పిలిభిత్: ‘నోట్ల వర్షం కురిసింది’ అనే మాటను మనం ఎప్పుడో ఒకప్పుడు వినేవుంటాం. అయితే ఇంతకీ నోట్ల వర్షం కురుస్తుందా? కురిస్తే ఎలా ఉంటుంది? దీనిని తెలుసుకోవాలంటూ యూపీలోని పిలిభిత్‌లో జరిగిన ఒక ఉదంతాన్ని తెలుసుకోవాల్సిందే..
యూపీలోని పిలిభిత్‌లో ఒక పాడుబడిన బావిలోంచి నీటితోపాటు నోట్లు రావడం మొదలైంది. ఈ వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో ఈ నోట్లను దక్కించుకునేందుకు వేలాది మంది బావి దగ్గరకు చేరుకున్నారు. అయితే ఈ నోట్లను దక్కించుకున్నవారు నిరాశగా వెనుదిరిగారు. దీనికి కారణం ఆ నోట్లన్నీ చినిగిపోయి ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ జరుగుతోంది.
పిలిభిత్‌లోని బిసల్‌పూర్ తహసీల్‌కు చెందిన మొహల్లా గ్యాస్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి మహాదేవ్ ఆలయానికి వెళ్లిన కొందరికి సమీపంలోని బావిలో 10, 20, 50, 100 రూపాయల నోట్లు కనిపించాయి. ఈ వార్త తెలిసిన వారంతా పరుగు పరుగున ఆ బావి దగ్గరకు చేరుకున్నారు. వివిధ పద్ధతుల్లో ఆ నోట్లను బయటకు తీశారు. అయితే ఆ నోట్లన్నీ చినిగిపోయిన స్థితిలో ఉండటంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు. కాగా ఆ బావిలోకి నోట్లు ఎలా వచ్చాయనేది ఇంకా తేలలేదు. ఈ ఉదంతంపై బిసల్‌పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: దీపావళి.. ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు?
Comments
Please login to add a commentAdd a comment