Pilibhit
-
పాడుబడిన బావిలో కరెన్సీ నోట్లు.. ఎగబడిన జనం
పిలిభిత్: ‘నోట్ల వర్షం కురిసింది’ అనే మాటను మనం ఎప్పుడో ఒకప్పుడు వినేవుంటాం. అయితే ఇంతకీ నోట్ల వర్షం కురుస్తుందా? కురిస్తే ఎలా ఉంటుంది? దీనిని తెలుసుకోవాలంటూ యూపీలోని పిలిభిత్‌లో జరిగిన ఒక ఉదంతాన్ని తెలుసుకోవాల్సిందే..యూపీలోని పిలిభిత్‌లో ఒక పాడుబడిన బావిలోంచి నీటితోపాటు నోట్లు రావడం మొదలైంది. ఈ వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో ఈ నోట్లను దక్కించుకునేందుకు వేలాది మంది బావి దగ్గరకు చేరుకున్నారు. అయితే ఈ నోట్లను దక్కించుకున్నవారు నిరాశగా వెనుదిరిగారు. దీనికి కారణం ఆ నోట్లన్నీ చినిగిపోయి ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ జరుగుతోంది.పిలిభిత్‌లోని బిసల్పూర్ తహసీల్‌కు చెందిన మొహల్లా గ్యాస్పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి మహాదేవ్ ఆలయానికి వెళ్లిన కొందరికి సమీపంలోని బావిలో 10, 20, 50, 100 రూపాయల నోట్లు కనిపించాయి. ఈ వార్త తెలిసిన వారంతా పరుగు పరుగున ఆ బావి దగ్గరకు చేరుకున్నారు. వివిధ పద్ధతుల్లో ఆ నోట్లను బయటకు తీశారు. అయితే ఆ నోట్లన్నీ చినిగిపోయిన స్థితిలో ఉండటంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు. కాగా ఆ బావిలోకి నోట్లు ఎలా వచ్చాయనేది ఇంకా తేలలేదు. ఈ ఉదంతంపై బిసల్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: దీపావళి.. ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు? -
అందుకే వరుణ్ గాంధీని బీజేపీ పక్కన పెట్టింది: అధిర్ రంజన్
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిభిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి బీజేపీ మొండిచెయ్యి చూపడంతో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేదా ఇతర పార్టీలో చేరి బీజేపీ రెబల్‌గా రంగంలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. ఆయన్ను తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వరుణ్ కుటుంబ మూలాలు ‘గాంధీ’తో ముడిపడి ఉండటం వల్లే ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించిందని విమర్శించారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరాలని అధిర్ రంజన్ చౌదరి కోరారు. ఒకవేళ ఆయన పార్టీలో చేరితే సంతోషిస్తామన్నారు. వరుణ్ ఉన్నతమైన నాయకుడని, బాగా చదువుకున్న నేతగా అభివర్ణించారు. పారదర్శకత కలిగిన వ్యక్తిగా తెలిపారు. వరుణ్‌కు గాంధీ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయని, అందుకే ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వలేదని చెప్పారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా పిలిభిత్ లోక్‌సభ స్థానం గత నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఖాతాలోనే ఉంది. అయితే ప్రస్తుతం ఫిలిభిత్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీని కాదని జితిన్ ప్రసాద్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా వరుణ్ బీజేపీ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ తన గళం విప్పారు. సొంత పార్టీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం. చదవండి: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలను బరిలోకి దింపిన బీజేపీ -
వింత హోలీ వేడుకలు.. పురుషులు కనిపిస్తే ‘బాదుడే’!
దేశంలో పలు పండుగలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయ రీతిలో జరుగుతుంటాయి. హోలీ విషయంలోనూ ఇదేవిధంగా కనిపిస్తుంటుంది. సాధారణంగా మహిళల కన్నా పురుషులు హోలీ వేడుకల్లో అత్యంత ఉత్సాహాన్ని కనబరచడం చూస్తుంటాం. కానీ యూపీలోని ఒక ప్రాంతంలో దీనికి భిన్నంగా జరుగుతుంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో హోలీ మర్నాడు స్త్రీలు తమ ప్రత్యేక హోలీని జరుపుకుంటారు. ఆరోజు అక్కడ మహిళలదే రాజ్యం. పురుషులెవరూ గ్రామంలో కనిపించరు. పిలిభిత్ నగరంలోని మధోతండా ప్రాంతంలో ఈ ప్రత్యేక సంప్రదాయం కనిపిస్తుంది. హోలీ మర్నాడు ఈ ప్రాంతంలోని మహిళలంతా గుంపులు గుంపులుగా తిరుగుతూ హోలీ వేడుకలు చేసుకుంటారు. ఆ రోజున స్థానిక మహిళలు హోలీ సంప్రదాయ పాటలు పాడుతూ రోడ్లపై తిరుగుతారు. పాదచారులు, వాహనదారుల నుంచి చందాలు సేకరిస్తారు. ఆ రోజున గ్రామంలోని పురుషులంతా తమ ఇళ్లలో దాక్కుంటారు. లేదా ఊరి బయట ఎక్కడైనా తలదాచుకుంటారు. పిలిభిత్ నగర చరిత్రపై పరిశోధనలు సాగిస్తున్న సీనియర్ జర్నలిస్టు డాక్టర్ అమితాబ్ అగ్నిహోత్రి మీడియాతో మాట్లాడుతూ మధోతండాలో మహిళలు జరుపుకునే హోలీకి శతాబ్దాల చరిత్ర ఉందన్నారు. మాధోతండా అనేది అడవి అంచున ఉన్న ప్రాంతం. పూర్వం రోజుల్లో హోలీ మరుసటి రోజున పురుషులు వేటకు వెళ్లేవారు. ఈ రోజున మహిళలు ఒకచోట చేరి హోలీ ఆడుకునేవారు. క్రమేణా ఈ హోలీ సంప్రదాయ రూపాన్ని సంతరించుకుంది. ఇప్పుడు వేటతో పాటు అడవిలోకి వెళ్లడాన్ని నిషేధించినందున స్థానికంగా ఉన్న మగవారు ఆ రోజున గ్రామాన్ని విడిచిపెట్టి బయటకు వెళతారు. తండాలో మహిళలు హోలీ ఆడే సమయంలో వారికి పురుషులెవరైనా ఎదురైతే వారి నుండి భారీగా చందా వసూలు చేస్తారు. -
వరుణ్‌కు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలెందుకు?
బీజేపీ నేత, పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ నుంచి పోటీ చేయనున్నారా? దీనికి ప్రస్తుతానికి ఎవరి వద్దా సమాధానం లేదు. అయితే ఆయన తాజాగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజధాని ఢిల్లీ నుంచి వచ్చిన వరుణ్ గాంధీ ప్రతినిధులు యూపీలోని పిలిభిత్‌లో నాలుగు సెట్ల నామినేషన్ ఫారాలను కొనుగోలు చేసి, తిరిగి ఢిల్లీకి వెళ్లినట్లు మీడియాకు సమాచారం అందింది. మరోవైపు వరుణ్ గాంధీ పిలిభిత్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తాంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన అధికార ప్రతినిధి వీటిని ఖండించారు. వరుణ్ గాంధీ ఆదేశాల మేరకు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను కొనుగోలు చేశామని, అందులో రెండు హిందీ, రెండు సెట్లు ఇంగ్లీషు భాషలో ఉన్నాయని ఆయన ప్రతినిధి ఎంఆర్ మాలిక్ తెలిపారు. ఈసారి వరుణ్ గాంధీసీటు మారుతున్నదన్న ఊహాగానాలకు తెరదించుతూ ఈ స్థానం నుంచి వరుణ్ గాంధీనే బీజేపీ అభ్యర్థి అని మాలిక్ స్పష్టం చేశారు. వరుణ్ గాంధీ గత కొన్నేళ్లుగా తన సొంత పార్టీ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఈ మధ్యనే ఆయన బీజేపీ నేతలతో మంతనాలు జరిపారు. అలాగే ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. కాగా పిలిభిత్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ ఇంకా ప్రకటించనేలేదు. ఏప్రిల్ 19న పిలిభిత్‌లో తొలి దశలో ఓటింగ్ జరగనుంది. బుధవారం నుంచే ఇక్కడ నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదీఏమైనప్పటికీ వరుణ్ గాంధీ నాలుగు నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. -
వరుణ్ గాంధీ సీటుపై వివాదాలెందుకు? బీజేపీ నేతలు ఏమంటున్నారు?
2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడందుకుంటున్నాయి. ఈ క్రమంలో యూపీలోని పిలిభిత్ లోక్‌సభ స్థానంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి వరుణ్ గాంధీ ఎంపీగా ఉన్నారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ వస్తుందా లేదా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. వరుణ్ సొంత పార్టీ ప్రభుత్వంపై ఎప్పుడూ ఏవో విమర్శలు చేస్తుంటారు. ఫలితంగా ఈసారి బీజేపీ నుంచి వరుణ్ గాంధీకి టికెట్ రాదని స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు. ఈ నేపధ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు స్థానిక నేతలతో పాటు బయటి బీజేపీ నేతలు కూడా ఈ స్థానం నుంచి బరిలో దిగేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఇప్పటివరకూ 33 దరఖాస్తులు వచ్చాయని పిలిభిత్‌కు చెందిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఈ దరఖాస్తులను పార్టీ హైకమాండ్‌కు పంపుతామని, వీటిపై అగ్రనేతలు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాజ్‌వాదీ నుంచి ఇప్పటివరకు నాలుగు దరఖాస్తులు వచ్చాయని, వాటిని అధిష్టానానికి పంపిస్తామని సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదేవ్ సింగ్ జగ్గా తెలిపారు. 90వ దశకంలో నైనిటాల్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న బల్రాజ్ పాసి గత ఆరు నెలలుగా పిలిభిత్‌లోనే ఉంటూ, ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. బిత్రీ చైన్పూర్ ఎమ్మెల్యే పప్పు భరతౌల్ కూడా పిలిభిత్ నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీ వరుణ్ గాంధీ తన సొంత ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం ప్రారంభించినప్పటి నుండి స్థానిక నేతలు ఈ పార్లమెంట్ సీటుపై కన్నువేశారు. -
గోడలెక్కి అడ్డంగా బుక్కైన పెద్దపులి!
పులి మనుషుల మధ్యకు వస్తే.. దాని మనోగతం ఎలా ఉంటుందో హ్యూమర్ టచ్‌తో భావోద్వేగాలను కలగలిపి Tiger Comes to Town(టైగర్ కమ్స్ టూ టౌన్) ద్వారా అందించారు రచయిత ఆర్కే నారాయణ్. అరణ్యా వాసాల్లోకి జనం చేరి.. జనావాసాలుగా మార్చేసుకుని మరీ వన్యప్రాణుల్ని ఇబ్బంది పెడుతుంటే.. అవి ‘రేయ్.. ఎవర్రా మీరంతా’’ అని అనుకోకుండా ఉండగలవంటారా?.. ఉత్తర ప్రదేశ్‌లో ఇవాళ ఓ పెద్దపులిని అధికారులు బంధించారు. దానిని పట్టుకునే సమయంలో అది ప్రవర్తించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా.. పిలిభిత్ జిల్లా అటవీ ప్రాంతాల్లో పులుల బెడద కొనసాగుతోంది. తాజాగా ఓ పులి దారి తప్పి అట్కోనా గ్రామంలోకి వచ్చింది. రాత్రంతా గోడల మీదకు ఎక్కుతూ పడుకుని ఉండి పోయింది. వీధికుక్కలు మొరుగుతుండడంతో గ్రామస్తులు అప్రమత్తం అయ్యి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఆశ్చర్యంగా అది ఎవరి మీదా.. పశువుల మీద కూడా దాడి చేయలేదు. రాత్రి నుంచే ఓ ఇంటి గోడ మీద కునుకు తీస్తూ ఉండిపోయింది. దాని ముఖం మీద లైట్లు వేసినా.. అది పట్టించుకోలేదు. ఉదయం చుట్టూ జనం చేరినా.. వాళ్లను పట్టించుకోకుండా గోడ మీద ఎక్కి కూర్చుంది. Tiger was seen in Pilibhit. Pilibhit Tiger Reserve, surrounded by forests, has its own identity among the tourist places of the country. The tiger that came out of the forest gained a foothold in the populated area. The administration should take concrete steps on this #pilibhit pic.twitter.com/pc6v59mY4z — Aasif Ali Official (@aasif_ali__) December 26, 2023 टाइगर कह रहा है अब वह भी इंसानों के साथ रहेगा, वीडियो उत्तर प्रदेश के पीलीभीत जिले का है, टाइगर रिजर्व जंगल से निकलकर रात 2 बजे अटकोना गांव पहुंचा बाघ गुरुद्वारे की दीवार पर बैठकर आराम फरमा रहा है। #tiger #Pilibhit #UP pic.twitter.com/YIDndUsFXd — Sunil Yadav B+ (@sunilyadav21) December 26, 2023 అయితే పెద్దపులితో ఎప్పటికైనా ప్రమాదమే కదా!. అందుకే దానిని బంధించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అది ఎటూ పోకుండా బారికేడ్లు, వలలు ఏర్పాటు చేశారు. ఈ లోపు.. దానికి మత్తు మందు ఇచ్చి పట్టుకునే యత్నం చేశారు. ఆ సమయంలో దానిని తోక పట్టి అధికారులు లాగినా.. అది కొంచెం కూడా ఆక్రోశం ప్రదర్శించలేదు. చివరకు దానిని బోనులో వేసుకుని అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాని ఆరోగ్య స్థితి.. అది ఎందుకలా ప్రవర్తించింది అనేదానిపై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. పిలిభిత్‌లో అటవీ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ.. నివాసాల్ని నిర్మించుకుంటూ పోతున్న గ్రామస్తుల్ని అటవీ శాఖ అధికారులు వారిస్తూ వస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోందనే విమర్శ ఒకటి ఉంది. A tiger on a wall. But it’s real. The most difficult thing in such situation is to control humans not the wildlife. Scene is from nearby area of Pilibhit. Via @KanwardeepsTOI pic.twitter.com/IE8eXS1Brm — Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 26, 2023 -
పోలీసుల నీచ బుద్ధి.. యువతిపై ఇద్దరు కానిస్టేబుళ్ల అత్యాచారం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. న్యాయం కోసం వచ్చిన వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే నీచానికి పాల్పడ్డారు. చట్టాన్ని కాపాడల్సిన వారే వక్ర బుద్ధి చూపించారు. 23 ఓ ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం షమ్లీ జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. వివరాలు.. ఇమ్రాన్ మీర్జా అనే వ్యక్తి పిలిభిత్ జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2021 మార్చిలో ఫేస్బుక్ ద్వారా యువతి పరిచయమైంది. వీరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు హోటళ్లకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం షమ్లీలో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఆమెకు వసతి కల్పించాడు. అయితే అక్కడ నివసించే సమయంలో మీర్జా సోదరుడు ఫుర్కాన్(కానిస్టేబుల్) కూడా తనపై అత్యాచారం చేశాడని యువతి ఆరోపించింది. ఇద్దరు సోదరులైన కానిస్టేబుళ్లు తనను రోజుల తరబడి నిర్భంధంలో ఉంచి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాక రెండుసార్లు గర్భవతి కాగా.. బలవంతంగా అబార్షన్ చేయించినట్లు ఆరోపించింది. ఈ విషయాన్ని బయటికి చెప్పేందుకు ప్రయత్నించగా.. ఇమ్రాన్ తనను దారుణంగా కొట్టారని తెలిపింది. దీంతో రెండేళ్ల నుంచి వారి అరాచకాలు భరిస్తూ మైనంగా ఉన్నట్లు చెప్పింది. ఇటీవల కామాంధుడి వేధింపులు ఎక్కువయ్యాయని, తరుచూ తనపై చేయిచేసుకున్నట్లు తెలపింది. ఈ క్రమంలోనే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకొని.. కేసు నమోదు చేసినట్లు పేర్కొంది.. అయితే ఇప్పుడు కూడా కేసును ఉపసంహరించుకోవాలని ఇమ్రా,న్ అతని సోదరుడు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వాపోయింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పిలిభిత్ ఎస్పీ అతుల్ శర్మ తెలిపారు. ఇద్దరు కానిస్టేబుళ్లు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చదవండి: రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్ దుర్మరణం.. -
11కేవీ హైఓల్టేజ్ కరెంట్ తీగలపై స్టంట్స్
-
11కేవీ హైఓల్టేజ్ కరెంట్ తీగలపై స్టంట్స్.. వీడియో వైరల్
లక్నో: మన ఇంట్లోని సింగిల్ పేస్ కరెంట్ షాక్ తగిలితేనే ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి 11 కేవీ విద్యుత్తు వైర్లను తాకితే ఏమైనా ఉందా? స్పాట్లోనే మాడి మసైపోతాం. కానీ, ఓ వ్యక్తి ప్రమాదకర సహసానికి పూనుకున్నాడు. 11కేవీ విద్యుత్తు తీగలపై స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్ నగరంలో జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సెప్టెంబర్ 24న నగరంలోని అమారియా ప్రాంతంలో నౌషద్ అనే వ్యక్తి ఈ ప్రమాదకర సాహసం చేశాడు. ఇళ్ల పైకప్పుపైకి ఎక్కి విద్యుత్తు తీగలపైకి చేరుకున్నాడు. ఊయల మాదిరిగా ఊగుతూ అందరిని షాక్‌కు గురిచేశాడు. అయితే.. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్తు సరఫరా నిలిపివేయటం.. అతడికి అదృష్టంగా మారింది. లేకపోతే.. కాలి బూడిదయ్యేవాడు. హైఓల్టేజ్ తీగలపై వేలాడుతున్న వ్యక్తిని చూసిన కొందరు వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను అలర్ట్ చేశారు. విద్యుత్తు సరఫరా ప్రారంభించవద్దని సూచించారు. వెంటనే అక్కడికి చేరుకున్న విద్యుత్తు అధికారులు.. నౌషద్‌ను బలవంతంగా కిందకు దించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారితో పంపించారు. నౌషద్ ప్రస్తుతం బండిపై గాజులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు. అయితే, ఇలా ఎందుకు చేశాడో నౌషద్ చెప్పలేదు. అప్పుడప్పుడు ఇలా ప్రవర్తిస్తుంటాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇదీ చదవండి: Viral Video:రాహుల్‌ని చూసి భావోద్వేగం.. వెక్కి వెక్కి ఏడ్చిన యువతి: వీడియో వైరల్ -
'నా కూతురును చూస్తే గర్వంగా ఉంది'
పిలిభిత్ : బీజేపీ నేత, పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ తన కూతురును చూస్తే చాలా గర్వంగా ఉందంటూ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. తన ముద్దుల కూతురు అనసూయ గాంధీ పాఠశాలలో మొదటి తరగతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రెండవ తరగతికి వెళ్లనుంది. అంతేగాక తన తరగతిలో అతి పిన్న వయస్కురాలిగా మొదటి తరగతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. 'నా కూతురు అనసుయా ఈ రోజు 1 వ సంవత్సరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇయర్ 2 కి వెళుతుంది. ఆమె తన తరగతిలో అతి పిన్నవయస్కురాలు అవడం నాకు గర్వంగా ఉంది' అంటూ లాఫింగ్ ఎమోజీతో ట్వీట్ చేశాడు. (భారత్‌కు ‘స్వావలంబన’తోనే మోక్షం!) 2014 ఆగస్టులో వరుణ్ గాంధీ, యామిని దంపతులకు జన్మించిన అనసూయ గాంధీ బ్లూ ఫ్రాక్ ధరించి దానికి తగినట్లుగా మ్యాచింగ్ గ్రాజ్యుయేషన్ క్యాప్‌పై ఏజీ( అనసూయ గ్రాడ్యుయేటడ్) ధరించి ఫోటోలకు ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రతీ రాష్ట్రంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. వరుణ్ గాంధీ ఈ ఫోటోను గురువారం ఉదయం ట్విటర్లో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ ఫోటోకు 16 వేల లైకులు వచ్చాయి. (ఫేక్ ప్రొఫైల్‌తో ఎన్నారైకి వల; మహిళ అరెస్టు) -
వైరల్ : ఇది నిజంగా ఊహించని దాడి
పిలిభిత్ : ఉత్తర్ ప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఒక పులి ముగ్గురు రైతులపై దాడి చేసి బీభత్సం సృష్టించింది. జిల్లాకు చెందిన రామ్ బహదూర్, ఉజగర్ సింగ్, లాల్తా ప్రసాద్‌లు వ్యవసాయక్షేత్రంలో ధాన్యాన్ని తీసుకువెళ్లేందుకు ట్రాక్టర్ పై వెళ్లారు. అయితే వారు వెళ్తున్న దారిలో హఠాత్తుగా చెట్ల పొదల్లో నుంచి ఒక పులి ట్రాక్టర్ మీదకు దూకింది. ట్రాక్టర్లో ఉన్న ముగ్గరిపై దాడి చేసేందుకు యత్నించింది. దీంతో అప్రమత్తమైన ముగ్గురు తమ కర్రలతో పులిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ పులి కర్రను నోటితో బలంగా లాగడంతో రామ్ బహుదూర్ ట్రాక్టర్ నుంచి కిందపడిపోయాడు. (ఆ డెలివరీ బాయ్‌కు జీవితాంతం గుర్తుండిపోతుంది) దీంతో పులిపై అదే పనిగా కర్రలతో దాడి చేయడంతో ట్రాక్టర్ మీద నుంచి కిందకు దూకిన పులి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. అయితే చిరుతపులి దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇదంతా దూరం నుంచి గమనించిన కొందరు తమ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. రైతుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిర ఫారెస్ట్ అధికారులు పులి ఆచూకీని తెలుసుకునే పనిలో పడ్డారని ఫిలిబిత్ జిల్లా మేజిస్ట్రేట్ వైభవ్ శ్రీవాత్సవ తెలిపారు. (నిజంగా ఇది నమ్మశక్యం కాని విషయం) -
పాఠశాలలోకి చిరుతపులి.. భయంతో పరుగులు
పిలిభిత్ : ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి ఒక చిరుతపులి ప్రవేశించి విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. పులిని చూసి హడలిపోయిన విద్యార్థులు తరగతి గదుల్లోకి పరుగులు తీశారు. అయితే చిరుతపులి పాఠశాల ఆవరణలో ఉన్న ఒక కుక్కపై దాడి చేసి దానిని పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లోని బారాహీ అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకుపోయింది.ఈ క్రమంలో పాఠశాల ప్రధనోపాధ్యాయురాలు రావడంతో విద్యార్థులు ఆమెకు జరిగిందంతా వివరించారు. దీంతో ఆమె ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపడంతో వారు వచ్చి పాఠశాలను సందర్శించి చిరుతపులి పాద ముద్రలు సేకరించారు. కాగా విద్యార్థుల భద్రతతో పాటు చిరుత కదలికలను గుర్తించేందుకు పాఠశాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీనియర్ పారెస్ట్ అధికారి అజ్మేర్ యాదవ్ తెలిపారు. అయితే చిరుతపులి ఒకట్రెండు రోజుల్లో తిరిగి అడవికి వెళ్లిపోతుందని అధికారులు భావిస్తున్నారు. -
పులిపై దాడి చేసి చంపేసిన గ్రామస్తులు
లక్నో : ఆరేళ్ల పులిని దారుణంగా కర్రలతో కొట్టి చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. పిలిబిత్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలో ఉన్న మతైన గ్రామంలోకి బుధవారం ఓ పులి ప్రవేశించింది. గ్రామస్తుడిపై దాడి చేసి గాయపర్చింది. దాంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు కర్రలతో పులిని వెంబడిస్తూ.. చితకబాదారు. ఈ ఘటనలో దారుణంగా గాయపడిన పులి చనిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై స్పందించిన అటవీ అధికారులు పులిపై దాడి చేసి, చంపినందుకు గాను 31మంది గ్రామస్తుల మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పిలిబిత్ ప్రాంతంలో ఇలా జంతువులు మీద దాడి చేసి చంపడం ఇదే ప్రథమం అన్నారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. -
తల్లి కంచుకోటలో కొడుకు గెలుపుబాట!
ఒకటీ రెండూ కాదు ఆరుసార్లు మేనకా గాంధీని పార్లమెంటుకు పంపిన ఉత్తరప్రదేశ్‌లోని పిలీభీత్ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి ఆమె కుమారుడు వరుణ్ గాంధీ పోటీ చేస్తుండడంతో గెలుపెవరిని వరిస్తుందన్న చర్చ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గాంధీ కుటుంబం నుంచి వచ్చి, గాం«ధీ కుటుంబేతర పార్టీ నుంచి తమకు తాముగా నాయకులుగా ఎదిగిన తల్లీ కొడుకులు ఉత్తరప్రదేశ్‌లో తమ విజయావకాశాలను పరీక్షించుకుంటున్నారు. స్థానం మారిన తల్లీకొడుకు ఉత్తరప్రదేశ్‌లోని పిలీభీత్ స్థానం నుంచి వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ 1989 నుంచి ఆరుసార్లు విజయం సాధించి, ఈ స్థానాన్ని కంచుకోటగా మలుచుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 52 శాతం ఓట్లను సాధించి మేనకా గాంధీ విజయఢంకా మోగించారు. అంతకు ముందు 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వరుణ్ గాంధీ పోటీచేసి, మూడు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తల్లీ కొడుకులు తమ నియోజకవర్గాలను పరస్పరం మార్చుకోవడం విశేషం. ఈసారి మేనకా గాంధీ స్థానంలో ఆమె కుమారుడు వరుణ్ గాంధీ ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో గెలుపు కైవసం చేసుకుని తల్లిపేరు నిలబెట్టాలని వరుణ్ పిలీభీత్లోని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మోదీ ప్రస్తావనే లేకుండా ప్రచారం పశ్చిమ యూపీలోని ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న వరుణ్ గాంధీ.. ప్రధాని మోదీ ప్రస్తావన, కేంద్ర ప్రభుత్వ విజయాల గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గ ఓటర్లలో ఒక వర్గం నరేంద్ర మోదీని చూసే బీజేపీకి ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా 30 ఏళ్లుగా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబీకులు తమ అభివృద్ధి కోసం కృషి చేసిన దాఖలాలు లేవని విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి అభ్యర్థి గట్టి పోటీ ఈ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థి హేమరాజ్ వర్మ వరుణ్ గాంధీతో తలపడుతున్నారు. ఈయన ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉండగా మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. మూడు దశాబ్దాలకుపైగా తల్లీకొడుకులిద్దరూ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కానీ, కనీసం ఢిల్లీకి నేరుగా చేరుకునేందుకు రైల్వే సదుపాయం కానీ కల్పించలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను స్థానికుడిననీ, ఇక్కడి ప్రజలూ స్థానిక నాయకత్వాన్నే కోరుకుంటున్నారనీ, తల్లీ కొడుకులు ఒక నెల సెలవుపై ఎన్నికల కోసం వచ్చారనీ, తరువాత 11 నెలలూ ఢిల్లీలోనే ఉంటారనీ హేమరాజ్ అంటున్నారు. ఆకట్టుకుంటున్న వరుణ్ గాంధీ వరుణ్ గాంధీ నియోజకవర్గంలో విభిన్న రీతిలో ప్రచారం చేస్తూ తన విజయావకాశాలను మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఆ గ్రామంలోని గ్రామస్తులను, పెద్దలను, ప్రముఖులను ప్రశంసిస్తూ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత గ్రామీణులను తమకే ఓటు వేయాలని సున్నితంగా కోరతారు. గ్రామంలో జరిగే సభలో కేవలం ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే క్లుప్తంగా మాట్లాడతారు. ఇలా ఆయన రోజూ 15 – 20 గ్రామాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తనని మూడు లక్షలకు తగ్గకుండా మెజారిటీతో గెలిపిస్తే అందరికీ ఉద్యోగ, ఉపాధి, వైద్యావకాశాలను కల్పిస్తానని అంటున్నారు. బీజేపీ అధినాయకత్వంతో స్పర్థలు? వరుణ్‌గాంధీకి బీజేపీ నాయకత్వంతో స్పర్థలు పొడచూపినట్టు వార్తలు వస్తున్నాయి. అమిత్ షా బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం వరుణ్ గాంధీని బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి 2014లో తొలగించారు. స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో కూడా వరుణ్ గాంధీ పేరుని చేర్చలేదు. వరుణ్ గాంధీ వివిధ అంశాలపై చేస్తోన్న వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయనీ, అందుకే ఆయనను అమిత్‌షా దూరంగా ఉంచారనీ, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల చిత్రం గెలుపొందిన అభ్యర్థి మేనకా గాంధీ (బీజేపీ) మెజారిటీ 3,07,052 ఓడిపోయిన అభ్యర్థి బుధ్సేన్ వర్మ (ఎస్పీ) నియోజకవర్గంలో ఓటర్లు 10,50,342 లోక్‌సభలోని అసెంబ్లీ సెగ్మెంట్లు 4 -
కర్రతో కొట్టి చంపింది
లక్నో: తన పాలిట కీచకుడిగా మారిన మామను కోడలు కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని మధోతండా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం తన కొడుకు పనికి వెళ్లిన సమయంలో కోడలిపై మామ అత్యాచారం చేశాడు. తర్వాత రోజు మరోసారి అకృత్యానికి ఒడిగట్టడంతో బాధితురాలు భర్త సహాయంతో మామను కర్రతో కొట్టి చంపింది. తర్వాత వీరిద్దరూ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. మృతుడి పెద్ద కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులు తెలిపారు. -
తండ్రి శవాన్ని చేతులపై మోస్తూ..
ఫిలిబిత్: మొన్న ఒడిషాలోని కాలామండిలో భార్య శవాన్ని భుజంపై మోసిన మాంఝీ ఘటన ఇంకా మరువకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ జిల్లా ఆస్పత్రిలో చనిపోయిన ఓ వృద్ధునికి ఆంబులెన్స్ నిరాకరించడంతో అతని కుమారుడు తండ్రి శవాన్ని చేతులపై మోసుకెళ్లాడు. ఈ వీడియో దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఫిలిబిత్‌లోని మదినషా ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీ చేసుకునే సూరజ్ అతని తండ్రి తులసీరామ్(70) జిల్లా ఆస్పత్రికి శనివారం ఉదయం తీసుకెళ్లాడు. దాదాపు గంటన్నర తర్వాత పేషెంటును చూసేందుకు వచ్చిన డాక్టర్ అతను చనిపోయాడని నిర్ధారించారు. శవాన్ని వెంటనే అక్కడ నుంచి తీసుకెళ్లమని ఆస్పత్రి వర్గాలు సూరజ్‌కు సూచించాయి. ఆంబులెన్స్ కోసం సూజత్ ఎంత విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోకపోవడంతో చేసేదేంలేక తండ్రి శవాన్ని చేతులమీద మోస్తూ సూజత్ తీసుకెళ్లాడు. ఈ ఘటనపై జిల్లా మేజిస్టేట్ విచారణకు ఆదేశించారు. -
అక్క సోనియాను ఫాలో అయితే సరి!
చాన్నాళ్ల తర్వాత తన తోటికోడలు సోనియా గాంధీని పొగుడుతూ, అక్రమాలను అరికట్టే విషయంలో ఆమెను అనుసరించాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి మేనకా గాంధీ. నాడు దగ్గరిబంధువైన ఓ వ్యక్తి నుంచి తలనొప్పులు ఎదుర్కొన్న సోనియా ఏ విధంగా అతణ్ని కట్టడిచేశారో అధికారులకు వివరించిన మేనకా, అదే బాటలో నడవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అసలేం జరిగిందంటే.. కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఆదివారం తన సొంత నియోజకవర్గం ఫిలిబిత్(యూపీ)లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో.. కొందరు ఐఏఎస్ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నరని, లంచాలు తీసుకుని ప్రైవేటు స్కూళ్లకు ఇష్టారీతిగా అనుమతులు, గుర్తింపులు మంజూరుచేస్తున్న విషయాన్ని ఇతర అధికారులు మంత్రిగారి దృష్టికి తెచ్చారు. సదరు కరప్టెడ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకునే పవర్ తమకు లేనందున, మీరే ఏదో ఒకటి చెయ్యాలని మంత్రిని కోరారు. అప్పుడు మేనకాగాంధీ ఏం చెప్పారంటే.. 'అవినీతి, అక్రమాలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదు. నిజమే, మీరన్నట్లు ఐఏఎస్ లపై చర్యలు తీసుకునే అధికారం మనకు లేకపోవచ్చు. కానీ వాళ్ల ఆగడాలను కచ్చితంగా అడ్డుకోగలం. ఇందుకు సంబంధించి నేనొక ఉదాహరణ చెప్తా. మా అక్క సోనియా గాంధీ దగ్గరి బంధువు ఒకరు ఆ మధ్య ఓ షాప్ ప్రారంభించాడు. తెలిసినవాళ్లకు, తెలియని వాళ్లకు తాను సోనియా గాంధీ బంధువునంటూ బాజా వేసుకుని, తద్వారా లబ్ధి పొందాలని చూశాడు. ఈ విషయం తెలుసుకున్న అక్కయ్య.. వెంటనే అతని చర్యలను ఖండిస్తూ పేపర్లలో ప్రకటనలిచ్చింది. దెబ్బకి అతని రోగం కుదిరింది. మీరు కూడా అదే మాదిరిగా అవినీతిని రూపుమాపేందుకు ప్రకటనలు ఇవ్వండి' అని. ఎలాంటి పనికైనా, ఎవ్వరికైనాసరే లంచం ఇవ్వొద్దని నోటీస్ బోర్డుల్లో రాయాడమేకాక అందరు అధికారుల ఆఫీసుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, తద్వారా అక్రమాలను అడ్డుకోగలమని మేనకా గాంధీ పేర్కొన్నారు. -
47 మంది పోలీసులకు జీవితఖైదు!
లక్నో: నకిలీ ఎన్కౌటర్కు పాల్పడిన 47 మంది పోలీసులకు జీవితఖైదు విధిస్తూ లక్నో సీబీఐ కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 1991లో జరిగిన ఈ ఘటనలో.. పవిత్రమైన ప్రదేశాలను సందర్శించుకొని తిరిగొస్తున్న 11 మంది సిక్కు పర్యాటకులను ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో అడ్డుకున్న పోలీసులు మూడు వేరు వేరు ప్రాంతాల్లో నకిలీ ఎన్కౌంటర్ చేశారు. అయితే వారంతా ఉగ్రవాదులనీ, అందుకే వారిని ఎన్కౌంటర్ చేశామని పోలీసులు తమ చర్యను సమర్థించుకున్నారు. ఈ ఘటనపై న్యాయవాది ఆర్ఎస్ సోధి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయడంతో.. న్యాయస్థానం ఈ కేసును సీబీఐచే విచారణ జరిపించాలని ఆదేశించింది. విచారణ చేపట్టిన సీబీఐ.. ఈ కేసులో 57 మంది పోలీసులను నిందితులుగా పేర్కొంటూ చార్జిషీటు దాఖలు చేసింది. అయితే ఈ 25 ఏళ్ల కాలంలో ఇప్పటికే అందులో 10 మంది పోలీసులు మృతి చెందడంతో మిగిలిన 47 మందికి జీవితఖైదు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
14 మంది 'కమలం' కార్యకర్తలకు గాయాలు
బరేలి: ఉత్తరప్రదేశ్‌లో రాయబరేలి జిల్లా పర్థౌలి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు డీవైడర్‌ను ఢీ కొట్టి... తిరగబడింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా బీజేపీ కార్యకర్తలని పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు మేనకా గాంధీని పిలిబిత్‌లో కలసి... న్యూఢిల్లీకి తిరుగు ప్రయాణంలో వస్తుండగా గత రాత్రి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కాశ్మీర్ వరదల్లో వేలాది యూపీ వాసులు గల్లంతు
లక్నో: జమ్మూ కాశ్మీర్లో సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో దాదాపు రెండు వేల మందికిపైగా యూపీ వాసులు గల్లంతయ్యారని ఆ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కమల్ సక్సేనా వెల్లడించారు. గల్లంతైన వారి వివరాల కోసం ఎప్పటికప్పుడు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. మంగళవారం యూపీ రాజధాని లక్నోలో కమల్ మాట్లాడుతూ... గల్లంతైన వారిలో ఫిల్బిత్ వాసులు అత్యధికంగా 484 మంది ఉన్నారని చెప్పారు. అలాగే మొరాదాబాద్ (395), రాంపూర్ (312), శామిలి (141), బరేలి (135) కుషీ నగర్ (53), ఫిరోజాబాద్ (35) బాగ్పట్ (20) ఆచూకీ తెలియలేదని తెలిపారు. అలాగే మరో 500 మందికిపైగా యూపీ వాసులు వివరాలు తెలియడం లేదన్నారు. గల్లంతైనా వారంతా గత కొద్ది రోజు క్రితం దుపట్లు, గాజులు, శాలువాలు విక్రయించేందుకు జమ్మూ కాశ్మీర్ వెళ్లారని వివరించారు. అయితే వీరంత కొండ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా రాష్ట్రంలోని నదులు ఉప్పొంగి ప్రవహించాయి. అలాగే కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య రోజురోజూకు పెరుగుతుంది.