కాశ్మీర్ వరదల్లో వేలాది యూపీ వాసులు గల్లంతు | Over 2,000 UP residents missing in Kashmir floods | Sakshi
Sakshi News home page

కాశ్మీర్ వరదల్లో వేలాది యూపీ వాసులు గల్లంతు

Published Tue, Sep 16 2014 9:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM

Over 2,000 UP residents missing in Kashmir floods

లక్నో: జమ్మూ కాశ్మీర్లో సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో దాదాపు రెండు వేల మందికిపైగా యూపీ వాసులు గల్లంతయ్యారని ఆ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కమల్ సక్సేనా వెల్లడించారు. గల్లంతైన వారి వివరాల కోసం ఎప్పటికప్పుడు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. మంగళవారం యూపీ రాజధాని లక్నోలో కమల్ మాట్లాడుతూ... గల్లంతైన వారిలో ఫిల్బిత్ వాసులు అత్యధికంగా 484 మంది ఉన్నారని చెప్పారు. అలాగే మొరాదాబాద్ (395), రాంపూర్ (312), శామిలి (141), బరేలి (135) కుషీ నగర్ (53), ఫిరోజాబాద్ (35) బాగ్పట్ (20) ఆచూకీ తెలియలేదని తెలిపారు.

అలాగే మరో 500 మందికిపైగా యూపీ వాసులు వివరాలు తెలియడం లేదన్నారు. గల్లంతైనా వారంతా గత కొద్ది రోజు క్రితం దుపట్లు, గాజులు, శాలువాలు విక్రయించేందుకు జమ్మూ కాశ్మీర్ వెళ్లారని వివరించారు. అయితే వీరంత కొండ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా రాష్ట్రంలోని నదులు ఉప్పొంగి ప్రవహించాయి. అలాగే కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య రోజురోజూకు పెరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement