బాయ్‌‌కాట్‌ మీర్జాపూర్‌2‌ .. ట్విటర్‌లో హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ | Netizens Trends Boycott Mirzapur 2 Hash Tag After Trailer Launch | Sakshi
Sakshi News home page

‘దేశానికి విధేయత చూపని వారి సినిమాలు మాకోద్దు’

Published Thu, Oct 8 2020 2:58 PM | Last Updated on Thu, Oct 8 2020 3:12 PM

Netizens Trends Boycott Mirzapur 2 Hash Tag After Trailer Launch - Sakshi

ముంబై: ప్రముఖ వెబ్‌ సరీస్‌ మీర్జాపూర్‌ సీక్వెల్‌ బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో నిరసనలు వెల్లువెత్తున్నాయి. నిన్న (బుధవారం) మీర్జాపూర్‌ 2ట్రైలర్‌ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ట్విటర్‌ యూజర్‌లు ట్రైలర్‌ విడుదలకు ముందు నుంచే మీర్జాపూర్‌ 2ను బాయ్‌కాట్‌ చేయాలంటూ #BoycottMirzapur2 అనే పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ సిరీస్‌లో హీరోగా నటిస్తున్న ఫజల్‌ అలీ, సహా నిర్మాత ఫర్హాన్‌ అక్తర్‌లు. గతేడాది  వీరు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు మద్దతునిచ్చారు. వారి తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ ‘తమ దేశానికి విధేయత చూపని నటుల సినిమాలు కానీ వెబ్‌ సిరీస్‌లు కానీ మాకోద్దు #BoycottMirzapur2’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను‌ ట్రెండ్‌ చేస్తున్నారు. (చదవండి: మీర్జాపూర్‌ 2 ట్రైలర్‌ విడుదల)

మరోవైపు మిర్జాపూర్‌ సీజన్‌2 కోసం ఎంతో ఆస్తక్తిగా ఎదురు చుస్తున్నామంటూ అభిమానులు ట్వీట్‌ చేస్తున్నారు. ‘మీర్జాపూర్ 2 ట్రైలర్ ఆశాజనకంగా ఉంది’ ఈ సిరీస్‌ కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్న.. ట్రైలర్‌ చూస్తుంటే ఉత్సాకంగా ఉంది. మొదటి సిజన్‌ తరహాలోనే సిక్వేల్‌ కూడా సూపర్‌ హిట్‌ అవుతుంది’ అంటూ అభిమాను ట్వీట్‌ చేస్తున్నారు. అంతా బాగుంటే వచ్చే నెలలో ప్రుముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమోజాన్‌ ప్రైంలో మీర్జాపూర్‌ విడుదల కావాల్సీంది. అయితే ఈ వివాదాల మధ్య మరి మీర్జాపూర్‌2‌ విడుదల అవుతుందో లేదో వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement