మరో సవాల్‌కి సిద్ధం!
మరో సవాల్‌కి సిద్ధం!
Published Mon, Apr 14 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM
నటుడిగా తనను సవాల్ చేసే పాత్రలను చేయడానికి అమితాబ్ బచ్చన్ ఎప్పుడూ వెనకాడరు. అందుకు ఉదాహరణ ‘పా’ చిత్రం. ఓ వింత వ్యాధికి గురయ్యే పన్నెండేళ్ల బాలుడిగా ఆ చిత్రంలో నటించారు బిగ్ బి. తాజాగా మరో సవాల్‌ని స్వీకరించారు. ఈసారి పక్షవాతానికి గురైన వ్యక్తిగా నటించనున్నారు అమితాబ్. బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ హీరో. చెస్ ప్లేయర్ కావాలని, విజేతగా నిలవాలనే ఆకాంక్ష ఉన్న యువకుడి పాత్ర చేయనున్నారు ఫర్హాన్. తనకు గురువు అమితాబ్ అన్నమాట. చెస్ గ్రాండ్ మాస్టర్ అయిన అమితాబ్ పడక మీదే ఉండి తన శిష్యుడికి చెస్ నేర్పించి, విజేతగా నిలబెట్టడానికి ఎలాంటి ప్రయత్నం చేశారనేదే ఈ చిత్రం ప్రధానాంశం. ఈ కథ వినగానే అమితాబ్ మరో ఆలోచనకు తావు లేకుండా వెంటనే పచ్చజెండా ఊపేశారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు.
Advertisement
Advertisement