ఫిలిబిత్: మొన్న ఒడిషాలోని కాలామండిలో భార్య శవాన్ని భుజంపై మోసిన మాంఝీ ఘటన ఇంకా మరువకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ జిల్లా ఆస్పత్రిలో చనిపోయిన ఓ వృద్ధునికి ఆంబులెన్స్ నిరాకరించడంతో అతని కుమారుడు తండ్రి శవాన్ని చేతులపై మోసుకెళ్లాడు. ఈ వీడియో దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి.
ఫిలిబిత్లోని మదినషా ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీ చేసుకునే సూరజ్ అతని తండ్రి తులసీరామ్(70) జిల్లా ఆస్పత్రికి శనివారం ఉదయం తీసుకెళ్లాడు. దాదాపు గంటన్నర తర్వాత పేషెంటును చూసేందుకు వచ్చిన డాక్టర్ అతను చనిపోయాడని నిర్ధారించారు. శవాన్ని వెంటనే అక్కడ నుంచి తీసుకెళ్లమని ఆస్పత్రి వర్గాలు సూరజ్కు సూచించాయి. ఆంబులెన్స్ కోసం సూజత్ ఎంత విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోకపోవడంతో చేసేదేంలేక తండ్రి శవాన్ని చేతులమీద మోస్తూ సూజత్ తీసుకెళ్లాడు. ఈ ఘటనపై జిల్లా మేజిస్టేట్ విచారణకు ఆదేశించారు.
తండ్రి శవాన్ని చేతులపై మోస్తూ..
Published Sat, Sep 24 2016 7:32 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
Advertisement
Advertisement