స్మృతి ఫైర్‌ బ్రాండ్‌ అంటూ నటుడు ప్రశంసలు | What Smriti Irani is, according to actor-BJP MP Paresh Rawal | Sakshi
Sakshi News home page

స్మృతి ఇరానీ ఫైర్‌ బ్రాండ్‌: పరేశ్‌ రావల్‌

Published Thu, Oct 12 2017 5:03 PM | Last Updated on Mon, Oct 22 2018 2:09 PM

What Smriti Irani is, according to actor-BJP MP Paresh Rawal - Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు బీజేపీ ఎంపీ పరేశ్‌ రావల్‌ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఫైర్‌ బ్రాండ్‌ అంటూ అభివర్ణించారు. సమాచార ప్రసార శాఖ ఆమె చేతిలో దూసుకెళుతోందని, చిత్ర పరిశ్రమకు మరింత లబ్ధి చేకూర్చేలా ఆమె చేపడుతున్న నియామకాలు ఉన్నాయని అన్నారు.

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ)కి ప్రముఖ పాటల రచయిత ప్రసూన్‌ జోషిని, అలాగే, పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చైర్మన్‌గా అనుపమ్‌ ఖేర్‌ను నియమించడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వీరిద్దరు కూడా చిత్ర పరిశ్రమకు మరింత ఊపునిచ్చేందుకు చాలా అవసరం అని అన్నారు. వారి నియామకం చేసినందుకు ధన్యవాదాలని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం పెడుతున్న ఈమోజీని స్మృతి ఇరానీ ట్వీట్‌ రూపంలో బదులిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement