స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడతాడు! | Akshay Kumar Reveals Son Aarav Using Second Hand Dresses And Does Household Chores Himself, Deets Inside | Sakshi
Sakshi News home page

Akshay Kumar: అది ఇష్టం లేదు.. అందుకే సెకండ్ హ్యాండ్ బట్టలు కొంటాడు

Published Wed, May 22 2024 10:09 AM | Last Updated on Wed, May 22 2024 1:25 PM

Akshay Kumar Reveals Son Aarav Using Second Hand Dresses

సినిమా హీరోలు అనగానే కాస్ట్ లీ బట్టలు, ఖరీదైన కార్లు, లగ్జరీ లైఫ్.. చాలామందికి ఇవే గుర్తొస్తాయి. కానీ వీళ్లలో చాలా తక్కువ మంది మీడియా కంటికి కనిపించకుండా చాలా సాధారణంగా జీవిస్తుంటాడు. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటి ఓ స్టార్ హీరో కొడుకు గురించి. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే స్టార్ హీరో తండ్రిగా ఉన్నాడు. కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ కొడుకు మాత్రం సెకండ్ హ్యాండ్ బట్టలే వాడుతున్నాడట.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. హిట్ ఫ్లాప్‌తో వరస మూవీస్ చేస్తూనే ఉంటాడు. రీసెంట్‌గానే 'బడే మియా చోటే మియా' సినిమాతో వచ్చాడు. కానీ ఘోరమైన ఫెయిల్యూర్ అందుకున్నాడు. తాజాగా టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ హోస్టింగ్ చేస్తున్న 'ధావన్ కరేంగే' అనే టాక్ షోకు అక్షయ్.. గెస్ట్‌గా వచ్చాడు. తన కొడుకు ఆరవ్ గురించి ఎవరికీ తెలియని విషయాల్ని బయటపెట్టాడు.

'నేను, ట్వింకిల్ (అక్షయ్ భార్య).. ఆరవ్‌ని పెంచిన విధానంపై నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే అతడు చాలా సాధారణమైన అబ్బాయి. ఇది చెయ్ అది చెయ్ అని అతడిని ఎప్పుడూ బలవంత పెట్టలేదు. వాడికి సినిమాలపై ఇంట్రెస్ట్ లేదు. కానీ ఫ్యాషన్‌పై ఆసక్తి ఉంది. ఆరవ్.. 15 ఏళ్లకే లండన్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లాడు. అయితే అతడి వెళ్లాలని మేం కోరుకోలేదు. కానీ వెళ్తుంటే ఆపలేదు. ఎందుకంటే నేను కూడా 14 ఏళ్లప్పుడే ఇంటి నుంచి బయటకొచ్చాను. ఆరవ్.. ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకుంటాడు. మంచి డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు కానీ ఖరీదైన బట్టలు కొనడు. సెకండ్ హ్యాండ్ బట్టలమ్మే థ్రిప్టీ అనే షాప్‌కి వెళ్తాడు. అతడికి డబ్బు వేస్ట్ చేయడం ఇష్టం లేదు. అందుకే ఇలా చేస్తున్నాడు' అని అక్షయ్, తన కొడుకు గురించి సీక్రెట్స్ అన్నీ చెప్పేశాడు.

(ఇదీ చదవండి: నటి, యాంకర్ శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న వార్నింగ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement