తగ్గుతున్నా! | Rajkumar Rao and Kriti Sanon to team up for a new movie | Sakshi
Sakshi News home page

తగ్గుతున్నా!

Published Thu, Feb 20 2020 12:17 AM | Last Updated on Thu, Feb 20 2020 12:17 AM

Rajkumar Rao and Kriti Sanon to team up for a new movie - Sakshi

కృతీసనన్‌

సాధారణంగా సంతానం లేనివారు పిల్లలను దత్తత తీసుకుంటారు. కానీ ఓ అనాథ యువకుడు తల్లిదండ్రులను దత్తత తీసుకుంటాడు. దాంతో అతని జీవితం మారుతుంది. అయితే అతని ప్రేమ, పెళ్లి విషయాల్లో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఆ యువకుడు ఎలా పరిష్కరించాడు? ఇందులో అతని ప్రేయసి ప్రమేయం ఎంత? అనే అంశాలకు కాస్త హాస్యం జోడిస్తూ హిందీలో ఓ సినిమా తెరకెక్కనుంది.

రాజ్‌కుమార్‌రావు, కృతీసనన్‌ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. పరేష్‌ రావల్, డింపుల్‌ కపాడియా కీలక పాత్రధారులు. ఈ సినిమా షూటింగ్‌ మార్చిలో ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత దినేష్‌ విజన్‌ తెలిపారు. ప్రస్తుతం కృతీ ‘మిమీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆమె సరోగేట్‌ మదర్‌ పాత్ర చేస్తున్నారు. ఈ పాత్ర కోసం కృతీ 15 కిలోల బరువు పెరిగారు. రాజ్‌కుమార్‌ రావుతో ఒప్పుకున్న తాజా సినిమా కోసం బరువు తగ్గుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement