పిలిభిత్ : బీజేపీ నేత, పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ తన కూతురును చూస్తే చాలా గర్వంగా ఉందంటూ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. తన ముద్దుల కూతురు అనసూయ గాంధీ పాఠశాలలో మొదటి తరగతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రెండవ తరగతికి వెళ్లనుంది. అంతేగాక తన తరగతిలో అతి పిన్న వయస్కురాలిగా మొదటి తరగతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. 'నా కూతురు అనసుయా ఈ రోజు 1 వ సంవత్సరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇయర్ 2 కి వెళుతుంది. ఆమె తన తరగతిలో అతి పిన్నవయస్కురాలు అవడం నాకు గర్వంగా ఉంది' అంటూ లాఫింగ్ ఎమోజీతో ట్వీట్ చేశాడు.
(భారత్‌కు ‘స్వావలంబన’తోనే మోక్షం!)
2014 ఆగస్టులో వరుణ్ గాంధీ, యామిని దంపతులకు జన్మించిన అనసూయ గాంధీ బ్లూ ఫ్రాక్ ధరించి దానికి తగినట్లుగా మ్యాచింగ్ గ్రాజ్యుయేషన్ క్యాప్‌పై ఏజీ( అనసూయ గ్రాడ్యుయేటడ్) ధరించి ఫోటోలకు ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రతీ రాష్ట్రంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. వరుణ్ గాంధీ ఈ ఫోటోను గురువారం ఉదయం ట్విటర్లో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ ఫోటోకు 16 వేల లైకులు వచ్చాయి.
(ఫేక్ ప్రొఫైల్‌తో ఎన్నారైకి వల; మహిళ అరెస్టు)
Comments
Please login to add a commentAdd a comment