టీవీ షోకి... ప్రియాంక పాట
ప్రియాంకా చోప్రా మంచి నటి మాత్రమే కాదు... మంచి గాయని కూడా. ఆమె రూపొందించిన ‘ఎగ్జోటికా’ ఆల్బమ్ ఆ విషయాన్ని నిరూపించింది. వీలు కుదిరినప్పుడల్లా పాటలు పాడాలని ప్రియాంక అనుకుంటున్నారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘దిల్ ధడక్‌నే దో’ చిత్రం కోసం ఫర్హాన్ అఖ్తర్‌తో కలిసి ప్రియాంక పాడిన టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈసారి టీవీ షో కోసం పాడనున్నారు. అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’లో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో కోసం రూపొందించనున్న మ్యూజికల్ ఆల్బమ్‌కే ఆమె పాడనున్నారు.