే ఏ విషయంలోనైనా ఓ ప్రత్యేకత ఉండాలని భావిస్తానంది. నటించే చిత్రాల్లో తన పాత్రలు భిన్నంగా ఉండాలని కోరుకుంటానని పేర్కొంది.
చిత్రాలపై చాలామంది పెట్టుబడి, శ్రమ ఉంటాయని, అందుకే చిత్రాలు ఎంపికలో ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పింది. తన భర్త సిద్ధార్థ్‌కు చిత్రపరిశ్రమలో మంచి పేరు ఉందని, దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పింది. ఇకపోతే తాను నటిగా రంగ ప్రవేశం చేసి పదేళ్లు అయ్యిందని, ఇప్పుడు కూడా పలువురు తనతో చిత్రాలు చేయడానికి ఎదురు చూస్తూ ఉండడం చాలా ఆనందం కలిగిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment