Paresh Rawal
-
OTT: ‘శాస్త్రి విరుద్ధ్ శాస్త్రి’ మూవీ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘శాస్త్రి విరుద్ధ్ శాస్త్రి’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సినిమా అన్నది వినోద సాధనమన్న విషయం మనందరికీ తెలుసు. మన కథలనే మనం వెండితెర మీద చూసుకుని మనమే ముచ్చటపడతాం. ఓ రకంగా చెప్పాలంటే సినిమా అన్నది మన జీవితాలకు అద్దం లాంటిదన్నమాట. చాలా సినిమాలు ఆనందాన్నిస్తే కొన్ని సినిమాలు మాత్రం మనలో ఆలోచనలను రేకెత్తిస్తాయి. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఇటీవల విడుదలైన ‘శాస్త్రి విరుద్ధ్ శాస్త్రి’ ఈ కోవలోకి చెందినదే. నందితా రాయ్, ముఖర్జీ సంయుక్త దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ సున్నిత అంశానికి మూలాధారం. తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతుడైన పరేష్ రావెల్ ఈ సినిమాలో గురూజీగా పిలవబడే ప్రధాన పాత్ర పోషించారు.కథాంశానికొస్తే... ఏడేళ్ల యమన్ శాస్త్రి వారం మొత్తం తన నానమ్మ, తాతయ్యల దగ్గర ఉంటూ వారాంతంలో తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వస్తూ ఉంటాడు. కొంత కాలానికి యమన్ శాస్త్రి తల్లిదండ్రులకు ఈ విషయం రుచించదు. తమ బిడ్డ మొత్తానికే తమ దగ్గర ఉండాలని మలర్ శాస్త్రి తన తండ్రైన మనోహర్ శాస్త్రిని ఉరఫ్ గురూజీని అడుగుతాడు. దానికి ఆయన ససేమిరా అంటూ వారాంతంలో మాత్రమే బిడ్డను చూసుకునే తీరిక కలిగిన మీ దగ్గర యమన్ సరిగా ఇమడలేడు అని నిక్కచ్చిగా చెబుతాడు. అయినా యమన్ విషయంలో మలర్ పట్టుబడతాడు. ఇక చేసేది లేక గురూజీ తన మనవడి కోసం తన కొడుకు, కోడలిపై కోర్టులో కేసు వేస్తాడు. ఈ కేసులో మనవడి మీద తాత మమకారం గెలుస్తుందా లేక తల్లిదండ్రుల అనురాగం గెలుస్తుందా? అన్నది ‘శాస్త్రి విరుద్ధ్ శాస్త్రి’ సినిమాలోనే చూడాలి. ఇది నేటి తరానికి ఓ చక్కటి లైబ్రరీ మూవీ అని చెప్పాలి. ఉరుకుల పరుగుల మన నిత్య జీవితంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత వంటివి కూడా తల దించుకుని మొబైల్ స్క్రీన్లోనే చూస్తున్నాము తప్ప తల ఎత్తి సాటి వ్యక్తులను చూడడం కూడా లేదు. అందుకే ‘శాస్త్రి విరుద్ధ్ శాస్త్రి’ సినిమా మనందరికీ ఓ మేలుకొలుపులాంటిది, మనమందరమూ తెలుసుకోవాల్సిన విషయం చాలానే ఉంది ఈ సినిమాలో. రేపటి మీ పిల్లల భవిష్యత్తు కోసం నేడు రెండుగంటలు వెచ్చించి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా చూడండి.– ఇంటూరు హరికృష్ణ -
ఓటు వేయనివారిపై నటుడు పరేష్ రావల్ ఆగ్రహం
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నేడు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ ఓటింగ్ కొనసాగుతోంది. దేశంలోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ తన ఓటు హక్కు వినియోగంచుకోవడంతో పాటు ఓటర్లందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.నటుడు పరేష్ రావల్ తన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పరేష్ రావల్ ఓటు వేయని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చాలామంది ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఆరోపిస్తుంటారు. అయితే మన వంతుగా ఓటు వేయడం అనేది మన బాధ్యత. ఓటు వేయకుంటే దాని పర్యవసానం కూడా మనమే ఎదుర్కొంటాం. దానికి ప్రభుత్వం బాధ్యత వహించదు’ అని పరేష్ రావల్ పేర్కొన్నారు. #WATCH | Bollywood actor Paresh Rawal says, "...There should be some provisions for those who don't vote, like an increase in tax or some other punishment." pic.twitter.com/sueN0F2vMD— ANI (@ANI) May 20, 2024 -
లండన్ కాలింగ్
లండన్‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారట హీరోయిన్ వాణీ కపూర్. విహార యాత్ర కోసం కాదు. షూటింగ్ కోసం సూట్‌కేస్ సర్దుకోనున్నారు వాణీ కపూర్. దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె హిందీ చిత్రం అంగీకరించారు. పరేష్ రావల్, వాణీ కపూర్, అపర్శక్తి ఖురానా ప్రధాన ΄ాత్రధారులుగా ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. నవ్యజోత్ గులాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ కథ రీత్యా వాణీ కపూర్, అపర్శక్తి సోదరీ సోదరుడుగా నటించనున్నారట. ప్రస్తుతం మానవ సంబంధాలు ఏ విధంగా మారుతున్నాయి? ఈ మార్పులు వారి కుటుంబాలపై ఎలాంటి ప్రభావాలను చూపిస్తున్నాయి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని టాక్. ఈ సినిమా చిత్రీకరణను ముందుగా వేసవిలో లండన్‌లో ΄్లాన్ చేస్తున్నారట. ఎక్కువ శాతం షూటింగ్ అక్కడే జరుగుతుందట. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలన్నది చిత్ర యూనిట్ ΄్లాన్ అని భోగట్టా. -
నటుడు పరేశ్ రావల్ ఇంట తీవ్ర విషాదం..
ప్రముఖ నటుడు పరేశ్ రావల్ అత్తయ్య డాక్టర్ మృదుల సంపత్(92) ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సోమవారం (ఏప్రిల్ 3న) నాడు ఆమె మరణించగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరేశ్ రావల్ సతీమణి సంపత్ రావల్.. సోషల్ మీడియాలో తల్లిని గుర్తు చేసుకుంటూ ఆమె ఫోటో షేర్ చేసింది. కాగా పరేశ్ రావల్ విషయానికి వస్తే.. అతడు 'అర్జున్' సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేశాడు. 'నామ్' చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. 1980-90 మధ్య కాలంలో దాదాపు వంద చిత్రాలు చేశాడు. రూప్‌కీ రాణి చరణ్ కా రాజా, కబ్జా, కింగ్ అంకుల్, రామ్ లకణ్, దావూద్, బాజీ సినిమాల్లో విలన్‌గానూ నటించాడు. హీరా ఫేరి సినిమాతో మంచి మార్కులు పట్టేశాడు. హిందీలో ఎన్నో సినిమాలు చేసిన ఆయన తెలుగులో శంకర్‌దాదా ఎంబీబీఎస్ సహా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. సినీరంగంలో ఆయన చేసిన సేవలకుగానూ 2014లో ఆయనకు పద్మశ్రీ అవార్డు వరించింది. View this post on Instagram A post shared by Swaroop Rawal (@rawalswaroop) -
శర్మాజీ నమ్కీన్... ఓ రిటైరైన నాన్న కథ
‘అమితాబ్ బచ్చన్ రిటైర్ కాలేదు. నేనెందుకు కావాలి’ అంటాడు ఈ సినిమాలో శర్మాజీ అనే తండ్రి. అమితాబ్‌కు 78. శర్మాజీకి 58. వి.ఎర్.ఎస్ ఇవ్వడం వల్లో రిటైర్మెంట్ వల్లో తండ్రులు పనికి దూరం అవుతారు. ఇక వారి జీవితం ముగిసినట్టేనా? ఆశలు, ఆకాంక్షలు అంతమేనా? అసలు రిటైర్ అయిన తండ్రులను ఎంతమంది పిల్లలు అర్థం చేసుకుంటున్నారు? రిషి కపూర్ చివరి సినిమా ‘శర్మాజీ నమ్కీన్’. మరో విశేషం ఏమంటే రిషి మరణం వల్ల మిగిలిన సినిమాని అదే పాత్ర పోషించి పరేశ్ రావెల్ మెప్పించటం! ఈ వారం సండే సినిమా. ఈ సినిమాలో రిటైర్ అయిన శర్మాజీ, అతని స్నేహితుడు ‘బాగ్బన్’లోని క్లయిమాక్స్‌ను ఫోన్లో చూస్తుంటారు. శర్మాజీ ఫ్రెండ్ అయిన శిక్కు చెడ్డా ‘దీనిని కాలేజీ పిలకాయలందరికీ సిలబస్‌గా పెట్టాలి’ అంటాడు. ఎందుకంటే అమితాబ్– హేమమాలిని నటించిన బాగ్బన్లో పిల్లల నిర్లక్ష్యానికి లోనయ్యే తల్లిదండ్రులను చూపిస్తారు. అయితే ‘శర్మాజీ నమ్కిన్’ ఈ సమస్యను తీసుకోకుండా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండే గ్యాప్‌ను చర్చిస్తుంది. వారి వైపు ఉండే కథలను వినాలని చెబుతుంది. కథ ఏమిటి? ఢిల్లీలో మిడిల్‌క్లాస్ కాలనీలో ఉండే శర్మాజీ (రిషి కపూర్) తాను పని చేసే మిక్సీ, గ్రైండర్ తయారీ ఫ్యాక్టరీ నుంచి వి.ఆర్.ఎస్. తీసుకుంటాడు. అంటే ఫ్యాక్టరీయే అతనికి వి.ఎర్.ఎస్. ఇచ్చి పంపిస్తుంది, అది దివాలా తీయడంతో. ఇంట్లో భార్య ఉండదు. చాలా ఏళ్ల క్రితమే డబుల్ టైఫాయిడ్ తో చనిపోయి ఉంటుంది. పెద్ద కొడుకు ఉద్యోగం. చిన్న కొడుకు కాలేజీ. శర్మాజీకి ఉత్సాహం ఉంది. జీవితాన్ని ఆస్వాదించాలని ఉంది. ఏదో ఒకటి చేస్తూ పనికొచ్చేలా ఉండాలని ఉంది. టీవీ చూసి చూసి, ఖాళీగా ఉండి ఉండి బోర్ కొడుతుంది. ‘నాకు బోర్ కొడుతుంది’ అని పిల్లలతో అంటే ‘ట్రావెల్ చెయ్యి. లేదా రెస్ట్ తీసుకుని ఎంజాయ్ చెయ్యి’ అంటారు తప్ప ఇంకో పనేదైనా చేస్తానంటే ఒప్పుకోరు. 58 ఏళ్లొస్తే ఏ పని చేయకుండా ఎందుకు ఉండాలి ఇదేం రూలు అంటాడు శర్మాజీ. చివరకు అతని ఫ్రెండ్ అతనికి ఒక సలహా ఇస్తాడు. ‘నీకు వంట బాగా వచ్చు కదా. నాకు తెలిసిన వాళ్లు కిట్టీ పార్టీలు చేసుకుంటూ మంచి వంటవాడు కావాలంటుంటాడు. నువ్వెళ్లి వండు. కాలక్షేపం.’ అంటాడు. శర్మాజీకి నిజంగానే వంట బాగా వచ్చు. ‘ఇంత బతుకు బతికి వంటవాడిగా మారడమా’ అని ముందు తటపటాయించినా చివరకు అంగీకరిస్తాడు. అలా కిట్టీ పార్టీలు చేసుకునే ఒక స్త్రీల బ్యాచ్‌తో అతనికి స్నేహం ఏర్పడుతుంది. ఇదంతా కొన్నాళ్లు పిల్లలకు తెలియకుండా జరిగినా ఆ తర్వాత పిల్లలకు తెలియడంతో వాళ్లు మా పరువేం కాను అని గొడవకు దిగుతారు. చివరకు ఇద్దరూ ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారన్నది క్లయిమాక్స్. వారి మనసులో ఏముంది? ‘శర్మాజీ నమ్కిన్’లో దర్శకుడు తెలివిగా ఒక విషయాన్ని చెబుతాడు. రిటైర్ అయిన తల్లిదండ్రుల భావోద్వేగాలు ఏమిటో ఎవరూ పట్టించుకోరు అనేది ఒకటి– మిడిల్ ఏజ్‌కు వచ్చిన వివాహిత స్త్రీలు తమకు వ్యాపకాలు లేక చేసేందుకు పని లేక కుటుంబాలకే జీవితాలు అంకితం చేసి చేసి విసిగిపోతున్నారనేది ఒకటి. శర్మాజీ లాంటి రిటైర్ అయిన వాళ్లు, కిట్టీ పార్టీ చేసుకునే మధ్య వయసు స్త్రీలు ఒకరి సమస్యను మరొకరు సానుభూతితో అర్థం చేసుకుంటారు. ఒకరికి మరొకరు సపోర్ట్‌గా నిలుస్తారు. అలాగే శర్మాజీ పెద్ద కొడుకు తనకు ఉద్యోగంలో ప్రమోషన్ రాగానే ఇంటి నిర్ణయాలు తానే తీసుకోగలను అనుకుంటూ ఉంటాడు. ఆ మిడిల్ క్లాస్ ఇంటి నుంచి పెద్ద ఫ్లాట్‌లోకి మారాలని అతని కోరిక. ఇక్కడే మీ అమ్మ చనిపోయింది... నేను కూడా ఇక్కడే పోతాను... రాను అని తండ్రి అంటుంటాడు. తనకు బయట ఏవైనా సమస్యలు వస్తే తండ్రితో మనసు విప్పి చెప్పుకోడు. అలాగే తండ్రి కూడా తన మనసులో ఏముందో చెప్పుకునేంత స్పేస్ ఇవ్వడు. ఇలాంటి పిల్లలు ఇప్పుడు అన్ని చోట్లా ఉన్నారు. శర్మాజీ వంటి తండ్రులు కూడా. వీళ్లు తమను ఈ సినిమాలో చూసుకుంటారు. రిషి చివరి సినిమా రిషి కపూర్ ఈ సినిమా యాభై శాతం ముగించాక అనారోగ్యం వల్ల మరణించాడు. సినిమా ఎలా పూర్తి చేయాలనే సమస్య వచ్చింది. రణ్‌బీర్ కపూర్ తాను ఆ వేషాన్ని పూర్తి చేద్దామని అనుకున్నాడు. చివరకు పరేష్ రావెల్ తాను మిగిలిన పోర్షన్ చేస్తానని ముందుకు వచ్చాడు. రిషి కపూర్ పూర్తి చేయని సీన్లన్నీ పరేష్ చేశాడు. అంటే సినిమా అంతా ముందు వెనుకలుగా రిషి కపూర్, పరేశ్ రావెల్ వస్తూనే ఉంటారు. అయితే ఇద్దరూ మంచి నటులు కాబట్టి ఆడియెన్స్ అసౌకర్యంగా భావించరు. కాని రిషి కపూర్ ఎక్కువ నచ్చుతాడు. జూహీ చావ్లా చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో రిషి కపూర్ పక్కన కనిపిస్తుంది. సినిమా మొదట్లో రణ్‌బీర్ తన తండ్రి నటించిన ఈ సినిమా గురించి భావోద్వేగంతో మాట్లాడతాడు. సినిమా ముగిశాక రిషి కపూర్ ఆన్ లొకేషన్ షాట్స్ రన్ అవుతూ ఉంటే ఇన్నాళ్ల పాటు అతడు పంచిన వినోదం, అతడు ఇచ్చిన సినిమాలు గుర్తొచ్చి మనసు భారం అవుతుంది. తేలికపాటి హాస్యంతో సాగిపోయే ఈ సినిమా అమేజాన్ ప్రైమ్‌లో మార్చి 31న విడుదలైంది. చూడండి. -
ట్విటర్ ట్రెండ్: ఈ సినిమాను అస్సలు చూడకండి!
Boycott Toofaan మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమాకు సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్, మ్రునాల్ థాకూర్ జోడిగా నటించిన ‘తూఫాన్’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ లో చూడొద్దంటూ రిక్వెస్టులు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో గత రాత్రి చెలరేగిన దుమారం.. ఇంకా నడుస్తూనే వస్తోంది. తూఫాన్ కథలో భాగంగా ఫర్హాన్‌ది ఒక గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. ప్రియురాలు మ్రునాల్ ప్రోత్సాహంతో బాక్సింగ్ ఛాంపియన్‌గా మారతాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇందులో ఫర్హాన్ క్యారెక్టర్ పేరు అజిజ్ అలీ. మ్రునాల్ పాత్ర పేరు డాక్టర్ పూజా షా. ఈ పేర్లే అభ్యంతరాలకు కారణం అయ్యాయి. బాయ్‌కాట్ తూఫాన్కు బలం ఇచ్చాయి. ఇది సంప్రదాయానికి విరుద్ధం, మతాంతర కథలను ప్రోత్సహించకూడదని కొందరు వాదిస్తున్నారు. అయితే గతంలో సీఏఏకి వ్యతిరేకంగా ఫర్హాన్ నిరసనల్లో పాల్గొన్నాడు. దీంతో రివెంజ్ తీర్చుకునేందుకు టైం వచ్చిందని మరికొందరు ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌లో చేతులు కలపడం విశేషం. Trending in India 🇮🇳 Say Loudly #BoycottToofaan 📢@beingarun28 pic.twitter.com/XfSxne5sy1 — Keshav Pandey (@KeshavPandeyWB) July 10, 2021 Remember this 👇#BoycottToofaan pic.twitter.com/32ZKNvpDtz — कुंवर अजयप्रताप सिंह 🇮🇳 (@iSengarAjayy) July 10, 2021 ఇదిలా ఉంటే ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత.. మరోసారి ‘తూఫాన్’ కోసం ఒళ్లు హూనం చేసుకున్నాడు ఫర్హాన్. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో విలక్షణ నటుడు పరేష్ రావెల్, ఫర్హాన్‌కు కోచ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. షెడ్యూల్ ప్రకారం.. జులై 16న అమెజాన్ ప్రైమ్‌లో ‘తూఫాన్’ స్ట్రీమింగ్ కానుంది. It took about two years to bring the boxer persona to life. This wouldn't have been possible without the belief & support of this amazing team. Watch my boxing journey here.https://t.co/T5ccRHIlYu@excelmovies @PrimeVideoIN — Farhan Akhtar (@FarOutAkhtar) July 9, 2021 -
నేను చనిపోలేదు.. ఎక్కువ సేపు నిద్రపోయానంతే: నటుడు
తను మరణించినట్లు వస్తున్న వార్తలను బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ ఖండించారు. ‘‘నేను చనిపోలేదు ఎక్కువ సేపు నిద్రపోయానంతే’’ అంటు ఆయన స్పష్టత నిచ్చారు. కాగా శుక్రవారం ఉదయం 7 గంటలకు పరేశ్ రావల్ మరణించినట్లుగా ట్విటర్లో ఓ నెటిజన్ పోస్టు షేర్ చేశాడు. అది చూసిన రావల్ స్పందిస్తూ తన మరణ వార్తపై చమత్కరించారు. ఆయన ట్వీట్ చేస్తూ.. ‘అపోహ కలిగించిందుకు మన్నించాలి. ఉదయం 7 దాటాకా కూడా ఎక్కువ సమయం నిద్రపోయానంతే. నేను మరణించలేదు’ అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశారు. దీంతో నెటిజన్లు శతమానం భవతి అంటూ ఆయనను ఆశీర్వదిస్తుంటే మరికొందరు ఇలా తప్పుగా ట్వీట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలంటూ మండిపడుతున్నారు. కాగా పరేశ్ రావల్ తెలుగులో చిరంజీవి హిట్ మూవీ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లో లింగం మామ పాత్రతో గుర్తింపు పొందారు. దీనితో పాటు ఆయన టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. కరోనా సెకండ్ వేవ్ భారత సినీ పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, దర్శక-నిర్మాతలు మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు బతికున్న నటులు సైతం కరోనాతో మరణించారంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ సింగర్ లక్కీ ఆలీ, నటుడు ముఖేష్ కన్నాలు కోవిడ్‌తో మరణించినట్లు వార్తలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ వార్తలను వారు ఖండిస్తూ తాము చనిపోలేదని, బ్రతికే ఉన్నామంటూ ప్రకటనలు ఇచ్చారు. మేం బతికిఉన్నామంటూ మేమే ప్రకటించుకోవాల్సి రావడం దురదృష్టకరమంటూ ముఖేష్ కన్నా వ్యాఖ్యానించినప్పటికి, తాజాగా పరేశ్ రావల్‌పై ఇలాంటి తప్పుడు వార్తలు రావడం గమనార్హం. 🙏...Sorry for the misunderstanding as I slept past 7am ...! pic.twitter.com/3m7j8J54NF — Paresh Rawal (@SirPareshRawal) May 14, 2021 -
ఓ మై గాడ్ 2
అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ముఖ్య పాత్రల్లో 2012లో వచ్చిన హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’. సోషల్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. నాస్తికుడిగా పరేష్, దేవుడిగా అక్షయ్ కుమార్ కనిపించిన ఈ సినిమాకు ఉమేశ్ శుక్లా దర్శకుడు. ఈ సినిమాను తెలుగులో ‘గోపాలా గోపాలా’గా రీమేక్ చేశారు వెంకటేశ్, పవన్ కల్యాణ్. తాజాగా ‘ఓ మై గాడ్’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతోంది. సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని టాక్. వేసవిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన ఉమేశ్ శుక్లా ఈ సీక్వెల్‌ను డైరెక్ట్ చేయడంలేదట. -
రిషీ బదులు రావల్
బాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ రిషీ కపూర్ గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే. అయన పూర్తి చేయని చిత్రాన్ని పూర్తి చేయడానికి మరో స్టార్ యాక్టర్ సిద్ధమయ్యారు. రిషీ కపూర్ ప్రధాన పాత్రలో గత ఏడాది ఆరంభమైన చిత్రం ‘శర్మాజీ నమ్కీన్’. హితేష్ భాటియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కథ అరవై ఏళ్ల శర్మాజీ అనే వ్యక్తి జీవితం చూట్టూ తిరుగుతుంది. ఆ పాత్రను రిషీ కపూర్ అంగీకరించారు. అయితే ఇంకా సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు. ఈలోగా రిషీ కపూర్ మరణించారు. ఇప్పుడు ఆయన పాత్రలో పరేష్ రావల్ నటించి, ఆ సినిమాను పూర్తి చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుంది. ఈ సినిమాను రిషీ కపూర్ పుట్టినరోజున (సెప్టెంబర్ 4) థియేటర్స్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
హద్దులు చెరిపిన ఆకాశం
చిత్రం: ఆకాశం నీ హద్దురా; తారాగణం: సూర్య, అపర్ణా బాలమురళి, పరేశ్ రావల్, మోహన్ బాబు; మాటలు: రాకేందు మౌళి; సంగీతం: జి.వి. ప్రకాశ్ కుమార్; కెమెరా: నికేత్ బొమ్మిరెడ్డి; నిర్మాత: సూర్య; రచన – దర్శకత్వం: సుధ కొంగర; రిలీజ్ తేదీ: నవంబర్ 12; ఓటీటీ వేదిక: అమెజాన్; ఏ రంగంలో పైకి రావాలన్నా, ఏ కొత్త ఆలోచనైనా జనామోదం పొందాలన్నా ఎన్నో కష్టనష్టాలు తప్పవు. ఆ పురిటినొప్పులు భరిస్తేనే అంతిమ విజయం వరిస్తుంది. పౌర విమానయాన రంగంలో సామాన్య పౌరుడికి కూడా విమానంలో చౌకధరకు చోటివ్వాలని తపించిన ఓ మంచి మనిషి కథ ఇది. ‘ఎయిర్ దక్కన్’ ఫౌండర్ కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా, సినిమాటిక్ కల్పనలు జోడించి మహిళా దర్శకురాలు సుధ కొంగర చేసిన స్ఫూర్తిదాయక ప్రయత్నం – ‘ఆకాశం నీ హద్దురా’. కథేమిటంటే..: చుండూరు అనే చిన్న ఊళ్ళో మాస్టారు రాజారావు కొడుకు చంద్రమహేశ్ (సూర్య). నిమ్న వర్గానికి చెందినవాడైనా ఆ ఊరికి కరెంట్ తెప్పించడంలో, చివరకు రైలు హాల్టు వచ్చేలా కృషి చేయడంలో రాజారావు ఎంతో కృషి చేస్తాడు. అహింస, అర్జీ పద్ధతుల్లో సాగే రాజారావు పోరాటాన్ని తరాల అంతరంతో కొడుకు హర్షించడు. తల్లి పార్వతి (ఊర్వశి) సయోధ్యకు ప్రయత్నించినా, కొడుకు వినడు. నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో చదువుకొని, ఎయిర్ ఫోర్స్ లో చేరతాడు. అంతిమ ఘడియల్లో ఉన్న తండ్రిని చూడడానికి విమానంలో వద్దామన్నా, డబ్బు చాలక టైమ్‌కి రాలేకపోతాడు హీరో. ఆ బాధతో ఎలాగైనా సామాన్యమైన ఊరి జనం మొత్తానికీ చౌకధరకు విమానయానం అందుబాటులోకి తేవాలనుకుంటాడు. ఆ క్రమంలో అతనికి చిన్నస్థాయి నుంచి పైకి ఎదిగిన జాజ్ ఎయిర్ లైన్స్ అధిపతి పరేశ్ గోస్వామి (పరేశ్ రావల్) ప్రేరణ అవుతారు. తీరా అదే పరేశ్ అసూయతో, అహంకారంతో హీరో ప్రయత్నానికి అడుగడుగునా అడ్డుపడతాడు. చివరకు హీరో ఎలా తన కలను నిజం చేసుకున్నాడో మిగతా కథ. ఎలా చేశారంటే..: కుగ్రామంలో పుట్టి, ఎడ్లబండి మీద తిరిగిన కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ జీవిత అనుభవాల ఆత్మకథ ‘సింప్లీ ఫ్లయ్’ ఈ సినిమాకు ప్రధాన ఆధారం. వరుసగా ఫ్లాపులతో ఉన్న హీరో సూర్య ఆ పాత్రను ఆవాహన చేసుకొని, అభినయించారు. ఆర్థిక స్వావలంబన, అదే సమయంలో భర్తకు అన్నిఅండగా నిలిచే మనస్తత్వం కలిసిన బలమైన హీరోయిన్ పాత్రలో అపర్ణ మనసుకు హత్తుకుంటారు. హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాలు, సంభాషణలు చూస్తే, మంచి మణిరత్నం సినిమా చూస్తున్నామనిపిస్తుంది. విలన్‌గా పరేశ్ రావల్ తక్కువ మాటలతో, ఎక్కువ భావాలు పలికిస్తూ బాగున్నారు. వైమానికదళ అధికారి పాత్రలో మోహన్ బాబు బాగున్నారు. కానీ, ఆ పాత్ర రూపకల్పన, కథ చివరకు వచ్చేసరికి దక్కిన ప్రాధాన్యం ఆశించినంత బలంగా లేవు. హీరో తల్లితండ్రుల మొదలు స్నేహితులు, గవర్నమెంట్ ఆఫీసు అధికారుల దాకా చాలా పాత్రలు నిడివితో సంబంధం లేకుండా మనసుపై ముద్ర వేస్తాయి. ఎలా తీశారంటే..: మణిరత్నం వద్ద పనిచేసిన డైరెక్టర్ సుధ కొంగరపై తన గురువు సినిమా టేకింగ్ ప్రభావం బలంగా ఉన్నట్టు తెరపై కనిపిస్తుంది. సినిమా ఫస్ట్ సీన్ నుంచి ప్రేక్షకులు కథలో ఇన్ వాల్వ్ అయిపోతారు. పాత్రలనూ, సన్నివేశాలనూ, బలమైన సంఘటనలనూ కథకు తగ్గట్టు వాడుకున్నారు. లో కాస్ట్ ఎయిర్ లైన్స్ లాంటి టెక్నికల్ అంశాన్ని సైతం అందరికీ అర్థమయ్యేలా, ఎమోషనల్ గా చూపించడం విశేషం. కొన్ని చోట్ల కంటతడి పెట్టకుండా ఉండలేం. అందుకే, భావోద్వేగాలను ఇష్టపడేవారికి కచ్చితంగా నచ్చే సినిమా ఇది. అయితే, అక్కడక్కడా బాగున్న ఎమోషనల్ సీన్లను కూడా పరిమితికి మించి కొనసాగించడంతో మెలోడ్రామా మితిమీరింది. తండ్రి చనిపోయాక ఇంటికొచ్చిన హీరోతో తల్లి వాదన సీన్, పోస్టాఫీస్‌లో ఊరి జనం హీరోతో ఫోన్లో మాట్లాడే సీన్ లాంటివి బాగున్నా, కొద్దిగా కత్తెరకు పదును పెట్టి ఉండాల్సింది. అలాగే, లల్లాయి లాయిరే అంటూ మొదలయ్యే పాట మినహా మిగిలినవేవీ గుర్తుండేలా లేకపోవడం చిన్న లోటే. అయితే, ఇలాంటి లోటుపాట్లన్నీ బిగువైన కథాకథనంలో కొట్టుకుపోతాయి. శాలినీ ఉషాదేవితో కలసి దర్శకురాలు రాసుకున్న స్క్రీన్ ప్లే, సినిమా నిర్మాణ విలువలు, రీరికార్డింగ్, కెమెరా పనితనం ప్రధాన బలాలయ్యాయి.. గోపీనాథ్ జీవితకథతో పాటు చౌకధరలో విమానయానమనే విభాగంలో జరిగిన అనేక నిజజీవిత సంఘటనలను కూడా కలగలిపి, ప్రధాన పాత్రల స్వరూప స్వభావాలను పకడ్బందీగా రాసుకున్నారు సుధ కొంగర. రాసుకోవడంతో స్క్రిప్టు ఆసక్తిగా తయారైంది. ఇప్పటి వరకు స్పోర్ట్స్ డ్రామాలు, సినిమా యాక్టర్లు, పొలిటీషియన్ల బయోపిక్‌లకే పరిమితమైన చోట తెలుగు మహిళ సుధ కొంగర చేసిన ఈ ప్రయత్నం అందుకే ఆనందం అనిపిస్తుంది. హీరోకూ, ప్రత్యర్థికీ మధ్య వ్యాపార పోరాటం సహా, కథలో అడుగడుగునా హీరోకు ఎదురయ్యే సవాళ్ళు ప్రేక్షకుల ఆసక్తిని చివరికంటా నిలుపుతాయి. సినిమా క్లైమాక్స్ లో ఎలాగైనా హీరోనే గెలుస్తాడని తెలిసినా, రెండున్నర గంటలూ ఆపకుండా చూసేలా చేస్తుంది. ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ కంటెంట్ కావడంతో, కరోనా వేళ ఇటీవల రిలీజైన సినిమాల్లో ఇది ఫస్ట్ బిగ్ ఓటీటీ హిట్‌గా నిలిచే సూచనలూ ఉన్నాయి. కొసమెరుపు: ఇటీజ్ నాట్ ఎ ‘భయో’పిక్! బలాలు ► స్ఫూర్తిదాయక కథ ► బిగి సడలని కథనం ► దర్శకత్వ ప్రతిభ ► పాత్రల రూపకల్పన, నటన ► సీన్లలోని ఎమోషన్ బలహీనతలు ► అక్కడక్కడ అతి మెలోడ్రామా ► డబ్బింగ్ సినిమా వాసనలు ► ఆకట్టుకోని పాటలు ► క్లైమాక్స్ లో కాస్తంత తికమక – రెంటాల జయదేవ -
యన్‌యస్‌డీ చైర్మన్‌గా పరేష్ రావల్
బాలీవుడ్ విలక్షణ నటుడు పరేష్ రావల్‌కు కొత్త గౌరవం దక్కింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (యన్‌యస్‌డీ) చైర్మన్‌గా పరేష్ రావల్‌ను నియమించారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఈ విషయాన్ని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తెలియజేస్తూ – ‘‘పరేష్ రావల్‌ను యన్‌యస్‌డీ చైర్మన్‌గా నియమించారనే విషయాన్ని తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉంది. యన్‌యస్‌డీ ఫ్యామిలీ ఆయన్ను సగౌరవంగా ఆహ్వానిస్తోంది. ఆయన నాయకత్వంలో మరెన్నో మైలురాయిలు అందుకుంటాం’’ అని ట్వీట్ చేసింది. పరేష్ రావల్ నియామకం పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. -
పరేష్ రావల్‌కు కీలక పదవి
సాక్షి, న్యూఢిల్లీ : విలక్షణ నటుడు పరేష్ రావల్‌ను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చీఫ్‌గా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. పరేష్ రావల్‌కు నూతన బాధ్యతలను కట్టబెట్టినట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నిర్ధారించారు. పరేష్ నియామకం పట్ల నటుడికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఈ నియామకంతో కళాకారులు, విద్యార్ధులకు మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు దశాబ్ధాలకు పైగా తన సినీ ప్రస్ధానంలో పరేష్ రావల్ జాతీయ ఫిల్మ్ అవార్డు సహా పలు అవార్డులు అందుకున్నారు. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలకు గాను 2014లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. సినిమాలతో పాటు నాటక రంగంలోనూ పరేష్ రావల్ చురుకుగా ఉండేవారు. సినిమాల కంటే నాటకాలనే తాను అమితంగా ప్రేమిస్తానని ఆయన గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. చదవండి : అబ్దుల్ కలాం ఫిక్స్ -
తగ్గుతున్నా!
సాధారణంగా సంతానం లేనివారు పిల్లలను దత్తత తీసుకుంటారు. కానీ ఓ అనాథ యువకుడు తల్లిదండ్రులను దత్తత తీసుకుంటాడు. దాంతో అతని జీవితం మారుతుంది. అయితే అతని ప్రేమ, పెళ్లి విషయాల్లో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఆ యువకుడు ఎలా పరిష్కరించాడు? ఇందులో అతని ప్రేయసి ప్రమేయం ఎంత? అనే అంశాలకు కాస్త హాస్యం జోడిస్తూ హిందీలో ఓ సినిమా తెరకెక్కనుంది. రాజ్‌కుమార్‌రావు, కృతీసనన్ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. పరేష్ రావల్, డింపుల్ కపాడియా కీలక పాత్రధారులు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత దినేష్ విజన్ తెలిపారు. ప్రస్తుతం కృతీ ‘మిమీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆమె సరోగేట్ మదర్ పాత్ర చేస్తున్నారు. ఈ పాత్ర కోసం కృతీ 15 కిలోల బరువు పెరిగారు. రాజ్‌కుమార్ రావుతో ఒప్పుకున్న తాజా సినిమా కోసం బరువు తగ్గుతున్నారు. -
అబ్దుల్ కలాం ఫిక్స్
దేశం గర్వించే శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవిత కథను తెరమీదకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో కలాం పాత్రను పోషిస్తున్నట్టు బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ప్రకటించారు. ‘కలాం పాత్రలో నటించడం నా అదృష్టం’ అని ట్వీట్ చేశారాయన. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో అనే విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించలేదు. -
రెండింతల హంగామా
అయోమయంలో కొందర్ని అపార్థం చేసుకున్నారు బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి. తప్పు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అప్పుడామె కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. తన తెలివితేటలతో ఆ సమస్యలను ఎలా పరిష్కరించారు అనే కథాంశంతో ఓ హిందీ చిత్రం తెరకెక్కనుంది. ప్రియదర్శన్ దర్శకత్వంలో 2003లో వచ్చిన ‘హంగామా’కు ఇది సీక్వెల్. ఈ చిత్రానికి కూడా ప్రియదర్శనే దర్శకుడు కావడం విశేషం. ‘హంగామా 2’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో శిల్పాశెట్టి ప్రధాన పాత్రధారి. పరేష్ రావల్, మీజాన్ జఫేరి, ప్రణీత కీలక పాత్రల్లో నటిస్తారట. ఈ సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు డెహ్రాడూన్‌లో జరుగుతున్నాయని తెలిసింది. 13 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న శిల్పా ‘నికమ్మా’ సినిమాతో కమ్‌బ్యాక్ ఇçస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ మీద ఉన్నప్పుడే ‘హంగామా 2’ చిత్రానికి సైన్ చేశారు. 2007లో ‘అప్నే’లో కథానాయికగా నటించిన తర్వాత ‘ఓం శాంతి’, ‘దోస్తానా’, ‘డిష్కియూన్’ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించారు శిల్పా. మళ్లీ కథానాయికగా కనిపించబోతున్నది ‘నికమ్మా’, ‘హంగామా 2’లోనే. -
‘దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది’
ముంబై: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని బాలీవుడ్ స్వాగతించింది. సాహాసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. మోదీ సర్కారు నిర్ణయానికి మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తీవ్రవాద నిర్మూలన దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాక నిర్ణయంగా ఆర్టికల్ 370 రద్దును హీరోయిన్ కంగనా రౌనత్ పేర్కొన్నారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే తీసుకోగలరని ప్రశంసించారు. ఆయన దార్శనికుడు మాత్రమే కాదని, చాలా ధైర్యవంతుడైన నాయకుడని కొనియాడారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల శక్తివంతుడని పొగడ్తలతో ముంచెత్తారు. జమ్మూ కశ్మీర్‌కు మంచి భవిష్యత్తు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారం మొదలయిందని సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్లో శాంతి నెలకొనాలని నటి దియా మిర్జా ఆకాంక్షించారు. జమ్మూ కశ్మీర్లో అందరూ క్షేమంగా ఉండాలని నటుడు సంజయ్ సూరి కోరుకున్నారు. కేంద్రం నిర్ణయానికి మద్దతుగా రవీనా టాండన్ జాతీయ పతకాలను ట్విటర్లో షేర్ చేశారు. జైరా వసీం, విక్రాంత్ మాసే, మాన్వి గాగ్రు తదితరులు కేంద్రం నిర్ణయంపై హర్షం వెలిబుచ్చారు. ‘మన మాతృభూమికి ఈరోజే నిజమైన పరిపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించింది. ఇండియా అంతా ఒకటే అనేది నేడు సాకారమైంది. జై హింద్’ అంటూ విలక్షణ నటుడు పరేశ్ రావల్ ట్విటర్లో పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దును విప్లవాత్మక నిర్ణయంగా నిర్మాత ఏక్తాకపూర్ వర్ణించారు. కేంద్రం నిర్ణయంతో కశ్మీర్లో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. యునైటైడ్ ఇండియా కల సాకారం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు ఇది ఘనమైన నివాళిగా హీరో వివేక్ ఒబరాయ్ పేర్కొన్నారు. ప్రతి దేశభక్తుడు మోదీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. (చదవండి: ఆర్టికల్ 35ఏ కూడా రద్దైందా?) -
తమిళంలో తొలిసారి
డాక్టర్ లింగం మావయ్యగా ‘శంకర్ దాదా’ సిరీస్‌లో కామెడీ పండించారు బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్. ఇప్పుడు తమిళంలో తన విలనీ సైడ్ చూపించడానికి రెడీ అయ్యారని తెలిసింది. సూర్య హీరోగా ‘గురు’ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సూరరై పోట్రు’. మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పరేశ్ రావల్ విలన్‌గా నటించనున్నారని టాక్. ఇది ఆయనకు తొలి తమిళ చిత్రం అవుతుంది. ఆర్మీ కెప్టెన్, ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలిసింది. సూర్య ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు నిర్మిస్తున్నారు కూడా. హాలీవుడ్ కొరియోగ్రాఫర్ గ్రెగ్ పొవెల్ ఈ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. -
పరేష్ రావల్ స్థానంలో మరొకరు!
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ విలక్షణ నటుడు, తూర్పు అహ్మదాబాద్ ఎంపీ పరేష్ రావల్‌కు బీజేపీ అధిష్టానం ఈసారి టికెట్ నిరాకరించింది. ఆయనకు బదులుగా హస్ముక్ ఎస్ పటేట్కు తూర్పు అహ్మదాబాద్ టికెట్ కేటాయిస్త్నుట్లుగా బుధవారం ప్రకటించింది. పటేల్ బీజేపీ తరఫున 2012, 2017 లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిధ్యం వహించారు. పటేల్ అనూహ్యంగా తూర్పు అహ్మదాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో దిగనున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను తూర్పు అహ్మదాబాద్ బరిలో ఉండబోనని పరేష్ రావల్ తెలిపారు. గత నాలుగైదు మాసాల ముందు నుంచే ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన ఓ సందర్భంలో అన్నారు. కానీ బీజేపీ పార్టీ అధిష్టానం ఎన్నికల బరిలో నిలవాలని ఆదేశిస్తే తప్పకుండా ఏ స్థానం నుంచి అయినా పోటీ చేయడనికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడనున్నాయి. -
‘అర్జున్ రెడ్డి’ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్
2017లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా స్టార్ హీరోలతో సినిమాలో ఓకె చేయించుకొని ఫుల్ బిజీ అయ్యాడు. అయితే హీరోయిన్గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం 100% లవ్ తమిళ రీమేక్‌తో పాటు కల్యాన్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న 118 సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి ఓ బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ తనయుడు ఆదిత్య హీరోగా తెరకెక్కుతున్న బాంఫాడ్ సినిమాలో షాలిని హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మిస్తున్న ఈ సినిమాతో రంజన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. -
మంచి చాన్స్ మిస్
మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం చేజారినప్పుడు ఏ యాక్టర్ అయినా ఫీల్ అవుతారు. ఇప్పుడు అదే చేస్తున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ గతేడాది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సంజయ్ పాత్రలో రణ్‌బీర్‌సింగ్, సంజయ్ తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు. కానీ సునీల్ దత్ పాత్రలో నటించే అవకాశం తొలుత అక్షయ్ ఖన్నాకు వచ్చింది. ‘‘సంజు సినిమాలో సునీల్ దత్ పాత్రకోసం లుక్ టెస్ట్ చేశారు. ఆ పాత్రకు నేను మిస్ ఫిట్ అని హిరానీ ఫీల్ అయ్యారు. ఇలా మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం నాకు దక్కలేదు’’ అని పేర్కొన్నారు అక్షయ్ ఖన్నా. -
కాంగ్రెస్ సర్జికల్ దాడులకు ఒప్పుకోలేదు : నటుడు
ముంబై : 26 / 11 దాడులు జరిగిన తర్వాత ఆర్మీ సర్జికల్ దాడులు చేయాలని భావించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు ఒప్పుకోలేదన్నారు నటుడు పరేష్ రావల్. ప్రస్తుతం ఆయన ‘యురి : ద సర్జికల్ స్ట్రైక్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘26 / 11 దాడుల అనంతరం ఆర్మీ సర్జికల్ దాడులు చేయాలని భావించింది. కానీ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అందుకు ఒప్పుకోలేదు. మన ఆర్మీకి మద్దతు తెలపడానికి బదులు కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్ గురించి ఆలోచించింది. ఆ సమయంలో మన సైనిక శక్తి గురించి జనాల్లో సందేహాలు తలెత్తాయి’ అన్నారు. అయితే ఆ సందేహాలకు మోదీ సమాధానాలు చెప్పారన్నారు పరేష్. ‘మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సర్జికల్ దాడులకు ఆమోదం తెలిపారు. మనకు చాలా బలమైన సైనిక వ్యవస్థ ఉంది. కానీ మన దేశంలోని రాజకీయ వ్యవస్థ వల్ల అప్పుడప్పుడు ఇలాంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తుతుంటాయి. కానీ మన సైనిక శక్తి సామర్థ్యాల గురించి తెలియజేయడమే కాక, పాక్ చేసే వక్ర పనులకు సరైన సమాధానం చెప్పడం చాలా అవసరం’ అన్నారు. అంతేకాక యురి సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఇదొక పొలిటికల్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది. సైన్యం సర్జికల్ దాడులకు ఎలా సన్నద్దమయ్యిందనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాం’ అన్నారు. సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య దార్ యురి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రొన్ని స్క్రూవాలా బేనర్‌పై ఆర్ఎస్వీపీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్, యామీ గౌతమ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
సంక్రాంతికి సర్జికల్ స్ట్రయిక్స్
2016 సెప్టెంబర్ 18 తెల్లవారుజామున యూరీ పట్టణంలో బేస్ క్యాంప్ నిర్వహిస్తున్న భారతీయ సైనికులపై ఉగ్రవాదులు ఓ మెరపుదాడి చేశారు. దీంతో 19మంది జవాన్లు మరణించారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత భారత సైన్యం పాకిస్తాన్‌పై (పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం ప్రాంతంలో) సర్జికల్ స్ట్రయిక్స్ జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సంఘటనల ఆధారంగా హిందీలో ‘యూరీ: ది సర్జికల్ స్ట్రయిక్స్’ అనే సినిమా రూపొందుతోంది. విక్కీ కౌశల్, పరేశ్ రావెల్, యామీ గౌతమ్ ముఖ్య తారలుగా నటించారు. ఆదిత్యా థార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ అండ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఏడాది జనవరి 11న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రాజీ, మన్మర్జియాన్ వంటి సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్న విక్కీ కౌశల్ ఇందులో మెయిన్‌లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా చాలా ఉద్వేగభరింతగా ఉంటుందని యూనిట్ పేర్కొంది. -
‘మా తల్లిదండ్రుల పాత్రలో ఎవరిని ఊహించలేను’
సంజయ్‌దత్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన ‘సంజు’ సినిమా సూపర్‌హిట్టయిన సంగతి తెలిసింది. జూన్ 29న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ ప్రస్తుతం 300 కోట్ల రూపాయల క్లబ్ వైపు దూసుకుపోతుంది. ఒకప్పటి బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ సంజయ్ జీవతంలో ఉన్న ఎత్తుపల్లాలన్నింటిని దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ ఈ చిత్రంలో చాలా చక్కగా చూపించాడు. మున్నాబాయ్ జీవితంలో మత్తు పదార్ధాల దశ, పలువురు హీరోయిన్లతో అతనికి ఉన్న సంబంధాలు, అక్రమాయుధాలు కలిగి ఉన్న కేసులో జైలుకెళ్లడం వంటి పలు అంశాలను వాస్తవికంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. అయితే ‘సంజు’ చిత్రంలో కేవలం సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రకు, తల్లి నర్గీస్ పాత్రలకే ఎక్కువ ప్రధాన్యం ఇచ్చారని, సంజయ్ సోదరిమణులు నమ్రతా దత్, ప్రియా దత్‌లను పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం గురించి సంజయ్ దత్ సోదరి నమ్రతా దత్ ‘‘సంజు’ సినిమా నాకు నచ్చింది. కానీ సంజయ్ దత్ కుటుంబ సభ్యురాలిగా, సంజయ్‌కు అత్యంత ఆప్తురాలిగా సినిమాను విశ్లేషించాలంటే కాస్తా కష్టమే. ఎందుకంటే సంజయ్ జీవితంలో ప్రతి క్షణం నేను అతనితో పాటే ఉన్నాను. అతన్ని దగ్గరి నుంచి చూశాను’ అన్నారు. అలానే సునీల్ దత్ పాత్రలో నటించిన పరేష్ రావల్ గురించి మాట్లాడుతూ ‘మా నాన్న చాలా ప్రత్యేకం, ఆయన పాత్రలో నేను ఎవరిని ఊహించుకోలేను. నేను ప్రేక్షకురాలిని కాదు కదా. అందుకే మా నాన్న పాత్రలో నటించిన పరేష్ రావల్‌కు నేను అంతగా కనెక్ట్ కాలేకపోయాను. అయితే పరేష్ రావల్ పాత్ర నాకు నచ్చలేదని కాదు. కానీ నేను ఆయన పాత్రకు అంతగా కనేక్ట్ కాలేకపోయాను అంతే. ఎందుకంటే నేను సునీల్ దత్ కూతుర్ని’. అన్నారు. అలానే తమ తల్లి పాత్రలో నటించిన మనిషా కోయిరాల గురించి మాట్లాడుతూ ‘మా అమ్మ పాత్రకు మనీషా కోయిరాల బాగానే సరిపోయింది. కానీ సునీల్ దత్, నర్గీస్‌ల కూతురిగా వారి పాత్రలో మరొకరిని ఊహించలేను. అలానే సంజయ్ కుటుంబ సభ్యురాలిగా సినిమా గురించి ఎటువంటి కామెంట్ చేయలేను. కానీ ప్రేక్షకులు వారి వారి పాత్రలకు బాగానే కనేక్ట్ అయ్యారు. అది చాలా గొప్ప విషయం’ అన్నారు. సంజయ్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ ఒదిగిపోయాడని మెచ్చుకున్నారు. ఈ సినిమాలో తనను బాగా కదిలించిన సన్నివేశాలు సంజయ్ మత్తుపదార్ధాలకు బానిసవ్వడం, ఆ తర్వాత వాటి నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు అని తెలిపారు. ఈ విషయం గురించి ‘అది నిజంగానే చాలా కష్ట సమయం, ముఖ్యంగా మా నాన్న గారికి. కానీ సంజయ్‌కి వీటన్నింటి నుంచి బయటపడేందుకు కావాల్సిన ధైర్యం ఉంది. అందుకే మత్తు పదార్ధాల వ్యసనాన్ని జయించగలిగాడు. మళ్లీ దాన్ని పురావృతం కాకుండా చూసుకోగలిగాడు. అలానే సంజు జైలు జీవితం గడపడం కూడా చాలా కష్టమైన దశే. కానీ వీటన్నింటిని కూడా అతను ఎంతో ధైర్యంగా ఎదుర్కొగలిగాడు’ అని తెలిపింది. -
‘ఆయన లేఖ చూసి ఆశ్చర్యానికి లోనయ్యా’
ముంబై : బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సంజు’. ఇందులో సంజయ్ దత్‌గా రణ్‌బీర్ కపూర్, తండ్రి సునీల్ దత్‌గా పరేష్ రావెల్ నటించారు. సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సందర్భంగా పరేష్ రావెల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తనకు సునీల్ దత్ రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. సునీల్ దత్ చనిపోయే కొద్ది రోజుల ముందు పరేష్‌కు ఓ లేఖ రాశారు. అతను చనిపోయిన రోజు తనకు ఆ లేఖ గురించి తెలిసిందని పరేష్ సునీల్ దత్తో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. ‘మే 25, 2005న.. నేను ఓ సినిమా షూటింగ్ లో ఉన్నాను. అదే సమయంలో సునీల్ దత్ స్వర్గస్తులయ్యారని తెలిసింది. సునీల్ నివాసానికి వెళుతున్నా, రాత్రి ఇంటికి రావడం ఆలస్యమవుతుందని నా భార్యకు ఫోన్ చేసి చెప్పాను. సునీల్ దత్ నుంచి మీకో ఉత్తరం వచ్చిందని నా భార్య నాకు చెప్పింది. అందులో ఏం రాసుందని అడిగాను. ‘ డియర్ పరేష్ జీ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు, మీ కుటుంబ సంభ్యులు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను’ అని రాసి ఉందని నా భార్య సమాధానమిచ్చింది. నా పుట్టిన రోజు మే 30న కానీ ఐదు రోజు ముందుగానే సునీల్ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాశారు. సునీల్ జీ, నేను పండగల సమయంలో కూడా ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకోం. ఆయన చనిపోవడానికి ముందు ఈ లేఖ నాకు రాయడం ఆశ్చర్యానికి గురిచేసింది’ అని పరేష్ రావెల్ చెప్పుకొచ్చారు. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాల, అనుష్క శర్మ, దియా మీర్జా, విక్కీ కౌశల్ తదితరులు నటించారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ.265 కోట్లు వసూళ్లను రాబట్టి, రూ.300కోట్ల క్లబ్లో చేరడానికి రెడీ అవుతోంది. -
‘సంజు’ మూవీ రివ్యూ
టైటిల్ : సంజు జానర్ : బయోపిక్ తారాగణం : రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, దియా మీర్జా, విక్కీ కౌశల్, అనుష్క శర్మ తదితరులు సంగీతం : ఏఆర్ రెహమాన్ దర్శకత్వం : రాజ్‌కుమార్ హిరాణీ నిర్మాత : విదూ వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరాణీ Sanju Telugu Movie Review: బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో సీనియర్ నటుడు సంజయ్ దత్ జీవితగాథ సంజును ప్రకటించి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ. పైగా సక్సెస్ లేక సతమతమవుతున్న యువ హీరో రణ్‌బీర్ కపూర్‌ను సంజు రోల్‌కు తీసుకోవటం ఆశ్చర్యం కలిగించింది. అయితే ట్రైలర్-ప్రొమోల్లో అచ్చం సంజు బాబాల కనిపించిన రణ్‌బీర్.. ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చాడు. భారీ అంచనాల మధ్య సంజు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సంజుగా రణ్‌బీర్ ఏమేర అలరించాడో చూద్దాం... కథ.. స్టార్ వారసుడిగా బాలీవుడ్లో అడుగుపెట్టి డెబ్యూ చిత్రం(రాకీ)తోనే స్టార్డమ్ సంపాదిస్తాడు సంజు(రణ్‌బీర్ కపూర్). సినీ ప్రస్థానం కొనసాగుతున్న సమయంలోనే డ్రగ్స్ అలవాటు, అక్రమాయుధాల కేసు సంజు(రణ్‌బీర్ కపూర్) జీవితాన్ని కుదిపేస్తాయి. ఆయుధాల కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తనకు తానుగా లొంగిపోవాలని సంజు భావిస్తాడు. కానీ, అంతకు ముందే తన జీవిత కథగా మలిచేందుకు ప్రయత్నిస్తాడు. రచయిత కోసం ఎదురుచూస్తున్న తరుణంలో విన్నె(అనుష్క శర్మ) ముందుకు వస్తుంది. తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను సంజు.. విన్నెకు వివరిస్తూ కథ సాగుతుంది. విశ్లేషణ.. మనకు బాగా తెలిసిన వ్యక్తి జీవితంలోని ఆసక్తికర అంశాలను కూలంకుశంగా తెలుసుకోవాలనే ఆసక్తి సహజం. ‘ఒక్క మనిషి.. పలు కోణాలు’ అంటూ ట్యాగ్ లైన్‌తోనే సంజు జీవితంలోని దశలను దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ వివరించే యత్నం చేశాడు. అయితే వివాదాల నటుడు సంజయ్ దత్ లైఫ్‌ను తెరపై హిరాణీ డీల్ చేసిన విధానం అద్భుతం. వివాదాలను కూడా ఎమోషనల్‌గా మలిచిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. తన జీవితంలో ఎత్తుపల్లాలను పూసగూచ్చినట్లు వివరిస్తూ సంజు కథ ముందుకు సాగుతుంది. తల్లి మరణం, హీరోగా ఎదిగే క్రమంలో డ్రగ్స్ అలవాటుతో సంజు సతమతమయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు చేసే స్ట్రగుల్, విమర్శలు వెల్లువెత్తినా తండ్రి(పరేష్ రావెల్) కొడుక్కి అండగా నిలవటం, ముఖ్యంగా వాళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అయితే ఫస్టాఫ్‌ను గ్రిప్పింగ్‌గా నడిపిన దర్శకుడు.. సెకండాఫ్‌ను మొత్తం జైలు జీవితం, కేసు, కోర్టు ప్రధానాంశాలుగా నడిపించాడు. తాను టెర్రరిస్ట్‌ను కాదంటూ సంజు పడే మానసిక సంఘర్షణ, భావోద్వేగపూరిత సన్నివేశాలతోనే ద్వితీయార్థాన్ని కానిచ్చేశాడు. అయితే ఈ క్రమంలో సంజు కెరీర్‌ను చూపించినా.. వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు. హీరోయిన్లతో రిలేషన్షిప్స్, వైవాహిక జీవితంలోని లోతైన అంశాలను(మొదటి భార్య రిచా శర్మ, కూతురు త్రిశల గురించి) చూపించకుండా సంజు కథ సాగటం గమనార్హం. ఈ విషయంలో ప్రేక్షకులు కొంత అసంతృప్తికి గురికావొచ్చు. నటీనటుల విషయానికొస్తే.. సంజయ్ దత్ పాత్రలోకి రణ్‌బీర్ కపూర్ జీవించేశాడు. సంజు అంటే రణబీర్ అనేలా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల్లో రణ్‌బీర్ తనను తాను అద్భుతంగా ఆవిష్కరించుకున్నాడు. డ్రగ్స్ బాధితుడిగా చేసే సన్నివేశాలు అయితేనేం, వీధుల్లో అడుక్కునే సీన్ అయితేనేం, పోలీస్ విచారణలో, ఆస్పత్రిలో స్నేహితుడితో... ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే బోలెడు సీన్లు. ఎమోషనల్ సీన్లలోనే కాదు.. కామెడీతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను కూడా పండించాడు. తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్‌ను తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేం అనిపించింది. సాధారణంగా ఎంటర్టైన్మెంట్ పాత్రలకు పేరుగాంచిన ఈ సీనియర్ నటుడు.. సీరియస్ నటనతో సంజుకు బలంగా నిలిచాడు. ఇక సంజు బెస్ట్ ఫ్రెండ్ కమలేష్(విక్కీ కౌశల్) పాత్ర సినిమాకు మరో ఆకర్షణ. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి అండగా ఉండటం, సంజు-కమలేష్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. నర్గీస్ దత్ పాత్రలో సీనియర్ నటి మనీషా కోయిరాలాకు పెద్దగా సీన్లు లేవు. అయినా ఉన్నంతలో ఆమె పాత్ర అలరిస్తుంది. భార్య మాన్యతా పాత్రలో దియా మీర్జా మెప్పించారు. సోనమ్ కపూర్, అనుష్క శర్మ, మిగతా పాత్రలు ఓకే. పలువురు సెలబ్రిటీలు, చివర్లో కాసేపు స్వయంగా సంజయ్ దత్ కనిపించటం ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్, రోహన్ రోహన్-విక్రమ్ మాంట్రెసె సంగీతం సినిమాకు తగ్గ మూడ్‌ను అందించింది. కర్ హర్ మైదాన్ ఫతే సాంగ్, రుబీ రుబీ పాటలు అలరిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోపాటు విజువల్‌గా కూడా సంజు మెప్పిస్తుంది. రాజ్‌కుమార్ హిరాణీ అద్భుతమైన స్టోరీ టెల్లర్. అందులో ఏ మాత్రం సందేహం లేదు. దత్ ఫ్యామిలీతో ఉన్న స్నేహాన్ని పక్కనపెట్టి మరీ కథానుగుణంగా కొన్ని సన్నివేశాలను స్వేచ్ఛగా తెరకెక్కించారు. చిత్రం నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఓవరాల్‌గా హిరాణీ సినిమాల్లో లభించే హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమర్ ఎలిమెంట్స్ ‘సంజు’లో పుష్కలంగా లభిస్తాయి. ఫ్లస్ పాయింట్లు కథా-కథనం రణ్‌బీర్ కపూర్ మిగతా పాత్రలు సంగీతం మైనస్ పాయింట్లు కొన్ని ఆసక్తికరమైన అంశాలను చూపించకపోవటం అక్కడక్కడ సాగదీత సన్నివేశాలు - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్.