రిషీ కపూర్, పరేష్ రావల్
బాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ రిషీ కపూర్ గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే. అయన పూర్తి చేయని చిత్రాన్ని పూర్తి చేయడానికి మరో స్టార్ యాక్టర్ సిద్ధమయ్యారు. రిషీ కపూర్ ప్రధాన పాత్రలో గత ఏడాది ఆరంభమైన చిత్రం ‘శర్మాజీ నమ్‌కీన్’. హితేష్ భాటియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కథ అరవై ఏళ్ల శర్మాజీ అనే వ్యక్తి జీవితం చూట్టూ తిరుగుతుంది. ఆ పాత్రను రిషీ కపూర్ అంగీకరించారు. అయితే ఇంకా సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు. ఈలోగా రిషీ కపూర్ మరణించారు. ఇప్పుడు ఆయన పాత్రలో పరేష్ రావల్ నటించి, ఆ సినిమాను పూర్తి చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుంది. ఈ సినిమాను రిషీ కపూర్ పుట్టినరోజున (సెప్టెంబర్ 4) థియేటర్స్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment