
బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్ అక్తర్, శిబాని దండేకర్‌ను ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నట్లు వారు సోషల్ మీడియా వేదికగా పెట్టే పోస్ట్‌లను చూస్తే అర్థమవుతుంది. తాజాగా వీరిద్దరూ దిగిన ఫొటోను షిబాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. షిబాని మెరుస్తున్న ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో ఫర్హాన్‌ను కౌగిలించుకుని ఉంది. ఫర్హాన్ వైట్ అండ్ వైట్ జాకెట్లో సింపుల్ కూల్‌గా ఉన్నాడు.
అయితే ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఫొటోలో షిబానికి కొంచెం బేబీ బంప్ ఉన్నట్లు గమనించారు నెటిజన్లు. దీంతో ఆమె తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోందని భావిస్తున్నారు ఇంటర్నెట్ యూజర్లు. 'కంగ్రాచ్యులేషన్స్ టు ది లిటిల్ వన్' అని ఒక ఇన్‌స్టా యూజర్ రాయగా, మరొకరు 'మీరు గర్భవతి ఆ?' అని కామెంట్ పెట్టారు. ఇంకొకరు 'ఆమె గర్భవతిలా కనిపిస్తోంది' అని రాశారు. ఇదిలా ఉంటే ఇదే పోస్ట్‌లో షిబానీ మోచేతిపై టాటూను కూడా గమనించారు నెటిజన్లు. ఆ టాటూలో వారి వివాహం జరిగిన తేది ఫిబ్రవరి 21, 2022 అని అర్థం వచ్చేలా రోమన్ అంకెల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment