విడాకులు తీసుకున్న మరో నటుడు | Farhan Akhtar, Adhuna Bhabani get divorce | Sakshi
Sakshi News home page

విడాకులు తీసుకున్న మరో నటుడు

Published Tue, Apr 25 2017 6:38 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

విడాకులు తీసుకున్న మరో నటుడు

విడాకులు తీసుకున్న మరో నటుడు

ముంబై: బాలీవుడ్‌లో మరో నటుడు భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. నటుడు, దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌, ఆయన భార్య సెలెబ్రిటీ హెయిర్‌ స్టైలిస్ట్‌ ఆధునా భావని 16 ఏళ్ల వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. కోర్టులో వీరిద్దరికీ విడాకులు మంజూరయ్యాయి.

గతేడాది భార్య నుంచి విడిపోతున్నట్టు ఫర్హాన్‌ సోషల్ మీడియాలో ప్రకటించాడు. గతేడాది అక్టోబర్‌లో బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. కోర్టు ఇచ్చిన ఆరు నెలల గడువు ముగియడంతో ఫర్హాన్‌, ఆధున ఇద్దరూ సోమవారం కోర్టుకు వచ్చి పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. దీంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఫర్హాన్, ఆధున రెండేళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిల్లలు తల్లి సంరక్షణలో ఉంటారు. వారి బాధ్యతలను ఫర్హాన్ చూసుకుంటాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement