భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రచారం కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్ లో పాటు ఓ పాటను కూడా రిలీజ్ చేశారు. తాజాగా మరో పాటను ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ పాటకు ఓ ప్రత్యేక ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ పాటను ఓ బాలీవుడ్ దర్శక నటుడు ఆలపించారు. ఐ డోంట్ నో అంటూ సాగే ఈ పాటను ఫర్హాన్ అక్తర్ ఆలపించారు. ఈ విషయాన్ని ఫర్హాన్ స్వయంగా తెలుగులో ప్రకటించటం విశేషం.
ఈ పాటను స్పెయిన్‌లో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న భరత్ అనే నేను ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద‍్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, దేవరాజ్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment