Dimple Kapadia
-
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
డింపుల్ కపాడియా… బాలీవుడ్లో ఒకప్పుడు తన అందచందాలతో భారీగా ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న బ్యూటీగా పేరుగాంచింది. డింపుల్ అంటేనే అందం అనేంతగా యూత్ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ దర్శకత్వంలో రిషీ కపూర్‌ను హీరోగా తెరకెక్కించిన ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన డింపుల్. తొలి మూవీతోనే హిట్ కొట్టి ఓవర్ నైట్ బాలీవుడ్ స్టార్ అయిపోయింది. ఆ సినిమా నాటికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే. డింపుల్ కపాడియా 'రుడాలి'లో తన నటవిశ్వరూపం చూపించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగానూ నిలచింది.16 ఏళ్ల వయసులోనే గర్భండింపుల్ కపాడియా 1957లో బొంబాయిలో ఒక సంపన్న గుజరాతీ వ్యాపారవేత్త కుటుంబంలో జన్మించింది. చిన్నతనంలో ఆమెను అమీనా అని పిలిచేవారు కానీ డింపుల్గానే ఆమె పేరు స్థిరపడింది. బాలీవుడ్ హిట్ చిత్రం బాబీలో నటించిన డింపుల్ తన కంటే 15 ఏళ్లు సీనియర్ అయిన సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో డేటింగ్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు కూడా ఆప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో 1973లో డింపుల్ తనకంటే 15 ఏళ్లు పెద్దవాడు అయిన రాజేష్ ఖన్నాను పెళ్లిచేసుకుని వార్తల్లో నిలిచింది. బాబీ సినిమాతోనే ఆమె సినిమా కెరియర్‌కు ఫుల్స్టాప్ పడిపోయింది. తన భర్త కోరిక మేరకు సినిమాలను వదిలేసింది. ఈ సంఘటనలతో ఆమె స్టార్డమ్ ఒక్కసారిగా కోల్పోయింది.స్టార్ హీరోకు అత్తగా..1974లో ట్వింకిల్ ఖన్నాకు ఆమె జన్మనిచ్చింది. అంటే ఆమె 16 ఏళ్ల వయసులోనే గర్భం దాల్చారు. ట్వింకిల్ ఖన్నాను అక్షయ్ కుమార్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు పిల్లనిచ్చిన అత్తగానే కాకుండా ప్రత్యేకమైన పాత్రలతో పలు సినిమాల్లో డింపుల్ కపాడియా బిజీగా ఉంది.పిల్లల కోసం విడాకులకు దూరం1982లో రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా విభేదించి విడిపోయారు. 1985లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, 'నేను, రాజేశ్ ఖన్నా వివాహం చేసుకున్న రోజుతోనే నా జీవితం ముగిసిపోయింది. ఆపై సంతోషం కూడా ముగిసింది.' అని చెప్పింది. రాజేశ్ ఖన్నా తనను మోసం చేశారని డింపుల్ రోపించింది. ఆ ఆరోపణలను రాజేశ్ ఎప్పుడూ ఖండించలేదు. పిల్లల కోసం ఈ దంపతులు విడాకులు కూడా తీసుకోలేదు. రాజేశ్ ఖన్నా ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయగా, ఆయన తరపున ప్రచారం కూడా చేసింది డింపుల్. వీరిద్దరూ విడిపోయిన తర్వాత 1984లో, డింపుల్, రిషి కపూర్ జంటగా సాగర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది. తరువాతి 10 సంవత్సరాలలో వరుస హిట్లు అందుకున్న డింపుల్ కపాడియా బాలీవుడ్లో అగ్ర కథానాయికలలో ఒకరిగా స్థిరపడింది.సన్నీ డియోల్‌తో ప్రేమకథరాజేశ్ ఖన్నాతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న డింపుల్‌కూ సన్నీ డియోల్ మంచి సోల్‌మేట్ అయ్యాడు. కష్టకాలంలోఆమెకు అండగా నిలబడ్డాడు.వారిద్దరి ప్రేమకథ చిత్రసీమలో భలేగా చక్కర్లు కొట్టింది. 1998లో సినిమా ఛాన్స్‌లు తగ్గిపోవడంతో కొవ్వొత్తుల వ్యాపారం ప్రారంభించింది. సన్నీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. చివరి దాకా భార్యగా రాజేశ్ కు సపర్యలు చేసింది డింపుల్. 2012 జూలై 18న రాజేశ్ ఖన్నా మరణించారు.ఇప్పుడేం చేస్తుందిదిల్ చాహ్తా హై, లక్ బై ఛాన్స్, కాక్టెయిల్, దబాంగ్, బ్రహ్మాస్త్ర, పఠాన్ వంటి చిత్రాలలో డింపుల్ కనిపించింది. 2020లో, ఆమె 62 సంవత్సరాల వయసులో క్రిస్టోఫర్ నోలన్ హిట్ సినిమా 'టెనెట్'లో సహాయక పాత్ర ద్వారా హాలీవుడ్ అరంగేట్రం చేసింది. 2024లో, ఆమె రెండు చిత్రాలలో కనిపించింది. -
ఈ అక్కాచెల్లెళ్లను గుర్తుపట్టారా? ఒకరు స్టార్ హీరోయిన్గా, మరొకరు..
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. ఇద్దరూ హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టారు. ఒకరు స్టార్ హీరోయిన్గా రాణిస్తే మరొకరు హీరోయిన్గా రాణించలేకపోయారు. ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ వైపు అడుగులేసి అక్కడ పేరుప్రతిష్టలు సంపాదించుకున్నారు. కానీ క్యాన్సర్ మహమ్మారితో పోరాడి 51 ఏళ్ల వయసులో ప్రాణాలు వదిలారు. ఇంతకీ వీళ్లెవరో గుర్తుపట్టారా? వాళ్లే బాలీవుడ్ సిస్టర్స్ డింపుల్ కపాడియా- సింపుల్ కపాడియా. ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ డింపుల్ కపాడియా బాబీ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రిషి కపూర్ సరసన నటించింది. ఈ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన డింపుల్ కెరీర్ పీక్స్‌లో ఉండగా బాలీవుడ్ సూపర్‌స్టార్ రాజేశ్ ఖన్నాను పెళ్లాడింది. కానీ వీరి వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. తొమ్మిదేళ్లు కలిసున్న తర్వాత వీరు విడిపోయారు. అయితే నటనను మాత్రం వదిలిపెట్టలేదు డింపుల్. ఇప్పటికీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తోంది. యాక్టింగ్ వదిలేసి ఫ్యాషన్ డిజైనింగ్‌పై ఫోకస్ డింపుల్ సోదరి సింపుల్ కపాడియా మాత్రం నటిగా పెద్దగా క్లిక్ అవలేదు. రాజేశ్ ఖన్నా హీరోగా నటించిన అనురోధ్(1977) సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ తనకు పెద్దగా ప్లస్ అవలేదు. చక్రవ్యూహ, మ్యాన్ పసంద్, లూట్మార్, షక్క, జీవన్ ధార, ప్యార్ కే దో పాల్ సహా పలు చిత్రాల్లో నటించింది. అయినా తనకు సంతృప్తి దక్కలేదు. దీంతో యాక్టింగ్ వదిలేసి తనకు ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్‌పై ఫోకస్ చేసింది. పలు సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేసింది కూడా! కానీ క్యాన్సర్ వ్యాధి ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. క్యాన్సర్ కారణంగా 2009లో నవంబర్ 10న మరణించింది. చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి కింగ్ ఆఫ్ కొత్త హిందీ వర్షన్.. ఎప్పుడు? ఎక్కడంటే? -
గోల్డెన్ బాబీ
50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలీవుడ్ బంపర్ హిట్ చిత్రం బాబీ (1973) కి సంబంధించిన జ్ఞాపకాలు, తెలిసిన విషయాలు, తెలియని విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బాగా ఇష్టపడి చేసిన సినిమా పరాజయం పాలైతే లేచి నిల్చోవడానికి, అడుగులు వేయడానికి, పరుగులు తీయడానికి శక్తి కావాలి. ఆ శక్తి రావాలంటే ‘ఎలాగైనా హిట్టు కొడతాను’ అనే కసి ఉండాలి. ‘మేరా నామ్ జోకర్’ సినిమాతో పరాజయం, అప్పుల పాలైన రాజ్ కపూర్‌లో ఆ కసి దండిగా ఉంది. కసి సంగతి సరే, ఇప్పుడొక సూపర్స్టారుడు కావాలి కదా. అప్పుల పాలైన తనతో సినిమా చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు? ‘ఇక అంతా అయిపోయింది. మిగిలింది ఏమీలేదు’ అనుకున్నప్పుడు ఎక్కడ లేని ధైర్యం వస్తుందట. ఆ ధైర్యంతోనే కుమారుడిని హీరోగా పెట్టి ‘బాబీ’ తీసి తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు రాజ్ కపూర్. ఆర్కే స్టూడియోస్‌కు ఇది మకుటాయమాన చిత్రం అయింది. రిషి కపూర్, డింపుల్ కపాడియాలను ఎక్కడికో తీసుకెళ్లింది. ‘బాబీ’ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే...కమర్శియల్ రోమాంటిక్ ఫిల్మ్ ‘ఫార్మట్’ను సెట్ చేసింది. మినీ–స్కర్ట్స్, హాట్ ప్యాంట్స్, లెదర్ ఔట్ఫిట్స్, వోవర్ సైజ్డ్ గ్లాసెస్, పోల్క–డాటెడ్ నాటెడ్ టాప్స్ మన దేశంలోని ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్స్‌ను మోసుకొచ్చాయి. -
తొలి సినిమా రిలీజ్‌కు ముందే సూపర్‌స్టార్‌తో పెళ్లి.. పిల్లలు పుట్టాక..
భారతీయ సినిమా తొలినాళ్లలో ఓ వెలుగు వెలిగిన సూపర్ స్టార్లలో రాజేశ్ ఖన్నా ఒకరు. వరుసగా 15 హిట్లు కొట్టిన రికార్డు ఆయన పేరు మీద ఉంది. ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్న రోజులవి.. ఆ సమయంలో బాబీ(1973) సినిమాతో వెండితెరపై కథానాయికగా మెరిసింది డింపుల్ కపాడియా. ఇది ఆమె తొలి చిత్రం. అయితే ఈ సినిమా రిలీజవడానికి ముందే తన అందచందాల గురించి జోరుగా ప్రచారం జరిగింది. అది రాజేశ్ ఖన్నా చెవిన పడింది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. తన చేయి పట్టుకుని నడిచాడు. అలా 1973లో తనకంటే రెట్టింపు వయసున్న రాజేశ్‌ను పెళ్లాడింది డింపుల్. పెళ్లి తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారనుకున్న ఈ దంపతులు 1984లో విడిపోయారు. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. అప్పటికే వీరికి ట్వింకిల్ ఖన్నా, రింఖీ ఖన్నా జన్మించారు. భర్తతో విడిపోయిన తర్వాత 1985లో సాగర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది డింపుల్. ఆ సినిమా రిలీజ్ సమయంలో తను ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకోగా ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. 'ఓసారి నేను, రాజేశ్ ఖన్నా చార్టెడ్ ఫ్లైట్‌లో అహ్మదాబాద్ వెళ్తున్నాం. అతడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాడు. విమానం దిగడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో అతడు నా కళ్లలోకి సూటిగా చూసి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. అప్పుడు నా వయసు 16 మాత్రమే! పెళ్లికి సరిగ్గా ఏడు రోజుల ముందు అతడి గురించి పూర్తిగా తెలుసుకున్నాను. చాలా త్వరత్వరగా మా పెళ్లి జరిగిపోయింది. ఏ రోజైతే ఆయనతో నా వివాహం జరిగిందో అప్పుడే నా సంతోషం, జీవితం ముగిసిపోయినట్లనిపించింది. బాబీ సినిమా తర్వాత ఒక్కో ప్రాజెక్టుకు రూ.5 లక్షలిస్తామని ఆఫర్ చేశారు. కానీ ఆ వయసులో కెరీర్ ప్రాధాన్యత అర్థం కాలేదు. రాజేశ్ ఇంట్లో అడుగుపెట్టి ఆశీర్వాదం తీసుకున్న రోజు నాకెందుకో ఈ పెళ్లి వర్కవుట్ కాదేమో అనిపించింది. పలువురు మహిళలు ఆయన జీవితంలోకి వస్తున్నారని తెలిసినా బాధేయలేదు. కానీ మా బంధం బలంగా లేదని మాత్రం అర్థమైంది. పైగా సమానత్వం అనే మాట మా విషయంలో నిజం కాలేదు. అతడి కెరీర్ నెమ్మదిగా డౌన్ అవడంతో మా మధ్య పోట్లాటలు మరింత పెరిగాయి. చివరికి ఇద్దరం విడిపోయాం' అని చెప్పుకొచ్చింది డింపుల్. చిత్రపరిశ్రమలో అందరూ కాకాజీ అని పిలుచుకునే రాజేశ్ ఖన్నా తీవ్ర అనారోగ్యంతో 2012 జూలై 18న మరణించారు. దంపతులుగా విడిపోయినప్పటికీ డింపుల్.. రాజేశ్ ఖన్నాతో స్నేహితురాలిగానే మెదిలేవారు. ఆయన చివరి రోజుల్లోనూ వారిద్దరూ కలిసే ఉన్నారు. చదవండి: డైరెక్టర్ నమ్మలేదు, రెండు ఆడిషన్స్ ఇచ్చాను: హీరోయిన్ -
Dimple Kapadia: భర్తతో విడిపోయినా విడాకులివ్వలేదు, ఎందుకంటే..
Happy Birthday Dimple kapadia: డింపుల్ కపాడియా… ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారులకు నిద్రలేకుండా చేసిన బ్యూటీ. అప్పటి డింపుల్ అందాలను తలచుకొని ఈ నాటికీ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ దర్శకత్వంలో రిషీ కపూర్‌ను హీరోగా తెరకెక్కించిన ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన డింపుల్.. తొలి మూవీతోనే హిట్ కొట్టి ఓవర్ నైట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయింది. అంతేగా కాదు ఉత్తమనటిగా ‘ఫిలిమ్ ఫేర్’ అవార్డును ఎగరేసుకు పోయింది. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఆతర్వాత ‘రుడాలి’లో తన నటవిశ్వరూపం చూపించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగానూ డింపుల్ నిలచింది. ఇదిలా ఉంటే ‘బాబీ’ సినిమా విడుదల కాకముందే, డింపుల్ గురించి బాలీవుడ్లో చర్చలు మొదలయ్యాయి. ఆమె అందం, నటన గురించి బాలీవుడ్ పెద్దలంతా చర్చించుకున్నారు. ఆ విషయం ఆ నోటా, ఈ నోటా ఆ నాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాను చేరింది. అతను తొలి చూపులోనే డింపుల్‌తో ప్రేమలో పడిపోయాడు. ఇక సూపర్ స్టార్ రాజేశ్‌ను చూశాక, డింపుల్ కూడా ఇష్టపడింది. దీంతో తనకంటే వయసులో 15 ఏళ్ళు పెద్దవాడయినా, రాజేశ్ ఖన్నాను వివాహమాడటానికి అంగీకరించింది డింపుల్. ‘బాబీ’ రిలీజ్ కు కొన్ని నెలల ముందే(1973) రాజేశ్, డింపుల్ పెళ్ళాడారు. పెళ్ళయ్యాక డింపుల్ సినిమాలకు దూరంగా ఉంది. ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా పుట్టిన తరువాత కూడా రాజేశ్, డింపుల్ మధ్య అన్యోన్యబంధమే ఉందని చెప్పవచ్చు. కారణం ఏంటో తెలియదు కానీ ఆ తర్వాత రాజేశ్, డింపుల్ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దాంతో పరస్పర అంగీకారంతోనే విడిపోయారు. రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా విభేదించి విడిపోయినా, ఏ నాడూ ఒకరి ఇష్టాలకు మరొకరు అడ్డుగా నిలువలేదు. పిల్లల కోసం ఈ దంపతులు విడాకులు కూడా తీసుకోలేదు. పార్టీల్లో కలుసుకున్నప్పుడు ఫ్రెండ్స్ లా మాట్లాడుకొనేవారు. రాజేశ్ ఖన్నా ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయగా, ఆయన తరపున ప్రచారం కూడా చేసింది డింపుల్. ఈ ఎన్నికలో రాజేశ్ ఖన్నా విజయం సాధించారు. అందుకే విడాకులు ఇవ్వలేదు రాజేశ్ ఖన్నాతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న డింపుల్‌కూ సన్నీ డియోల్ మంచి సోల్‌మేట్ అయ్యాడు. కష్టకాలంలోఆమెకు అండగా నిలబడ్డాడు.వారిద్దరి ప్రేమకథ చిత్రసీమలో భలేగా చక్కర్లు కొట్టింది. వారి లవ్ ఎఫైర్ ను క్యాష్ చేసుకొనేందుకు నిర్మాతలు, దర్శకులు కూడా సన్నీ, డింపుల్ జోడీని ఎంచుకొనేవారు. అయితే వీరిద్దరు ప్రేమ గురించి తెలిసి సన్నీ భార్య పూజ అప్పట్లో గొడవ కూడా చేసింది. దీంతో ఆమెకు విడాకులు ఇవ్వాల్సిందిగా సన్నీని కోరిందట డింపుల్. కానీ సన్నీ మాత్రం భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఇష్టపడలేదట. సన్నీ నిర్ణయంపట్ల కలత చెందిన డింపుల్... రాజేశ్‌కి విడాకులు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకుందట. సన్నీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. చివరి దాకా భార్యగా రాజేశ్ కు సపర్యలు చేసింది డింపుల్. -
‘తాండవ్’ రూపకర్తలపై క్రిమినల్ కేసు
ముంబై: వెబ్‌సిరీస్ ‘తాండవ్’ రూపకర్తలు, అమెజాన్ ఇండియా ఉన్నతాధికారిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో హిందూ దేవుళ్లను కించపర్చారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అమెజాన్ ఇండియా హెడ్ ఆఫ్ ఒరిజినల్ కంటెంట్ అపర్ణ పురోహిత్, వెబ్‌సిరీస్ దర్శకుడు అలీ అబ్బాస్, నిర్మాత హిమాన్షు కృష్ణ మెహ్రా, రచయిత గౌరవ్ సోలంకీ, మరో వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో సైఫ్ అలీ ఖాన్, డింపుల్ కపాడియా తదితరులు నటించారు. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్ విడుదలైంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపడానికి నలుగురు సభ్యుల పోలీసు బృందం ముంబైకి వెళ్లనుంది. వెబ్సిరీస్లోని అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలని మాజీ సీఎం మాయావతి సూచించారు. బేషరతుగా క్షమాపణ చెబుతున్నాం.. మత విశ్వాసాలను, ప్రజల మనోభావాలను దెబ్బతీయాలన్నది తమ ఉద్దేశం కాదని ‘తాండవ్’ వెబ్‌సిరీస్ రూపకర్తలు స్పష్టం చేశారు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. తాండవ్‌ను కల్పిత కథ ఆధారంగా చిత్రీకరించినట్లు తెలిపారు. వ్యక్తులు, సంఘటనలకు దీంతో సంబంధం లేదని అన్నారు. ఒకవేళ సంబంధం ఉన్నట్లు అనిపిస్తే అది యాదృచ్ఛికమేనని ఉద్ఘాటించారు. -
అందరి కన్నూ ప్రధాని కుర్చీ మీదే..
రాజకీయాలు వ్యాఖ్యానించే సినిమాలు బాలీవుడ్లో కొత్త కాదు. కాని కొన్ని సినిమాలే శక్తిమంతంగా తెర వెనుక భాగోతాలను చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గతంలో ప్రకాష్ ఝా దర్శకత్వంలో ‘రాజ్‌నీతి’ సినిమా పెద్ద హిట్ అయ్యింది. రణ్‌బీర్ కపూర్, అజయ్ దేవ్‌గణ్ తదితరులు ఇందులో నటించారు. ఈ సినిమా ఉత్తరప్రదేశ్ తరహా రాష్ట్ర రాజకీయాలను చర్చించింది. ఇప్పుడు అమేజాన్‌లో జనవరి 15 నుంచి స్ట్రీమ్ అవుతున్న ‘తాండవ్’ వెబ్ సిరీస్ దేశ రాజకీయాలను చర్చించే ప్రయత్నం చేసింది. 9 ఎపిసోడ్ల ఈ సిరీస్ ప్రధానంగా ప్రధాని కుర్చీ ఎక్కడానికి నేతలు ఏయే ఆటలు ఆడతారో చెప్పే ప్రయత్నం చేస్తుంది. అలీ అబ్బాస్ దర్శకత్వంలో ‘గుండె’, ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ వంటి భారీ సినిమాలు తీసిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఓటిటి ప్లాట్‌ఫామ్ మీద మొదటిసారిగా పొలిటికల్ డ్రామాతో కూడిన వెబ్ సిరీస్ ‘తాండవ్’తో ఎంట్రీ ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. అందుకు దేశ రాజకీయాలను వస్తువుగా తీసుకున్నాడు. ‘మీరు ఈ కథను చూస్తే ఏది సరైన నిర్ణయం ఏది కాదు అనేది నిర్ణయించలేరు. అధికారం కోసం ఏ పని చేసినా సరైనదే అనే అభిప్రాయానికి వస్తారు’ అంటాడతను. సైఫ్ అలీ ఖాన్, డింపుల్ కపాడియా ఇందులో ప్రధాన తారాగణం. సునీల్ గ్రోవర్, క్రితికా కమ్రా, డినో మోరియా తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. (చదవండి: హిందూస్తాన్‌ను నడిపించేది ఒకటే.. అది రాజనీతి) ఆ కుర్చీపై కూర్చోవడం ఎలా? ఈ సిరీస్‌లో ప్రధానిగా తిగ్మాన్షు థులియా అధికారం చలాయిస్తూ ఉంటాడు. అయితే అతని కుమారుడైన సైఫ్ అలీ ఖాన్‌కి ఆ కుర్చీలో కూచోవాలని ఉంటుంది. అందుకు తగినట్టుగా పావులు కదిలిస్తాడు. చదరంగం బల్ల మీద మన ఎత్తు మనం ఎత్తవచ్చు. కాని ఎదుటివాడు ఎత్తు వేయడానికి కూడా చాన్స్ ఇచ్చినవారం అవుతాము. ఎప్పుడైతే సైఫ్ రంగంలోకి దిగాడో ప్రధాని కుర్చీ మీద ఆశలు పెట్టుకున్నవారంతా కదలుతారు. వారిలో ఒకరు డింపుల్ కపాడియా. ఈమె పార్టీ సీనియర్ కార్యకర్త. దాంతో పాటు ప్రధాని ప్రియురాలు కూడా. ఆమె తన గేమ్ మొదలెడుతుంది. ఈమెతో పాటు ప్రధాని కోటరీలో ఉండే మరో మహిళ కూడా రంగంలో దిగుతుంది. (చదవండి: జీవితాంతం నువ్వు నా దానివే..: దర్శకుడు) వర్తమాన ఘటనలు ఈ సిరీస్‌లో వర్తమాన ఘటనలను పోలిన సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమాలో ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ‘రైట్ వింగ్’ పార్టీ అని సంకేతం ఇస్తాడు దర్శకుడు. అలాగే ‘లెఫ్ట్ వింగ్’ పార్టీలు బయట విమర్శలు చేస్తూ దేశ పరిస్థితి మీద వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. మరోవైపు ఒక యూనివర్సిటీ లో ఉవ్వెత్తున ఎగిసిన స్టూడెంట్ ఉద్యమం కూడా కనిపిస్తుంది. దేశ రాజకీయాలను మార్చాలనే విద్యార్థి నాయకులకు ప్రతినిధిగా నటుడు జీషాన్ అయూబ్ కనిపిస్తాడు. మూస రాజకీయాలకు ఇటువంటి విద్యార్థి రాజకీయాల నుంచి భంగం తప్పకపోవచ్చు అనే సంకేతం కూడా ఉంటుంది. సామాన్యుడి ఊహకు కూడా అందని ఎన్నో రాజకోట రహస్యాలు దేశంలో జరుగుతూ ఉంటాయి. వాటిలో ఎన్నో కొన్ని ఇలా ఫిక్షన్ రూపు తీసుకుంటూ ఉంటాయి. ఈ సిరీస్ గొప్ప హిట్ అవకపోవచ్చు. కాకపోతే డింపుల్ కపాడియా వంటి ఆర్టిస్టుల ప్రతిభకు అద్దం పడుతుంది. రాజకీయాలు ఆసక్తి ఉన్నవారు తప్పక చూడదగ్గ సిరీస్ ఇది. -
అత్తకు ప్రశంసలు.. అల్లుడి ఆనందం
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా ‘టెనెట్’ శుక్రవారం(డిసెబంర్ 4) భారత్‌లో విడుదలైంది. జూన్‌లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా కరోనా పరిస్థితుల్లో కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంటోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా కీలక పాత్రలో నటించారు. ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలో డైరెక్టర్ క్రిస్టఫర్ నంచి డింపుడ్ కపాడియా ఓ లెటర్ అందుకున్నారు. సినిమాలో ముఖ్య పాత్ర పోషించింనందుకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖలో రాశారు. చదవండి: యూపీ సీఎంతో అక్షయ్ భేటీ ఈ లెటర్‌ను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. అల్లుడిగా గర్వించే క్షణం అంటూ ఉప్పొంగిపోయారు.‘ క్రిస్టోఫర్ నోలస్ నుంచి డింపుల్ కపాడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ వచ్చింది. నేను ఆమె స్థానంలో ఉంటే ఆశ్యర్చంతో ఉండిపోయేవాడిని. టెనెట్‌లో ఆమె నటన చూసి సంతోషంగా అనిపించింది. ఆమె అల్లుడిగా గర్వంగా ఫీల్ అవుతున్నాను’. అని ట్వీట్ చేశారు. కాగా డింపుల్ కపాడియా కూతురు ట్వింకిల్ ఖన్నాని అక్షయ్ కుమార్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: అల్లు అర్జున్‌కు నో చెప్పిన అనసూయ Here’s my proud son-in-law moment! #ChristopherNolan pens a heartfelt note to #DimpleKapadia on the eve of their release.Had I been in her place,I wouldn’t have been able to move in awe but having watched her working her magic in #Tenet,I couldn’t be more happy and proud of Ma ♥️ pic.twitter.com/EgSehxio1I — Akshay Kumar (@akshaykumar) December 5, 2020 -
తగ్గుతున్నా!
సాధారణంగా సంతానం లేనివారు పిల్లలను దత్తత తీసుకుంటారు. కానీ ఓ అనాథ యువకుడు తల్లిదండ్రులను దత్తత తీసుకుంటాడు. దాంతో అతని జీవితం మారుతుంది. అయితే అతని ప్రేమ, పెళ్లి విషయాల్లో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఆ యువకుడు ఎలా పరిష్కరించాడు? ఇందులో అతని ప్రేయసి ప్రమేయం ఎంత? అనే అంశాలకు కాస్త హాస్యం జోడిస్తూ హిందీలో ఓ సినిమా తెరకెక్కనుంది. రాజ్‌కుమార్‌రావు, కృతీసనన్ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. పరేష్ రావల్, డింపుల్ కపాడియా కీలక పాత్రధారులు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత దినేష్ విజన్ తెలిపారు. ప్రస్తుతం కృతీ ‘మిమీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆమె సరోగేట్ మదర్ పాత్ర చేస్తున్నారు. ఈ పాత్ర కోసం కృతీ 15 కిలోల బరువు పెరిగారు. రాజ్‌కుమార్ రావుతో ఒప్పుకున్న తాజా సినిమా కోసం బరువు తగ్గుతున్నారు. -
‘నేను బతికే ఉన్నాను.. బాగున్నాను’
తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్లపై అలనాటి బాలీవుడ్ హీరోయిన్ డింపుల్ కపాడియా(62) స్పందించారు. ‘నేనింకా బతికే ఉన్నాను. బాగున్నాను. దయచేసి ఇష్టం వచ్చినట్లు ఊహించుకోకండి’ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత నకిలీ వార్తలు జోరుగా ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డింపుల్ పెద్ద కుమార్తె, నటి-రచయిత్రి ట్వింకిల్ ఖన్నా ముంబైలోని ఆస్పత్రి బయట కనిపించడంతో.. డింపుల్ అనారోగ్యం బారిన పడ్డారంటూ వదంతులు వ్యాపించాయి. ఆస్పత్రి వద్ద నిల్చుని ఉన్న ట్వింకిల్ ఫొటోలు చూసి ప్రతీ ఒక్కరు తమకు ఇష్టారీతిన డింపుల్ ఆరోగ్యంపై కథనాలు అల్లేశారు. ఈ నేపథ్యంలో ముంబైలో విలేకరులతో మాట్లాడిన డింపుల్.. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన తల్లి బెట్టీ కపాడియా అనారోగ్యం పాలయ్యారని, ఆమె కోసమే ఆస్పత్రికి వచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నారని.. ఆమెకు దీర్ఘాయిష్షు ప్రసాదించేలా దేవుడిని కోరుకోవాలంటూ అభిమానులకు విఙ్ఞప్తి చేశారు. కాగా పదహారేళ్ల వయస్సులోనే బాబీ(1973) సినిమాతో డింపుల్ కపాడియా బాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. అదే ఏడాది సహ నటుడు, బాలీవుడ్ సూపర్‌స్టార్ రాజేశ్ ఖన్నాను వివాహమాడారు. ఈ జంటకు ట్వింకిల్ ఖన్నా(హీరో అక్షయ్ కుమార్ భార్య), రింకీ ఖన్నా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇక సాగర్, రామ్ లఖణ్, దిల్ చాహ్తా హై, ద్రిష్టి, రుడాలి, ఫైండింగ్ నానీ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన డింపుల్... రుడాలి సినిమాకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం సొంతం చేసుకున్నారు. కాగా డింపుల్ కపాడియా ప్రస్తుతం టెనెట్ అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఏడు దేశాల్లో సినిమా షూటింగ్
బాలీవుడ్ తారలు హాలీవుడ్ సినిమాల్లో అప్పుడప్పుడు మెరుస్తూనే ఉంటారు. ప్రియాంక చోప్రా అయితే ఏకంగా అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడి అక్కడికే మకాం మార్చేసింది. ఇక ఐశ్వర్యరాయ్, దీపికా పదుకోన్‌లు హాలీవుడ్లో సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నారు. తాజాగా సీనియర్ నటి డింపుల్ కపాడియా, హాలీవుడ్ క్రేజీ దర్శకుడైన క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. అకాడమీ అవార్డు గ్రహిత క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో డింపుల్ కపాడియా నటిస్తున్న చిత్రం ‘టెనిట్’. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో సినిమానికి సంబంధించిన సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా డింపుల్, క్రిస్టోఫర్‌లు సెట్లో కబుర్లు చెప్పుకుంటూ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ‘టెనిట్’ను దాదాపు ఏడు దేశాల్లో షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆస్కార్ విజేత డేవిడ్ వాషింగ్టన్ హీరోగా నటిస్తున్నారు. బాబీ(1973), సాగర్(1985) సినిమాలకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న డింపుల్ కపాడియా...‘లీలా’(2000) తో హాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. Christopher Nolan & Dimple Kapadia on set todayhttps://t.co/97zmLc9nxd #TENET pic.twitter.com/pN9qeGSi7f — ibabysky (@Ibabysky) July 27, 2019 -
హాలీవుడ్ మళ్లీ పిలిచింది
హాలీవుడ్ సినిమాల్లో మన ఇండియన్ తారలు అప్పుడప్పుడు మెరుస్తూనేఉన్నారు. ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్ ఇలా హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తూనే వచ్చారు. ప్రియాంక అయితే ఏకంగా హాలీవుడ్‌కే మకాం మార్చేశారు. తాజాగా సీనియర్ నటి డింపుల్ కపాడియా ఓ హాలీవుడ్ సినిమాలో నటించడానికి అంగీకరించారు. హాలీవుడ్ క్రేజీ దర్శకుల్లో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో డింపుల్ నటించనున్నారు. ఇంగ్లీష్ సినిమాలో నటించడం ఆమెకు ఇది మొదటిసారేం కాదు, ‘లీలా’ (2002) అనే ఆంగ్ల చిత్రంలో ఆల్రెడీ నటించారామె. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కే తాజా చిత్రంలో ఆస్కార్ విజేత డేవిడ్ వాషింగ్టన్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాకు ‘టెనిట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సుమారు ఏడు దేశాల్లో ఈ సినిమాను షూట్ చేయనున్నారట. వచ్చే ఏడాది జూలై 17న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. -
స్క్రీన్ టెస్ట్
అక్కడ ఇక్కడ.. సినిమాకి నో బౌండరీస్. ఇక్కడ హిట్టయిన సినిమా అక్కడ... అక్కడ హిట్టయిన సినిమా ఇక్కడ రీమేక్ అవుతుంటాయి. అలాంటి రీమేక్ మూవీస్ గురించి ఈ వారం స్పెషల్. 1. హిందీ చిత్రం ‘మిలీ’ తెలుగు ‘జ్యోతి’ చిత్రానికి మాతృక. అక్కడ (బాలీవుడ్లో) జయభాదురీ టైటిల్ రోల్ చేశారు. ఇక్కడ (టాలీవుడ్) ఆ పాత్రను పోషించిన నటి ఎవరు? ఎ) జయసుధ బి) జయప్రద సి) శ్రీదేవి డి) సుజాత 2. యన్టీఆర్ నటించిన ‘యుగంధర్’ సినిమా హిందీ ‘డాన్’కి రీమేక్. ఆ చిత్రంలో హీరోగా నటించిందెవరో గుర్తుందా? ఎ) జితేంద్ర బి) రిషికపూర్ సి) మిథున్ చక్రవర్తి డి) అమితాబ్ 3. తమిళ సూపర్ డూపర్ హిట్ ‘నాట్టామై’ తెలుగులో ‘పెదరాయుడు’గా విడుదలై, ఇక్కడా బంపర్ హిట్ సాధించింది. తెలుగులో మోహన్‌బాబు నటించారు. తమిళ్లో మోహన్‌బాబు పాత్రను పోషించిన నటుడెవరో తెలుసా? ఎ) విజయ్‌కాంత్ బి) పార్తిబన్ సి) శరత్‌కుమార్ డి) రజనీకాంత్ 4. విజయశాంతి హిందీలో చేసిన మొదటి చిత్రం ‘ఈశ్వర్’. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘స్వాతిముత్యం’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్ర దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) కె.విశ్వనాథ్ బి) బి.గోపాల్ సి) కె. రాఘవేంద్రరావు డి) కె. మురళీమోహన రావు 5. అక్కినేని నాగేశ్వరరావు హిందీలో ఒకే ఒక్క సినిమాలో నటించారు. తెలుగులో ఆయన నటించిన ఓ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ అది. ఆ చిత్రకథానాయిక అంజలీదేవి, ఆమె భర్త, చిత్రనిర్మాత ఆదినారాయణరావు మాటను కాదనలేక ఏయన్నార్ హిందీలో నటించారు. ఇంతకీ ఆ సినిమా పేరేంటి? ఎ) దేవదాసు బి) సువర్ణసుందరి సి) కీలుగుర్రం డి) తెనాలి రామకృష్ణ 6. హీరో రాజÔó ఖర్ను ఒకప్పుడు ‘అంకుశం’ రాజశేఖర్ అనేవారు. ఆ సినిమా ద్వారా ఆయనకు అంత పేరొచ్చింది. మరి... ఆ సినిమా రీమేక్ ద్వారా బాలీవుడ్‌కి హీరోగా పరిచయమైన తెలుగు నటుడెవరో తెలుసా? ఎ) బాలకృష్ణ బి) వెంకటేశ్ సి) చిరంజీవి డి) నాగార్జున 7. ‘మిస్సమ్మ’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆ సినిమాలో ఎన్టీఆర్ చేసిన పాత్రను తమిళ్లో చేసిన నటుడెవరు? ఎ) యంజీఆర్ బి) శివాజీ గణేశన్ సి) జెమినీ గణేశన్ డి) శివకుమార్ 8. కన్నడ చిత్రం ‘యు టర్న్’ తెలుగు రీమేక్‌లో సమంత జర్నలిస్ట్‌గా చేశారు. కన్నడ ‘యు టర్న్’లో ఆ పాత్ర చేసిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) ప్రియమణి బి) రకుల్ ప్రీత్‌సింగ్ సి) అంజలి డి) శ్రద్ధా శ్రీనాథ్ 9. రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ అన్ని భాషల్లోనూ పెద్ద హిట్. ఆ సినిమా మొదట మలయాళంలో వచ్చింది. ‘చంద్రముఖి’ కన్నడ, తమిళ్, తెలుగు భాషలకు డైరెక్టర్ పి.వాసు. ఒరిజినల్ మలయాళ చిత్రానికి దర్శకుడెవరు? ఎ) సురేశ్ కృష్ణ బి) సిద్ధిక్ లాల్ సి) ఫాజిల్ డి) ప్రియదర్శన్ 10 కృష్ణ, జయప్రద జంటగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఊరికి మొనగాడు’. ఆ చిత్రాన్ని హిందీలో ‘హిమ్మత్వాలా’ పేరుతో విడుదల చేశారు. అది పెద్ద హిట్. జయప్రద రోల్‌ను పోషించిన నటి ఎవరు? ఎ) రేఖ బి) హేమ మాలిని సి) శ్రీదేవి డి) డింపుల్ కపాడియా 11. ‘ప్రేమమ్’ తెలుగు సినిమాలో లెక్చరర్ పాత్రలో నటించారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఆ పాత్ర ఒరిజినల్ క్యారెక్టర్‌ను మలయాళంలో చేసిన నటి ఎవరో తెలుసా? ఎ) సాయిపల్లవి బి) మంజిమా మోహన్ సి) అనుపమా పరమేశ్వరన్ డి) నివేథా థామస్ 12 మహేశ్ బాబు కెరీర్లో ‘పోకిరి’ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. అదే పేరుతో ఆ సినిమాను తమిళ్లో తెరకెక్కించారు. అక్కడ కూడా ‘పోకిరి’ మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. మహేశ్‌బాబు క్యారెక్టర్‌ను చేసిన ఆ తమిళ్ హీరో ఎవరు? ఎ) అజిత్ బి) శివ కార్తికేయన్ సి) విజయ్ డి) సూర్య 13. ‘తుమ్హారి సులు’ అనే సినిమాను హిందీలో విద్యాబాలన్ చేశారు. తమిళ్లో ఆ సినిమా రీమేక్ ‘కాట్రిన్ మొళి’లో ఆ పాత్రను చేసిన నటి ఎవరో తెలుసా? ఎ) శ్రుతీహాసన్ బి) జ్యోతిక సి) నయనతార డి) సమంత 14 నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఏ మాయ చేసావె’. ఆ చిత్రం తమిళ్ వెర్షన్లో సమంత పాత్రను పోషించిన నటి ఎవరో తెలుసా? ఎ) శ్రియ బి) త్రిష సి) అమలాపాల్ డి) మీరా జాస్మిన్ 15. సునీల్ హీరోగా నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రం హిందీ రీమేక్‌లో ఆ పాత్రను పోషించిన నటుడెవరో తెలుసా? ఎ) అజయ్ దేవగన్ బి) అక్షయ్ కుమార్ సి) సంజయ్‌దత్ డి) సైఫ్ అలీఖాన్ 16. విద్యాబాలన్ చేసిన హిందీ ‘కహానీ’ తెలుగు రీమేక్ ‘అనామిక’లో నయనతార నాయికగా నటించారు. ‘అనామిక’ సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) మణిశర్మ బి) యం.యం.కీరవాణి సి) మిక్కీ జే మేయర్ డి) కె.యమ్ రాధాకృష్ణన్ 17. వెంకటేశ్ హీరోగా తెలుగు ‘సూర్యవంశం’, అమితాబ్ బచ్చన్ హీరోగా హిందీ ‘సూర్యవంశ్’ చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలనూ తెరకెక్కించిన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) ఈవీవీ సత్యనారాయణ బి) దాసరి నారాయణరావు సి) కోడి రామకృష్ణ డి) బి.గోపాల్ 18. విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయం సాధించింది. హీరోయిన్గా షాలినీ పాండే నటించారు. ఆ చిత్రాన్ని హిందీలో సేమ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ ‘అర్జున్ రెడ్డి’లో హీరోయిన్గా నటిస్తున్నది ఎవరో తెలుసా? ఎ) కరీనా కపూర్ బి) కియరా అద్వాని సి) ఆలియా భట్ డి) ప్రియాంకా చోప్రా 19. తమిళ చిత్రం ‘వసంత మాళిగై’ అంటే తెలుగు ‘ప్రేమనగర్’. రెండు భాషల్లోనూ హీరోలు శివాజీ గణేశన్, అక్కినేని. కానీ హీరోయిన్ ఒక్కరే. ఎవరా హీరోయిన్? ఎ) సావిత్రి బి) వాణిశ్రీ సి) జమున డి) కాంచన 20. రీమేక్ చిత్రాలు చేయడానికి ఇష్టపడనని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన శంకర్ ఓ హిందీ సినిమాని ‘నన్బన్’ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. ఇది ‘స్నేహితుడా’ పేరుతో తెలుగులో విడుదలైంది. హిందీలో కరీనా కపూర్ నాయిక.. మరి సౌత్‌లో ఎవరు? ఎ) ఇలియానా బి) చార్మి సి) కాజల్ అగర్వాల్ డి) శ్రియ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) సి 4)ఎ 5) బి 6) సి 7) సి 8) డి 9) సి 10) సి 11) ఎ 12) సి 13) బి 14) బి 15) ఎ 16) బి 17) ఎ 18) బి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
నానాలో ఉన్న క్రూరత్వాన్ని నేనూ చూశా : సీనియర్ నటి
సీనియర్ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా చేసిన లైంగిక ఆరోపణలు బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తనుశ్రీకి మద్దతుగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు గళం విపుతున్నారు. నానా పటేకర్‌లో ఉన్న క్రూరత్వాన్ని వెలుగులోకి తెస్తున్నారు. హాలీవుడ్ మీటూ ఉద్యమం లాగా తనుశ్రీ వివాదం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ సీనియర్ నటుడు చాలా మంది మహిళా నటీమణులను వేధించినట్టు వెలుగులోకి వస్తోంది. తాజాగా ఎనిమిదేళ్ల క్రిందట ఎన్డీటీఈ ఇంటర్వ్యూలో నానా పటేకర్ గురించి సీనియర్ నటి డింపుల్ కపాడియా చెప్పిన ఆశ్చర్యకరమైన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నానా పటేకర్‌లో ఉన్న క్రూరత్వాన్ని తాను కూడా చూశానని నటి డింపుల్ కపాడియా అప్పట్లో చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 2010లో ‘తుమ్ మిలో తో నహి’ రిలీజ్ సందర్భంగా డింపుల్ కపాడియా ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇన్నేళ్లు నానాతో కలిసి నటించారు కదా..! పటేకర్ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించాదా? లేదా గతంలోలాగే ఉన్నారా? అని డింపుల్‌ను సినీ విమర్శకురాలు అనుపమ చోప్రా ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నాకు తెలిసి అతడు దుర్మార్గుడు. అతడు గొప్ప నటుడే. కానీ అతడి జీవితంలో కూడా ఓ చీకటి కోణం ఉంది’... మంచి విషయంలోనూ, చెడు విషయంలోనూ రెండింటిలో చెప్పాలంటే.. నటుడిగా నైపుణ్యం విషయానికి వస్తే అతడ్ని మించిన వారు లేరు. అంత అద్భుతమైన నటుడు. అతడి ప్రతిభను చూశాకా.. వంద హత్యలు చేసినా క్షమించాలి అనిపిస్తుంది. నా ప్రాణం కూడా తీసుకో అనాలి అనిపిస్తుంది. నటుడిగా అతడిపై నాకున్న అభిప్రాయం ఇది. వ్యక్తిగతంగా అతడు చాలా స్నేహంగా ఉంటారు. కానీ అతడిలో కూడా చెడు కోణం ఉంది. ప్రతి ఒక్కరికీ అలాంటి చీకటి కోణం ఉంటుంది’ అని డింపుల్ పేర్కొన్నారు. డింపుల్ కపాడియా, నానా పటేకర్ పలు ఐకానిక్ సినిమాలు తీశారు. 1991లో ఫైనల్ అటాక్, 1992లో అంగర్ వంటి సినిమాల్లో వీరు కలిసి నటించారు. ఇటీవల నటి రేణుకా షహానే కూడా నానా పటేకర్‌పై పలు ఆరోపణలు చేశారు. పటేకర్ స్థిరత్వం లేని వ్యక్తని, ఆయన స్వభావం వల్ల చిత్ర పరిశ్రమలోని చాలా మంది బాధపడ్డారని చెప్పారు. Nana Patekar's "dark side" has always been an open secret in Bollywood. Dimple Kapadia said this 8 years ago. pic.twitter.com/9hbd0WmcZo — Od (@odshek) September 28, 2018 -
లండన్ వీధుల్లో సీనియర్ నటుల సాన్నిహిత్యం!
బాలీవుడ్ స్టార్స్ సన్నీడియోల్, డింపుల్ కపాడియాలు లండన్ వీధుల్లో షికార్లు చేస్తున్నారు. 80, 90లలో ఐదు సినిమాలో కలిసి నటించిన ఈ జంట చాలా కాలం తరువాత ఇలా కలిసి కనిపించటం బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వీరి మధ్య అప్పట్లో ఎఫైర్ ఉందనే రూమర్లు వచ్చాయి. ఇప్పుడు వీరు ఇలా సన్నిహితంగా కనిపించడంపై సోషల్‌మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరు లండన్ వీధుల్లో షికారు చేస్తున్న వీడియో ఒకటి బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'సన్నీడియోల్, డింపుల్ కపాడియాలు కలిసి తన సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు.. వారి జంట ఎంతో అందంగా ఉంది' అంటూ కామెంట్ చేశారు కేఆర్కే. 2015లో రిలీజ్ అయిన వెల్ కం బ్యాక్ సినిమా తరువాత డింపుల్ వెండితెర మీద కనిపించలేదు. సన్నీడియోల్ రీసెంట్ గా పోస్టర్ బాయ్స్ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. బాలీవుడ్ స్టార్ గా ఉండగానే డింపుల్ బాలీవుడ్ లెజండరీ నటుడు రాజేష్ ఖన్నాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. 2012లో రాజేష్ ఖన్నా ఆరోగ్య సమస్యలతో మృతి చెందిన తరువాత కూడా డింపుల్ నటిగా కొనసాగారు. -
లండన్ వీదుల్లో సన్నీ, డింపుల్
-
అత్తే నాకు బెస్ట్ ఫ్రెండ్: హీరో
ముంబై: బాలీవుడ్ అలనాటి హీరోయిన్, తన అత్త డింపుల్ కపాడియా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని హీరో అక్షయ్ కుమార్ అన్నాడు. బాలీవుడ్లో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరని ట్విట్టర్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అక్షయ్ పైవిధంగా సమాధానం ఇచ్చాడు. అభిమానులతో ట్విట్టర్ చాట్ సందర్భంగా అక్షయ్.. మరో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్‌ను ప్రశంసించాడు. షారుక్ కు వ్యాపార తెలివితేటలు బాగున్నాయని అన్నాడు. బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియాల కూతురు ట్వింకిల్ ఖన్నాను అక్షయ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లో నటించిన ట్వింకిల్ అక్షయ్‌ను వివాహం చేసుకున్న తర్వాత నటనకు దూరమైంది. -
రాజ్‌కపూర్ టెక్నిక్
నాస్టాల్జియా బాబీ సినిమాతో రాజ్‌కపూర్ ఎక్స్పోజింగ్ సన్నివేశాలకు తెరలేపాడు. బాబీలో డింపుల్ కాపాడియాను ఆ తర్వాత సత్యం శివమ్ సుందరంలో జీనత్ అమాన్‌ను, ఆ తర్వాత రామ్ తేరి గంగామైలీలో మందాకినిని ఆయన చూపించిన తీరు వల్లే ఆ సినిమాలు ప్రేక్షకుల్లో కుతూహలం రేపాయన్నది వాస్తవం. అయితే ఇవన్నీ సెన్సార్‌ను దాటి ఎలా బయటపడినట్టు? దీనికి రాజ్‌కపూర్ ఒక టెక్నిక్ పాటించేవాడు. సెన్సార్ డేట్ వచ్చి లోపల కమిటీ సినిమా చూస్తూ ఉండగా నలిగిన పైజామా నలిగిన లాల్చీ వేసుకొని వెళ్లేవాడు. గడ్డం అప్పటికే మాసి ఉండేలా చూసుకునేవాడు. ఈ సినిమా లేకపోతే తన పరిస్థితి లేదు అన్నట్టుగా దిగాలు ముఖం పెట్టుకుని కూచునేవాడు. సినిమా చూసి బయటకొచ్చిన కమిటీ ఈయన ముఖం చూసి గట్టిగా కట్స్ చెప్పడానికి మొహమాట పడేది. సరేలే ఏదో పెద్దాయన... ఏడవనీ అని వదిలేసేది. రాజ్‌కపూర్ పథకం పారి పోస్టర్స్ అన్నీ హాట్ హాట్ స్టిల్స్‌తో నిండిపోయేవి. -
‘ఎయిర్‌లిఫ్ట్’లో నిర్మాట్ కౌర్
‘లంచ్‌బాక్స్’ కథానాయిక నిర్మాట్ కౌర్ తాజాగా అక్షయ్‌కుమార్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది. నిఖిల్ అద్వానీ రూపొందించనున్న ‘ఎయిర్‌లిఫ్ట్’లో అక్షయ్‌కుమార్ భార్యగా నిర్మాట్ కనిపించనుంది. కువైట్‌పై 1990లో ఇరాక్ దాడి చేసినప్పుడు అక్కడి నుంచి భారీఎత్తున భారతీయులను స్వదేశానికి తరలించిన నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘‘ఫైండింగ్ ఫ్యానీ’ స్క్రిప్ట్ అద్భుతం ఫైండింగ్ ఫ్యానీ’ స్క్రిప్ట్ అద్భుతమని, ఇందులోని తన పాత్రను చక్కగా తీర్చిదిద్దారని డింపుల్ కపాడియా సంబరపడుతోంది. హోమీ అదాజానియా రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. చాలాకాలం తర్వాత డింపుల్ తెర ముందుకు వస్తుండటంతో బాలీవుడ్ వర్గాల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి వ్యక్తమవుతోంది. ‘షాన్‌దార్’లో సనా కపూర్ షాహిద్ కపూర్ చెల్లెలు సనా కపూర్ త్వరలోనే తెరంగేట్రం చేయనుంది. వికాస్ భల్ రూపొందిస్తున్న ‘షాన్‌దార్’ చిత్రంలో ఆమె తన సోదరుడు షాహిద్ కపూర్, తండ్రి పంకజ్ కపూర్లతో కలసి నటించనుండటం విశేషం. షాహిద్ సరసన కథానాయికగా ఆలియాభట్ ఇందులో నటించనుంది. ఆలియా సోదరిగా సనా కీలక పాత్రలో కనిపించనుంది. -
నన్ను గారం చేసి చెడగొడుతున్నారు: దీపిక
డింపుల్ కపాడియా తనను కన్నకూతురిలా భావించి.. గారం చేస్తూ బాగా చెడగొడుతున్నారని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే చెబుతోంది. అసలు డింపుల్జీతో తన అనుబంధం గురించి మాటల్లో ఏ మాత్రం చెప్పలేనని, ఆమె తెలిపింది. 'కాక్టెయిల్' సినిమాలో తామిద్దరం కలిసి నటిస్తున్నప్పుడు ఆమె తనను భోజనానికి బయటకు తీసుకెళ్లేవారని, షాపింగ్ కూడా చేయించేవారని తెలిపింది. డింపుల్ కపాడియా తనను కన్నకూతురిలా గారం చేసి చెడగొడుతున్నారని గోముగా చెప్పింది. కాక్ టెయిల్ సినిమా సెప్టెంబర్ 12న విడుదల అవుతోంది. ఇది చాలా విభిన్నమైన సినిమా అవుతుందని, ప్రోమోలు చూసినప్పుడు ఆ విషయం తెలిసిందని దీపిక అంది. ఈ చిత్రంలో అర్జున్ కపూర్, నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్ తదితరులు నటించారు. హోమీ అడజానియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తనకు తన మాతృభాష అయిన కొంకణిలో మాట్లాడే అవకాశం కూడా వచ్చిందని దీపిక తెలిపింది. -
మళ్లీ కోర్టుకెక్కనున్న ‘ఆశీర్వాద్’
-
మళ్లీ కోర్టుకెక్కనున్న ‘ఆశీర్వాద్’
బాలీవుడ్ తొలి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాకు ఎంతో ఇష్టమైన 'ఆశీర్వాద్' బంగ్లా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ముంబయి బాంద్రాలోని ఇదే బంగ్లాలో రాజేశ్ ఖన్నా 2012 జూలై 18న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించిన తర్వాత వారసత్వం కింద కుమార్తెలు ట్వింకిల్, రింకీ ఖన్నాలకు ఆ ఆస్తి సంక్రమించింది. వారు ఇప్పుడు ఆ బంగ్లాను నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు విక్రయించినట్లు సమాచారం. నాలుగు దశాబ్దాలకు పైగా ఆ ఇంట్లో నివసించిన అనుబంధంతో ఆశీర్వాద్‌ను మ్యూజియంగా మార్చాలని ఖన్నా ఆశించారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం తన కూతుళ్లదేనని మరణానికి కొన్నేళ్ల ముందు ఆయన చెప్పారు. ప్రస్తుతం వరదాన్ ఆశీర్వాద్‌గా పిలుస్తున్న ఆ ఇంటిని ఆల్ కార్గో లాజిస్టిక్స్ చైర్మన్ శశికిరణ్ శెట్టి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. కాగా బంగ్లా ఆస్తిలో తనకు వాటా ఉంటుందని, రాజేశ్ ఖన్నా తనకు కూడా భర్తేనని ఆయన సహచరి అనితా అద్వానీ గతంలో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఖన్నా కుటుంబ సభ్యులకు ఆమె లీగల్ నోటీసులు పంపించారు కూడా. డింపుల్ ఖన్నాతో విడిపోయిన అనంతరం రాజేశ్ ఖన్నా ఎనిమిదేళ్లు అనితా అద్వానీతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఖన్నా మృతి చెందిన అనంతరం ఆయన ఇంటిని మ్యూజియంగా మార్చాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే.. అనితా అద్వానీకి ఇందులో ఎలాంటి సంబంధం లేదని రాజేశ్ ఖన్నా భార్య డింపుల్, కూతుళ్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా వాదిస్తూ వచ్చారు. ఆశీర్వాద్ బంగ్లా తమ పేరు మీద ఉందని, అందుకే అమ్మకానికి పెట్టినట్లు వారు చెబుతున్నారు. దాంతో ఆశీర్వాద్ బంగ్లా అమ్మకం చెల్లదని పేర్కొంటూ అనితా అద్వానీ మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఇదే వివాదంలో కోర్టులో తనకు అనుకూలంగానే తీర్పు వచ్చిందన్నారు. అయితే కాకాజీ కుటుంబీకులు న్యాయస్థానంపై గౌరవం ఉంచకుండా బంగ్లాను విక్రయించాలనుకోవటం సరికాదన్నారు. దీనిపై తాను తుది వరకూ పోరాడతానకి అనితా అద్వానీ స్పష్టం చేశారు. సముద్రానికి అభిముఖంగా 603 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం రూ.90 కోట్ల వరకు పలుకుతుందని మార్కెట్ వర్గాల కథనం. అయితే ఎవరైనా థర్డ్ పార్టీ.. యాజమాన్య హక్కును కోరడానికి సంబంధించి జారీ చేసిన 14 రోజుల నోటీసు గడువు ముగిసిన తర్వాతే ఈ కొనుగోలు ఒప్పందం పూర్తి అవుతుంద నేది విశ్వసనీయ వర్గాల కథనమని టైమ్స్ ఆఫ్ ఇండియూ పేర్కొంది. 60వ దశకం చివర్లో మరో బాలీవుడ్ దిగ్గజం రాజేంద్రకుమార్ నుంచి ఈ భవనాన్ని కొనుగోలు చేసిన రాజేశ్‌ఖన్నా 80వ దశకంలో దాన్ని పునర్నిర్మించారు. -
కాకాజీ లేక.. ఒంటరిగా అనిపిస్తోంది: డింపుల్ కపాడియా
ఒకప్పుడు భర్త నుంచి విడిపోయినా.. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మాత్రం ఆయన లేని లోటు తెలుస్తోందట. అలనాటి ప్రముఖ నటి డింపుల్ కపాడియా ఈ మాట చెబుతోంది. రాజేష్ ఖన్నా మరణించి దాదాపు ఏడాది కావస్తుండగా ఆ లోటు డింపుల్‌ను బాగా బాధిస్తోంది. భారతీయ సినిమాలోనే మొట్టమొదటి సూపర్ స్టార్ అయిన రాజేష్ ఖన్నా.. వరుసగా 15 హిట్లు కొట్టి రికార్డు సృష్టించగా ఆ రికార్డుకు దరిదాపుల్లోకి కూడా ఇంతవరకు ఎవరూ వెళ్లలేకపోయారు. 1973లో డింపుల్ కపాడియా - రాజేష్ ఖన్నా పెళ్లి చేసుకున్నా, 1984లో విడిపోయారు. కానీ వాళ్లు విడాకులు మాత్రం తీసుకోలేదు. మళ్లీ రాజేష్ ఖన్నా చివరి రోజుల్లో వాళ్లు కలిసే ఉన్నారు. ఆయనకు విపరీతమైన మానసిక బలం ఉందని, అసలు భయమంటే ఏంటో ఆయనకు తెలియదని డింపుల్ చెప్పింది. మరణిస్తానన్న విషయం ఆయనకు తెలిసినా కూడా చివరకు భయపడలేదంది. ఆయన ఎవరికీ భారంగా ఉండేవారు కారని.. శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఎవరిమీదా ఆధారపడలేదని చెప్పింది. పరిశ్రమలో అందరూ 'కాకాజీ' అని పిలుచుకునే రాజేష్ ఖన్నా.. తీవ్ర అనారోగ్యం పాలై, గత సంవత్సరం జూలై 18న మరణించారు. ఆరేళ్ల నుంచి తనకు కష్టాలు తప్పట్లేదని, తొలుత తన అక్క, తర్వాత అన్న, ఆపై కాకాజీ మరణించారని డింపుల్ అంది. దీంతో ఇప్పుడు తనను పూర్తిగా ఒంటరితనం ఆవరించిందని ఆవేదన వ్యక్తంచేసింది. తన తల్లి ముగ్గురు బిడ్డలను కోల్పోగా తానొక్కదాన్నే మిగిలినట్లు చెప్పింది. అయినా ఆమె ఇప్పటికీ నిబ్బరంగా ఉందని, తాను మాత్రం ఇలా మిగిలిపోయానని వాపోయింది. -
రాజేశ్‌ఖన్నా విగ్రహావిష్కరణ
ముంబై: బాలీవుడ్లో మొదటి సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజేశ్‌ఖన్నా కాంస్య విగ్రహాన్ని నగరంలోని ఓ హోటల్లో ఆయన కుటుంబ సభ్యులు శనివారం ఆవిష్కరించారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా ఖన్నా గత జూలై 18న మరణించడం తెలిసిందే. యూటీవీ స్టార్స్ చానెల్ ఆయన గౌరవార్థం బాంద్రాలోని బండ్‌స్టాండ్ ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంది. ఇక్కడ ఇది వరకే యశ్‌చోప్రా, రాజ్‌కపూర్, షమ్మీకపూర్, దేవానంద్ విగ్రహాలున్నాయి. ఖన్నా విగ్రహం కుడిచేతిలో రెండు బెలూన్లు కనిపిస్తాయి. ఇది ఆనంద్ చిత్రంలోని ఆయన పోజనే విషయం తెలిసిందే. విగ్రహావిష్కరణకు ఖన్నా మాజీ భార్య డింపుల్ కపాడియా, కూతురు ట్వింకిల్, అల్లుడు అక్షయ్‌కుమార్, ఆయన స్నేహితులు, బాలీవుడ్ ప్రముఖులు రిషికపూర్, జితేంద్ర, హేమామాలిని, రణధీర్ కపూర్, రాకేశ్ రోషన్, ఆశాపరేఖ్, జీనత్ అమన్, ఫర్హాన్ అఖ్తర్ సతీమణి అధునా, ఆమె తల్లి హానీ ఇరానీ, మిథున్ చక్రవర్తి, అంజూ మహేంద్రూ తదితరులు హాజరయ్యారు. ‘కాకాజీ (ఆయనను అంతా ఇలా ప్రేమగా పిలుచుకునేవారు) ఎప్పుడే శక్తిమంతుడే! జీవితాంతం ఎవరికీ భయపడకుండా తనకు నచ్చినట్టు వ్యవహరించారు. సినీపరిశ్రమకు ఆయన అందించిన సహకారం మరువలేనిది. ఆనంద్ పాత్రధారి మాదిరిగానే నిజజీవితాన్ని గడిపారు. ఆయనతో నా ప్రయాణం మధురమైనది. ఖన్నా జీవితభాగస్వామిని అయినందుకు గర్వంగా ఉంది’ అని డింపుల్ పేర్కొన్నారు. ఖన్నా నటించిన చివరి వాణిజ్య ప్రకటనలో ఆయన పలికిన కొన్ని మాటలను కూడా ఆమె ఈ సందర్భంగా వినిపించారు. ఆ ప్రకటనలో ఆయన ‘నా అభిమానులను నా నుంచి ఎవరూ దూరం చేయలేరు’ అని అంటారు. బాంద్రాలోని కార్టర్రోడ్డు లేదా మరేదైనా మార్గానికి ఖన్నా పేరు పెట్టాలని ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి రాజీవ్‌శుక్లాను ఆమె కోరారు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ట్వింకిల్ ఖన్నా మాట్లాడుతూ నాన్న ఎల్లప్పుడూ తన హృదయంలోనూ ఉంటారని, ఆయన విగ్రహం ప్రతిష్ఠిస్తున్నందుకు తమ కుటుంబం ఎంతగానో సంతోషిస్తోందని చెప్పింది. ఇక అక్షయ్ తన పదేళ్ల కొడుకు రాసిన సందేశాన్ని చదివి వినిపించాడు. తాతతో తనకున్న అనుబంధాన్ని ఈ బాలుడు అందులో పేర్కొన్నాడు. ఆయన గొప్ప మనిషని, ఎప్పుడూ తన వెన్నంటే ఉంటారన్నాడు. ‘విగ్రహంలోని ఆయన చూపులు నిర్భీతి, సంతోషం, స్వేచ్ఛకు సంకేతాలు. జీవితాన్ని ఎప్పుడూ స్వేచ్ఛగా గడపాలని బెలూన్లు సూచిస్తాయి. విగ్రహం కూడా అద్భుతంగా ఉంది’ అని అక్షయ్ వివరించాడు. ఖన్నా బాలీవుడ్‌కు చేసిన కృషికి గుర్తింపు విగ్రహస్థాపన ద్వారా దక్కిందని హమామాలిని అన్నారు. ఆయన తనకు మంచి స్నేహితుడని చెప్పారు. ఖన్నా ప్రముఖ గేయాలు ‘అచ్చా తో హమ్ చల్తే హై’, ‘జిందగీ కా సఫర్’, ‘మేరే సప్నో కీ రాణి’ వంటి వాటిని వినిపించారు. భారత సినీపరిశ్రమ ప్రముఖుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఖన్నా 1962-72 మధ్యకాలంలో వరుసగా 15 హిట్లు ఇచ్చి సంచలనం సృష్టించారు.