బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా తాజాగా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. 50 ఏళ్ల వయసులో లండన్ యూనివర్సీటీ((గోల్డ్‌స్మిత్స్) నుంచి మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అక్షయ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
(చదవండి: నేనే పాపం చేశాను.. నాపై ఎందుకింత పగ?: నటి)
‘చదువుకోవాలని ఉందని రెండేళ్ల క్రితం నువ్వు నాతో చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. కానీ చాలా కష్టపడి అనుకున్నది సాధించావు. ఇల్లు, కెరీర్, పిల్లలను అన్నింటిని చూసుకుంటూ చదువు ప్రయాణాన్ని కొనసాగించి, విజయం సాధించావు. నేను సూపర్ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా. భర్తగా ఎంత గర్వపడుతున్నానో చెప్పేందుకు నేనూ ఇంకా చదువుకోవాలనుకుంటున్నా. కంగ్రాట్స్ మై లవ్’ అని ఇన్‌స్టాలో రాసుకొస్తూ.. ట్వింకిల్ పట్టా అందుకున్న సందర్భంగా ఆమెతో దిగిన ఫోటోని షేర్ చేశాడు. అక్షయ్ పోస్ట్‌పై ట్వింకిల్ ఖన్నా స్పందిస్తూ.. ‘ప్రొత్సహించిన భర్త దొరకడం నా అదృష్టం’అని అన్నారు.
(చదవండి: అరెరె... ఇది తెలీక వేరే కథతో సినిమా తీస్తున్నానే..: మారుతి)
ఇక ట్వింకిల్ ఖన్నా విషయానికొస్తే.. తల్లిదండ్రులు డింపుల్ కపాడియా, రాజేశ్ ఖన్నా వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘బర్సాత్’(1995) ఆమె తొలి చిత్రం. ఆ తర్వాత ‘జాన్’, ‘దిల్ తేరా దీవానా’, ‘ఇంటర్నేషనల్ ఖిలాడి’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించింది.వెంకటేష్ హీరోగా నటించిన ‘శీను’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ.. ట్వింకిల్ నటించలేదు. అక్షయ్‌తో పెళ్లి తర్వాత నటనతో గుడ్‌బై చెప్పింది. వీరిద్దరికి వీరికి కుమారుడు ఆరవ్ (21), కుమార్తె నితారా (11) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment