Happy Birthday Dimple kapadia: డింపుల్ కపాడియా… ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారులకు నిద్రలేకుండా చేసిన బ్యూటీ. అప్పటి డింపుల్ అందాలను తలచుకొని ఈ నాటికీ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ దర్శకత్వంలో రిషీ కపూర్‌ను హీరోగా తెరకెక్కించిన ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన డింపుల్.. తొలి మూవీతోనే హిట్ కొట్టి ఓవర్ నైట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయింది. అంతేగా కాదు ఉత్తమనటిగా ‘ఫిలిమ్ ఫేర్’ అవార్డును ఎగరేసుకు పోయింది. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఆతర్వాత ‘రుడాలి’లో తన నటవిశ్వరూపం చూపించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగానూ డింపుల్ నిలచింది.
ఇదిలా ఉంటే ‘బాబీ’ సినిమా విడుదల కాకముందే, డింపుల్ గురించి బాలీవుడ్‌లో చర్చలు మొదలయ్యాయి. ఆమె అందం, నటన గురించి బాలీవుడ్ పెద్దలంతా చర్చించుకున్నారు. ఆ విషయం ఆ నోటా, ఈ నోటా ఆ నాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాను చేరింది. అతను తొలి చూపులోనే డింపుల్‌తో ప్రేమలో పడిపోయాడు. ఇక సూపర్ స్టార్ రాజేశ్‌ను చూశాక, డింపుల్ కూడా ఇష్టపడింది. దీంతో తనకంటే వయసులో 15 ఏళ్ళు పెద్దవాడయినా, రాజేశ్ ఖన్నాను వివాహమాడటానికి అంగీకరించింది డింపుల్. ‘బాబీ’ రిలీజ్ కు కొన్ని నెలల ముందే(1973) రాజేశ్, డింపుల్ పెళ్ళాడారు.
పెళ్ళయ్యాక డింపుల్ సినిమాలకు దూరంగా ఉంది. ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా పుట్టిన తరువాత కూడా రాజేశ్, డింపుల్ మధ్య అన్యోన్యబంధమే ఉందని చెప్పవచ్చు. కారణం ఏంటో తెలియదు కానీ ఆ తర్వాత రాజేశ్, డింపుల్ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దాంతో పరస్పర అంగీకారంతోనే విడిపోయారు.
రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా విభేదించి విడిపోయినా, ఏ నాడూ ఒకరి ఇష్టాలకు మరొకరు అడ్డుగా నిలువలేదు. పిల్లల కోసం ఈ దంపతులు విడాకులు కూడా తీసుకోలేదు. పార్టీల్లో కలుసుకున్నప్పుడు ఫ్రెండ్స్ లా మాట్లాడుకొనేవారు. రాజేశ్ ఖన్నా ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయగా, ఆయన తరపున ప్రచారం కూడా చేసింది డింపుల్. ఈ ఎన్నికలో రాజేశ్ ఖన్నా విజయం సాధించారు.
అందుకే విడాకులు ఇవ్వలేదు
రాజేశ్ ఖన్నాతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న డింపుల్‌కూ సన్నీ డియోల్ మంచి సోల్‌మేట్ అయ్యాడు. కష్టకాలంలోఆమెకు అండగా నిలబడ్డాడు.వారిద్దరి ప్రేమకథ చిత్రసీమలో భలేగా చక్కర్లు కొట్టింది. వారి లవ్ ఎఫైర్ ను క్యాష్ చేసుకొనేందుకు నిర్మాతలు, దర్శకులు కూడా సన్నీ, డింపుల్ జోడీని ఎంచుకొనేవారు. అయితే వీరిద్దరు ప్రేమ గురించి తెలిసి సన్నీ భార్య పూజ అప్పట్లో గొడవ కూడా చేసింది. దీంతో ఆమెకు విడాకులు ఇవ్వాల్సిందిగా సన్నీని కోరిందట డింపుల్. కానీ సన్నీ మాత్రం భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఇష్టపడలేదట. సన్నీ నిర్ణయంపట్ల కలత చెందిన డింపుల్... రాజేశ్‌కి విడాకులు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకుందట. సన్నీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. చివరి దాకా భార్యగా రాజేశ్ కు సపర్యలు చేసింది డింపుల్.
Comments
Please login to add a commentAdd a comment