బాలీవుడ్ స్టార్స్ సన్నీడియోల్, డింపుల్ కపాడియాలు లండన్ వీధుల్లో షికార్లు చేస్తున్నారు. 80, 90లలో ఐదు సినిమాలో కలిసి నటించిన ఈ జంట చాలా కాలం తరువాత ఇలా కలిసి కనిపించటం బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వీరి మధ్య అప్పట్లో ఎఫైర్ ఉందనే రూమర్లు వచ్చాయి. ఇప్పుడు వీరు ఇలా సన్నిహితంగా కనిపించడంపై సోషల్‌మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరు లండన్ వీధుల్లో షికారు చేస్తున్న వీడియో ఒకటి బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
'సన్నీడియోల్, డింపుల్ కపాడియాలు కలిసి తన సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు.. వారి జంట ఎంతో అందంగా ఉంది' అంటూ కామెంట్ చేశారు కేఆర్కే. 2015లో రిలీజ్ అయిన వెల్ కం బ్యాక్ సినిమా తరువాత డింపుల్ వెండితెర మీద కనిపించలేదు. సన్నీడియోల్ రీసెంట్ గా పోస్టర్ బాయ్స్ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. బాలీవుడ్ స్టార్ గా ఉండగానే డింపుల్ బాలీవుడ్ లెజండరీ నటుడు రాజేష్ ఖన్నాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. 2012లో రాజేష్ ఖన్నా ఆరోగ్య సమస్యలతో మృతి చెందిన తరువాత కూడా డింపుల్ నటిగా కొనసాగారు.