Graduation Day
-
ఘనంగా తమన్నా మేకప్ స్టూడియో స్నాతకోత్సవం (ఫొటోలు)
-
వ్యవసాయంలో స్థిరత్వాన్ని సాధించాలి
బాపట్ల: వ్యవసాయంలో స్థిరత్వాన్ని సాధించడం కోసం వినూత్న విధానాలను రూపొందించేందుకు విద్యార్థులు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ సూచించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలోని డా.బి.వి.నాథ్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 56వ స్నాతకోత్సవ సభలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ మంటే కేవలం ఆహారోత్పత్తి మాత్రమే కాదని, జీవితాన్ని పోషించడమనే వాస్తవాన్ని విద్యార్థులంతా గ్రహించాలని గవర్నర్ సూచించారు. నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని, దాన్ని ఎప్పటికీ ఆపొద్దని, వ్యవసాయ రంగ భవిష్యత్ విద్యార్థుల భుజస్కంధాలపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వస్తున్న అనూహ్య మార్పులను అర్ధం చేసుకుంటూ, సృజనాత్మకతతో మేధస్సును పెంచుకోవాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలకపాత్ర పోషిస్తోందని, ఇది మనం గర్వించదగ్గ విషయమన్నారు. పెరుగుతున్న జనాభా, వాతావరణ ప్రతికూల పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని ప్రశ్నిస్తున్నా... విద్యార్థులు తమ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటూ, డ్రోన్, రిమోట్ సెన్సింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్వంటి నూతన సాంకేతికతలను క్షుణ్ణంగా నేర్చుకుని రైతు సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ చదువును పుట్టిన గ్రామాల సౌభాగ్యానికి వినియోగిస్తే వికసిత భారత్ సాధ్యపడుతుందన్నారు. అనంతరం విశ్వవిద్యాలయ నివేదికను వర్సిటీ ఉప కులపతి డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మీ దేవి సమర్పించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డా.హిమాన్షు పాఠక్ కళాశాల, విశ్వవిద్యాలయ ఉన్నతిని కొనియాడారు. అవార్డుల ప్రదానోత్సవ సభను యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.జి.రామచంద్ర రావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, యూనివర్సిటీ అధికారులు, వివిధ కళాశాలల అసోసియేట్ డీన్లు, ప్రొఫెసర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
గౌతమ్ గ్రాడ్యుయేషన్ డేలో మహేశ్ ఫ్యామిలీ ఫోటోలు
-
సూపర్ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా..భర్తగా గర్వంగా ఉంది: అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా తాజాగా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. 50 ఏళ్ల వయసులో లండన్ యూనివర్సీటీ((గోల్డ్స్మిత్స్) నుంచి మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అక్షయ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. (చదవండి: నేనే పాపం చేశాను.. నాపై ఎందుకింత పగ?: నటి) ‘చదువుకోవాలని ఉందని రెండేళ్ల క్రితం నువ్వు నాతో చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. కానీ చాలా కష్టపడి అనుకున్నది సాధించావు. ఇల్లు, కెరీర్, పిల్లలను అన్నింటిని చూసుకుంటూ చదువు ప్రయాణాన్ని కొనసాగించి, విజయం సాధించావు. నేను సూపర్ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా. భర్తగా ఎంత గర్వపడుతున్నానో చెప్పేందుకు నేనూ ఇంకా చదువుకోవాలనుకుంటున్నా. కంగ్రాట్స్ మై లవ్’ అని ఇన్‌స్టాలో రాసుకొస్తూ.. ట్వింకిల్ పట్టా అందుకున్న సందర్భంగా ఆమెతో దిగిన ఫోటోని షేర్ చేశాడు. అక్షయ్ పోస్ట్‌పై ట్వింకిల్ ఖన్నా స్పందిస్తూ.. ‘ప్రొత్సహించిన భర్త దొరకడం నా అదృష్టం’అని అన్నారు. (చదవండి: అరెరె... ఇది తెలీక వేరే కథతో సినిమా తీస్తున్నానే..: మారుతి) ఇక ట్వింకిల్ ఖన్నా విషయానికొస్తే.. తల్లిదండ్రులు డింపుల్ కపాడియా, రాజేశ్ ఖన్నా వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘బర్సాత్’(1995) ఆమె తొలి చిత్రం. ఆ తర్వాత ‘జాన్’, ‘దిల్ తేరా దీవానా’, ‘ఇంటర్నేషనల్ ఖిలాడి’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించింది.వెంకటేష్ హీరోగా నటించిన ‘శీను’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ.. ట్వింకిల్ నటించలేదు. అక్షయ్‌తో పెళ్లి తర్వాత నటనతో గుడ్‌బై చెప్పింది. వీరిద్దరికి వీరికి కుమారుడు ఆరవ్ (21), కుమార్తె నితారా (11) ఉన్నారు. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) -
D Y Chandrachud: మాట వినే లక్షణమేదీ?
ముంబై: నేటి సమాజంలో ఇతరులు చెప్పేది వినే లక్షణం లోపిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. ఎవరికి వారు తమ వైఖరే గొప్ప అనుకుంటూ ఒక చట్రానికి పరిమితమై బతుకుతున్నారన్నారు. ‘‘ఈ ధోరణిని బద్దలు కొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఇతరులు చెప్పేది వినడం గొప్ప కళ. దాని ద్వారా అవగాహన పరిధి ఎంతగానో పెరుగుతుంది. ప్రపంచాన్ని సరికొత్తగా అర్థం చేసుకోగలం’’అని హితవు పలికారు. శనివారం ఆయన పుణెలోని సింబయాసిస్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. వ్యక్తిగత వృత్తిగత జీవితంలో ఆగ్రహావేశాలు, హింస, ఇతరులను అగౌరవపరడం వంటివాటితో నష్టాలే తప్ప సాధించేదేమీ ఉండదని విద్యార్థులు అర్థం చేసుకోవాలన్నారు. వినయ విధేయతలు, ధైర్యం, సమగ్రతలే ఆయుధంగా ముందుకు సాగాలని హితవు పలికారు. నేటి యువత ప్రశ్నించేందుకు అస్సలు వెనకాడకపోవడం మంచి పరిణామమన్నారు. సమాజంలో విభజనవాదం నానాటికీ పెరిగిపోతోందని ముంబైలో జమునాలాల్ బజాజ్ అవార్డుల ప్రదానోత్సవంలో సీజేఐ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘సోషల్ మీడియాలో కన్పిస్తున్న ధోరణులు, అసహనం దీనికి సంకేతాలే. భారత్ కూడా ఇందుకు అతీతం కాదు’’ అని అభిప్రాయపడ్డారు. -
మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో కేసీఆర్ తాత (ఫొటోలు)
-
హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో కేసీఆర్ తాత
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే వేడుకకు.. తాత, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన వేడుకలో హిమన్షురావు 12వ తరగతి పూర్తి చేసి పట్టా అందుకున్నాడు. కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకు హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డు అందించారు. గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న మనవడు వెంటనే స్టేజీ దిగివచ్చి తాత సీఎం కేసీఆర్ చేతుల్లో పట్టా పెట్టి పాదాలకు నమస్కరించి దీవెనలు తీసుకున్నాడు. -
5,000కు పైగా ‘స్కిల్ హబ్స్’
న్యూఢిల్లీ: దేశంలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి 5,000కుపైగా ‘స్కిల్ హబ్స్’ ప్రారంభించబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కాలానుగుణంగా నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడమే యువతకు తారకమంత్రం కావాలని ఉద్బోధించారు. ఆయన శనివారం ఐటీఐ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఉద్యోగ అవకాశాలూ పెరుగుతున్నాయి. కనుక యువత తమ నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. వారి రంగాల్లో మార్పులను గమనిస్తూండాలి’’ అన్నారు. ‘‘మా హయాంలో గత ఎనిమిదేళ్లలో దేశంలో కొత్తగా దాదాపు 5,000 ఐటీఐలను ప్రారంభించాం. 4 లక్షల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. నూతన విద్యా విధానం కింద అనుభవం ఆధారిత విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తున్నాం. పునరుత్పాదక ఇంధన వనరులు, సోలార్ విద్యుత్, ఎలక్ట్రికల్ వాహనాలు తదితర రంగాల్లో భారత్ ముందంజ వేస్తోంది. సంబంధిత కోర్సులను ఐటీఐల్లో ప్రవేశపెడుతున్నాం’’ అని వివరించారు. రవాణా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి ఉద్దేశించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని మోదీ ఆవిష్కరించారు. ‘‘13–14 శాతమున్న రవాణా లాజిస్టిక్స్ వ్యయాన్ని 7.5 శాతం కంటే దిగువకు తేవడంతో పాటు సమయం, డబ్బు మరింతగా ఆదా అయ్యేలా చూడటమే దీని లక్ష్యం. పీఎం గతిశక్తి పథకంతో కలిసి రవాణా రంగాన్ని ఈ పాలసీ పరుగులు పెట్టిస్తుంది’’ అన్నారు. ‘‘రవాణా వ్యవస్థను ఆధునీకరిస్తున్నాం. ఫాస్టాగ్, ఇ–వే బిల్లింగ్ వంటి చర్యలు చేపట్టాం. ‘‘సాగరమాల ప్రాజెక్టుతో నౌకాశ్రయాల సామర్థ్యాన్ని ఎంతగానో పెంపొందించాం’’ అని గుర్తు చేశారు. -
రాజ్యాంగ అవగాహన తప్పనిసరి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
రాయ్‌పూర్: రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులు, బాధ్యతలు తదితరాలపై పౌరులందరికీ అవగాహన ఉన్నప్పుడే దేశం నిజమైన ప్రగతి సాధిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘‘తేలిక భాషలో వాటిపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ విషయంలో న్యాయ శాస్త్ర పట్టభద్రులు చురుకైన పాత్ర పోషించాలి. వారిని సోషల్ ఇంజనీర్లుగా రూపొందించే బాధ్యతను లా స్కూల్స్ తలకెత్తుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. ఆదివారం రాయ్‌పూర్‌లోని హిదాయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ (హెచ్‌ఎన్‌ఎల్‌యూ) ఐదో స్నాతకోత్సవంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు. ‘‘ఆధునిక భారత ఆకాంక్షలకు అక్షర రూపమైన మన రాజ్యాంగం ప్రతి పౌరునికీ చెందినది. కానీ వాస్తవంలో అది కేవలం లా స్టూడెంట్లు, లాయర్ల వంటి అతి కొద్దిమందికి మాత్రమే పరిమితమైన ఓ పుస్తకంగా మారిపోవడం బాధాకరం’’ అన్నారు. న్యాయ రంగంలో కెరీర్ ఎంతటి సవాళ్లతో కూడినదో అంతటి సంతృప్తినీ ఇస్తుందని సీజేఐ అన్నారు. ‘‘లాయరంటే కేవలం కోర్టులో వాదించే వ్యక్తి కాదు. అన్ని రంగాలపైనా ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ సాగాలి. మార్పుకు శ్రీకారం చుట్టే నాయకునిగా ఎదగాలి. విమర్శలెదురైనా పట్టుదలతో ముందుకు సాగితే విజయం మీదే’’ అని లా గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనకు బలయ్యే అణగారిన వర్గాలకు చట్టపరంగా చేయూతనివ్వాలని సూచించారు. మెరుగైన సామాజిక మార్పుకు చట్టాలు కూడా తోడ్పడతాయని సీజేఐ అన్నారు. ‘‘యువతరం ప్రపంచంలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారంచుడుతోంది. వాతావరణ సంక్షోభం మొదలుకుని మావన హక్కుల ఉల్లంఘన దాకా పెను సమస్యలెన్నింటినో ఎదుర్కోవడంలో సంఘటిత శక్తిగా తెరపైకి వస్తోంది. ఇక సాంకేతిక విప్లవం మనందరినీ ప్రపంచ పౌరులుగా మార్చేసింది. కనుక సామాజిక బాధ్యతలను నెరవేర్చేందుకు మనమంతా ముందుకు రావాలి’’ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో న్యాయ వ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పన, బడ్జెట్ కేటాయింపులు తదితరాల్లో సీఎం భూపేశ్ భగెల్ పనితీరును ఈ సందర్భంగా ప్రశంసించారు. -
28న ప్యారిస్‌కు సీఎం జగన్
సాక్షి, అమరావతి: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న ఫ్రాన్స్‌కు వెళ్తున్నారు. తన పెద్ద కుమార్తె హర్ష.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్(ఎంబీఏ) పూర్తి చేసుకోవడంతో.. గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొనడానికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని సీఎంవో తెలియజేసింది. 28న రాత్రి బయలుదేరనున్న సీఎం జగన్.. 29న ప్యారిస్‌కు చేరుకుంటారు. కుమార్తె గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొన్న తర్వాత.. జులై 2న తిరుగు ప్రయాణం అవుతారు. -
డిగ్రీ పూర్తి చేసిన నోబెల్ గ్రహిత.. ఫోటోలు వైరల్
లండన్: పాకిస్తాన్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహిత మలాలా యూసఫ్ జాయ్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. పాకిస్తాన్లో బాలికల విద్య కోసం తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన విషయం తెలిసిందే. 24 ఏళ్ల మలాలా 9ఏళ్ల తర్వాత తన డిగ్రీ చదువును పూర్తి చేసుకున్నారు. శుక్రవారం జరిగిన గ్రాడ్యుయేషన్ వేడకకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేశారు. గ్రాడ్యుయేషన్‌కు సంబంధించిన దుస్తుల్లో మలాలా.. తన తల్లిదండ్రులు, భర్తతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ గ్రాడ్యుయేషన్ వేడక మే,2020లో జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణం వాయిదా పడింది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలను ఇప్పటికే 6లక్షల మంది వీక్షించారు. సోషల్ మీడియాలో మలాలాకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. అయితే అఫ్గనిస్తాన్‌లో బాలికల సెకండరీ స్కూల్ చదువు విషయంలో బాలిబన్ ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు. 15ఏళ్ల వయసులో పాకిస్థాన్‌లో బాలికలను చదివించాలని ప్రచారం చేసిన ఆమెపై తాలిబాన్ ముష్కరులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం ఆమెను బ్రిటన్‌కు తరలించి.. మెరుగైన చికిత్స అందించారు. మలాలా 2014లో కేవలం 17 ఏళ్ల వయసులోనే నోబెల్ శాంతి బహుమతి అందుకొని.. అతి పిన్న వయసులో నోబెల్ అందుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. View this post on Instagram A post shared by Malala (@malala) -
‘నాన్న ఏడాది జీతం అందుకే ఖర్చయింది’
వాషింగ్టన్ : స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివేందుకు 27 ఏళ్ల కిందట తాను అమెరికా వెళ్లే క్రమంలో తన విమాన టికెట్ కోసం తన తండ్రి ఆయన ఏడాది జీతంతో సమానమైన మొత్తం వెచ్చించారని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో తొలి విమాన ప్రయాణం అదేనని చెప్పుకొచ్చారు. కాలిఫోర్నియా వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితులు తాను ఊహించిన విధంగా లేవని అన్నారు. అమెరికా అత్యంత ఖరీదైన ప్రాంతమని అప్పట్లో ఇంటికి ఫోన్ చేయాలంటే నిమిషానికి రెండు డాలర్లు ఖర్చయ్యేవని, బ్యాగ్ కొనాలంటే భారత్‌లో తన తండ్రి నెల జీతం అంత మొత్తం వెచ్చించాల్సి ఉండేదని తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న సుందర్ పిచాయ్ పట్టభద్రుల్లో ఉత్తేజం నింపేలా ప్రసంగించారు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆశను కోల్పోరాదని చెప్పారు. సాంకేతిక అంశాలు మిమ్మల్ని అసహనానికి గురిచేయవచ్చు..కానీ మీలో ఉండే ఆశను నీరుగార్చకుండా ఉంటే అది తదుపరి సాంకేతిక విప్లవాన్ని సృష్టిస్తుందని, అది తమ కలలో కూడా ఊహించని ఆవిష్కరణలకు దారితీయవచ్చని అన్నారు. సహనంతో ముందుకు సాగితే ప్రపంచం కోరుకునే పురోగతికి అది బాటలు పరుస్తుందని చెప్పారు. చెన్నైలో పెరిగిన పిచాయ్ ఐఐటీ గ్రాడ్యుయేట్ కాగా, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందగా, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ అభ్యసించారు. 2004లో గూగుల్‌లో అడుగుపెట్టిన పిచాయ్ గూగుల్ టూల్‌బార్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆపై ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఇంటర్నెట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను అభివృద్ధి చేశారు. చదవండి : గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చ్ ఇదే.. -
'నా కూతురును చూస్తే గర్వంగా ఉంది'
పిలిభిత్ : బీజేపీ నేత, పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ తన కూతురును చూస్తే చాలా గర్వంగా ఉందంటూ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. తన ముద్దుల కూతురు అనసూయ గాంధీ పాఠశాలలో మొదటి తరగతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రెండవ తరగతికి వెళ్లనుంది. అంతేగాక తన తరగతిలో అతి పిన్న వయస్కురాలిగా మొదటి తరగతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. 'నా కూతురు అనసుయా ఈ రోజు 1 వ సంవత్సరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇయర్ 2 కి వెళుతుంది. ఆమె తన తరగతిలో అతి పిన్నవయస్కురాలు అవడం నాకు గర్వంగా ఉంది' అంటూ లాఫింగ్ ఎమోజీతో ట్వీట్ చేశాడు. (భారత్‌కు ‘స్వావలంబన’తోనే మోక్షం!) 2014 ఆగస్టులో వరుణ్ గాంధీ, యామిని దంపతులకు జన్మించిన అనసూయ గాంధీ బ్లూ ఫ్రాక్ ధరించి దానికి తగినట్లుగా మ్యాచింగ్ గ్రాజ్యుయేషన్ క్యాప్‌పై ఏజీ( అనసూయ గ్రాడ్యుయేటడ్) ధరించి ఫోటోలకు ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రతీ రాష్ట్రంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. వరుణ్ గాంధీ ఈ ఫోటోను గురువారం ఉదయం ట్విటర్లో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ ఫోటోకు 16 వేల లైకులు వచ్చాయి. (ఫేక్ ప్రొఫైల్‌తో ఎన్నారైకి వల; మహిళ అరెస్టు) -
డిజైన్స్ షో
-
కాబోయే భర్తతో కలిసి ఇషా సందడి
బిలీనియర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ స్టాన్ఫోర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. యూనివర్సిటీ 127వ ప్రారంభోత్సవ వేడుకల్లో తన గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఇషా అంబానీ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) పూర్తి చేశారు. తన గ్రాడ్యుయేషన్ డే వేడుకను కుటుంబ సభ్యులతో కలిసి పంచుకున్నారు. ఈ వేడుకలో తన కాబోయే భర్త ఆనంద్ పిరామల్, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. మొత్తం 2460 మంది విద్యార్థులు ఈ వేడుకలో పట్టాలు అందుకున్నారు. ఇషా అంతకముందు సైకాలజీలో డిగ్రీ పట్టా పుచ్చుకుని, యేల్ విశ్వవిద్యాలయంలో సౌత్ ఏషియన్ స్టడీస్ పూర్తిచేశారు. ఇషా తల్లికి తగ్గ తనయ మాదిరి, ఎంబీఏ చదువుకుంటూనే స్టాన్ఫోర్డ్ నర్సరీలో టీచర్ ఉద్యోగం కూడా చేసింది. ఇషా అంబానీ గ్రాడ్యుయేషన్ డే ఫోటోలు మీకోసం... -
తిరుపతి శ్రీ విద్యానికేతన్‌లో గ్రాడ్యుయేషన్ డే
-
ప్రతిభకు అవధిలేని అవకాశాలు
‘గైట్’ గ్రాడ్యుయేష¯ŒS వేడుకలో డాక్టర్ మోహనరెడ్డి 166 మంది ఎంబీఏ, ఎంటెక్ ఉత్తీర్ణులకు పట్టాలు వెలుగుబంద (రాజానగరం) : భారతదేశంలో ప్రతిభ ఉన్న వారి అవకాశాలకు హద్దులు లేవని సైంట్ వ్యవస్థాపకుడు, నాస్కామ్ పూర్వపు చైర్మ¯ŒS పద్మశ్రీ డాక్టర్ బీవీఆర్ మోహనరెడ్డి అన్నారు. ఆధునిక ఆలోచనలతో యువత నూతన ఒరవడికి నాంది పలుకుతూ మంచి పారిశ్రామికవేత్తలుగా తయారుకావాలన్నారు. స్థానిక గైట్ అటానమస్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన గ్రాడ్యుయేష¯ŒS ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ రానున్న దశాబ్ద కాలంలో రానున్న సుమారు 10 కోట్ల మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు సాధ్యం కాదుకాబట్టి ఆసక్తి ఉన్న యువత పారిశ్రామికవేత్తలుగా తయారై తమతోపాటు మరో పది మందికి ఉపాధి చూపాలన్నారు. నేటి సమాజంలో ఆధునికతకే అగ్రస్థానం లభిస్తున్న విషయాన్ని దష్టిలో పెట్టుకుని నూతనావిష్కరణలతో అభివృద్ధి వైపు పయనించాలన్నారు. అధ్యక్షత వహించిన జేఎ¯ŒSటీయూకే వీసీ డాక్టర్ వీవీఎస్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రతి అధ్యాపకుడూ కృషి చేయాలన్నారు. గైట్ కళాశాల ఎండీ కె. శశికిరణ్‌వర్మ మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకులు ఐఐటీలో నూతన బోధనా విధానాలపై శిక్షణ పొందారన్నారు. ఈ కార్యక్రమంలో 166 మంది ఎంబీఏ, ఎంటెక్ పట్టభద్రులకు సర్టిఫికెట్లు, బంగారు పతకాలు అందజేశారు. చైతన్య విద్యాసంస్థల సీఈఓ డాక్టర్ డీఎల్ఎ¯ŒS రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ పీవీజీకే జగన్నాథరాజు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేష¯Œ్స డాక్టర్ రాజ¯ŒS మాథ్యూస్, డైరెక్టర్లు డాక్టర్ పీఆర్కే రాజు, డాక్టర్ టీవీ ప్రసాద్, జీఎం డాక్టర్ పి.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో.. ఆట..పాట..
-
సందడిగా గ్రాడ్యుయేషన్‌డే
-
పట్టాలు అందుకున్న వేళ..
సరూర్‌నగర్: విద్యార్థుల్లో ఒక్కసారిగా ఆనందం తొణికిసలాడింది. పట్టాలు పుచ్చుకున్న వేళ ఎగిరి గెంతులేశారు. ఉల్లాసం ఉత్సాహంగా గడిపారు. ఫొటోలకు పోజులిచ్చారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఇందుకు మీర్‌పేటలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వేదికైంది. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎం-ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన టీకేఆర్ విద్యార్థులకు పట్టాల పంపిణీకి శనివారం ‘గ్రాడ్యుయేషన్ డే’ను నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ హాజరై విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. టెక్నాలజీని దుర్వినియోగం చేయొద్దు.. దేశంలో వనరులకు కొదవ లేదని, మోడ్రన్ టెక్నాలజీని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ సూచించారు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే అది మన పతనానికి దారి తీస్తుందన్నారు. క్రమశిక్షణ, నైతికతను పాటిస్తూ సమాజానికి యువత నూతన వనరులుగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కళాశాల కార్యదర్శి హరినాథ్‌రెడ్డి, కోశాధికారి అమర్నాథ్రెడ్డి, డెరైక్టర్లు ఎస్ఆర్ రామస్వామి, వరప్రసాద్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు రవిశంకర్, పి.రామ్మోహన్రావు, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.