లక్నో: నకిలీ ఎన్కౌటర్కు పాల్పడిన 47 మంది పోలీసులకు జీవితఖైదు విధిస్తూ లక్నో సీబీఐ కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 1991లో జరిగిన ఈ ఘటనలో.. పవిత్రమైన ప్రదేశాలను సందర్శించుకొని తిరిగొస్తున్న 11 మంది సిక్కు పర్యాటకులను ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్ జిల్లాలో అడ్డుకున్న పోలీసులు మూడు వేరు వేరు ప్రాంతాల్లో నకిలీ ఎన్కౌంటర్ చేశారు. అయితే వారంతా ఉగ్రవాదులనీ, అందుకే వారిని ఎన్కౌంటర్ చేశామని పోలీసులు తమ చర్యను సమర్థించుకున్నారు.
ఈ ఘటనపై న్యాయవాది ఆర్ఎస్ సోధి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయడంతో.. న్యాయస్థానం ఈ కేసును సీబీఐచే విచారణ జరిపించాలని ఆదేశించింది. విచారణ చేపట్టిన సీబీఐ.. ఈ కేసులో 57 మంది పోలీసులను నిందితులుగా పేర్కొంటూ చార్జిషీటు దాఖలు చేసింది. అయితే ఈ 25 ఏళ్ల కాలంలో ఇప్పటికే అందులో 10 మంది పోలీసులు మృతి చెందడంతో మిగిలిన 47 మందికి జీవితఖైదు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
47 మంది పోలీసులకు జీవితఖైదు!
Published Mon, Apr 4 2016 5:44 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement