16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్‌ హీరోకు అత్తగా.. | Dimple Kapadia Throwback Story | Sakshi
Sakshi News home page

16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. కొవ్వొత్తుల వ్యాపారంతో..

Published Mon, May 6 2024 3:41 PM | Last Updated on Mon, May 6 2024 4:01 PM

Dimple Kapadia Throwback Story

డింపుల్ కపాడియా… బాలీవుడ్‌లో ఒకప్పుడు తన అందచందాలతో భారీగా ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న బ్యూటీగా పేరుగాంచింది. డింపుల్ అంటేనే అందం అనేంతగా యూత్‌ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ దర్శకత్వంలో  రిషీ కపూర్‌‌ను హీరోగా తెరకెక్కించిన ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన డింపుల్‌. తొలి మూవీతోనే హిట్‌ కొట్టి ఓవర్ నైట్ బాలీవుడ్ స్టార్ అయిపోయింది. ఆ సినిమా నాటికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే. డింపుల్ కపాడియా 'రుడాలి'లో తన నటవిశ్వరూపం చూపించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగానూ నిలచింది.

16 ఏళ్ల వయసులోనే గర్భం
డింపుల్ కపాడియా  1957లో బొంబాయిలో ఒక సంపన్న గుజరాతీ వ్యాపారవేత్త కుటుంబంలో జన్మించింది. చిన్నతనంలో ఆమెను అమీనా అని పిలిచేవారు కానీ డింపుల్‌గానే ఆమె పేరు స్థిరపడింది. బాలీవుడ్‌ హిట్‌ చిత్రం బాబీలో నటించిన డింపుల్ తన కంటే 15 ఏళ్లు సీనియర్ అయిన సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో డేటింగ్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్‌ అయినట్లు కూడా ఆప్పట్లో వార్తలు వచ్చాయి. 

దీంతో 1973లో డింపుల్ తనకంటే 15 ఏళ్లు పెద్దవాడు అయిన రాజేష్ ఖన్నాను పెళ్లిచేసుకుని వార్తల్లో నిలిచింది. బాబీ సినిమాతోనే ఆమె సినిమా కెరియర్‌కు ఫుల్‌స్టాప్‌ పడిపోయింది.  తన భర్త కోరిక మేరకు  సినిమాలను వదిలేసింది. ఈ సంఘటనలతో ఆమె స్టార్‌డమ్‌ ఒక్కసారిగా కోల్పోయింది.

స్టార్‌ హీరోకు అత్తగా..
1974లో ట్వింకిల్ ఖన్నాకు ఆమె జన్మనిచ్చింది. అంటే ఆమె 16 ఏళ్ల వయసులోనే గర్భం దాల్చారు.  ట్వింకిల్ ఖన్నాను అక్షయ్ కుమార్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌కు పిల్లనిచ్చిన అత్తగానే కాకుండా  ప్రత్యేకమైన పాత్రలతో పలు సినిమాల్లో డింపుల్‌ కపాడియా బిజీగా ఉంది.

పిల్లల కోసం విడాకులకు దూరం
1982లో రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా విభేదించి విడిపోయారు. 1985లో  ఇచ్చిన ఇంటర్వ్యూలో, 'నేను, రాజేశ్ ఖన్నా వివాహం చేసుకున్న రోజుతోనే నా జీవితం ముగిసిపోయింది. ఆపై సంతోషం కూడా ముగిసింది.' అని చెప్పింది. రాజేశ్‌ ఖన్నా తనను మోసం చేశారని డింపుల్ రోపించింది. ఆ ఆరోపణలను రాజేశ్‌ ఎప్పుడూ ఖండించలేదు. పిల్లల కోసం ఈ దంపతులు విడాకులు కూడా తీసుకోలేదు. 

రాజేశ్ ఖన్నా ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయగా, ఆయన తరపున ప్రచారం కూడా చేసింది డింపుల్. వీరిద్దరూ విడిపోయిన తర్వాత 1984లో, డింపుల్, రిషి కపూర్ జంటగా సాగర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి సూపర్‌ హిట్‌ అందుకుంది. తరువాతి 10 సంవత్సరాలలో వరుస హిట్లు అందుకున్న డింపుల్‌ కపాడియా బాలీవుడ్‌లో అగ్ర కథానాయికలలో ఒకరిగా స్థిరపడింది.

సన్నీ డియోల్‌తో ప్రేమకథ
రాజేశ్‌ ఖన్నాతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న డింపుల్‌కూ సన్నీ డియోల్‌ మంచి సోల్‌మేట్‌ అయ్యాడు. కష్టకాలంలోఆమెకు అండగా నిలబడ్డాడు.వారిద్దరి ప్రేమకథ చిత్రసీమలో భలేగా చక్కర్లు కొట్టింది. 1998లో సినిమా ఛాన్స్‌లు తగ్గిపోవడంతో కొవ్వొత్తుల వ్యాపారం ప్రారంభించింది.  సన్నీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. చివరి దాకా భార్యగా రాజేశ్ కు సపర్యలు చేసింది డింపుల్‌.  2012 జూలై 18న రాజేశ్‌ ఖన్నా మరణించారు.

ఇప్పుడేం చేస్తుంది
దిల్ చాహ్తా హై, లక్ బై ఛాన్స్, కాక్‌టెయిల్, దబాంగ్, బ్రహ్మాస్త్ర, పఠాన్ వంటి చిత్రాలలో డింపుల్ కనిపించింది. 2020లో, ఆమె 62 సంవత్సరాల వయసులో క్రిస్టోఫర్ నోలన్ హిట్‌ సినిమా 'టెనెట్‌'లో సహాయక పాత్ర ద్వారా హాలీవుడ్ అరంగేట్రం చేసింది. 2024లో, ఆమె రెండు చిత్రాలలో కనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement