
2017లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా స్టార్ హీరోలతో సినిమాలో ఓకె చేయించుకొని ఫుల్ బిజీ అయ్యాడు. అయితే హీరోయిన్‌గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.
ప్రస్తుతం 100% లవ్ తమిళ రీమేక్‌తో పాటు కల్యాన్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న 118 సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి ఓ బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ తనయుడు ఆదిత్య హీరోగా తెరకెక్కుతున్న బాంఫాడ్ సినిమాలో షాలిని హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మిస్తున్న ఈ సినిమాతో రంజన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment