ఇక మాలీవుడ్‌లోనూ! | malayalam remake in arjun reddy | Sakshi

ఇక మాలీవుడ్‌లోనూ!

Sep 16 2018 2:20 AM | Updated on Sep 16 2018 2:21 AM

malayalam remake in arjun reddy - Sakshi

‘అర్జున్‌ రెడ్డి’లో ఓ దృశ్యం

విజయ్‌ దేవరకొండ, షాలినీ పాండే జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా టాలీవుడ్‌లో ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆల్రెడీ తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్‌తో బాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరో.  అలాగే షాహిద్‌ కపూర్‌ హీరోగా హిందీ ‘అర్జున్‌ రెడ్డి’  త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనుంది.

ఒరిజినల్‌ డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగానే ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పుడు తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ సినిమా మలయాళంలో కూడా రీమేక్‌ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. మల్లూ అర్జున్‌రెడ్డి ఎవరు? అనే విషయం పై మాలీవుడ్‌లో చర్చ జరగడం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement