
ముంబై : బాలీవుడ్‌లో హాట్ జంగా గుర్తింపు తెచ్చుకున్న హృతిక్-కంగనల వివాదం ఏడాది కాలంగా నలుగుతున్నా.. తాజాగా మాత్రం మరింత బజారుకెక్కింది. ఇద్దరు నటులు తమ వ్యక్తిగత స్థాయిలను దిగజార్చుకునేలా ప్రవర్తిస్తూ.. ఆరోపణ.. ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇద్దరి వివాదం బాలీవుడ్ మొత్తం సమస్యగా తయారైనట్లుంది పరిస్థితి కొందరు హృతిక్‌ను సమర్థిస్తుంటే.. మరికొందరు కంగన చేసింది కరెక్ట్ అంటున్నారు.
కంగన-హృతిక్ వివాదంలో రెండు రోజుల కిందట తానెందుకు హృతిక్‌ను సమర్థిస్తున్నానో వివరిస్తూ.. ఫరాన్ అక్తర్ రాసిన లేఖ అత్యంత వివాదాస్పదంగా మారింది. ఫరాన్ లేఖలో ప్రస్తావించిన అంశాలతో ఏకీభవిస్తున్నట్లు తాజాగా సోనమ్ కపూర్, కరణ్ జోహార్ ప్రకటించారు. అంతేకాక తమ వ్యక్తిగత మద్దతును హృతిక్‌కు ప్రకటించారు.
ఫరాన్ అక్తర్ లేఖకు మద్దతు ప్రకటించిన సోనమ్, కరణ్ జోహార్‌పై కంగన సోదరి రంగోలి చెందెల్ నిప్పులు చెరిగారు. కంగనను ద్వేషించే వాళ్లంతా ఒక కూటమిగా మారారని ఆరోపించారు. కరణ్‌జోహార్, సోనమ్ కపూర్‌లను విమర్శిస్తూ వరుసల ట్వీట్లు చేశారు. ఏం చూసి మీరు హృతిక్ చేసిందాన్ని సమర్థిస్తున్నారు? అసలు నిజానిజాలు మీకు తెలుసా? ఏ విషయంపై అయినా స్పందించేందుకు నిజానిజాలు తెలుసుకోవాలి? అంటూ రంగోలి చందెల్ దూకుడుగా ట్వీట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment