ప్రతిభకు అవధిలేని అవకాశాలు
-
‘గైట్’ గ్రాడ్యుయేష¯ŒS వేడుకలో డాక్టర్ మోహనరెడ్డి
-
166 మంది ఎంబీఏ, ఎంటెక్ ఉత్తీర్ణులకు పట్టాలు
వెలుగుబంద (రాజానగరం) :
భారతదేశంలో ప్రతిభ ఉన్న వారి అవకాశాలకు హద్దులు లేవని సైంట్ వ్యవస్థాపకుడు, నాస్‌కామ్ పూర్వపు చైర్మ¯ŒS పద్మశ్రీ డాక్టర్ బీవీఆర్ మోహనరెడ్డి అన్నారు. ఆధునిక ఆలోచనలతో యువత నూతన ఒరవడికి నాంది పలుకుతూ మంచి పారిశ్రామికవేత్తలుగా తయారుకావాలన్నారు. స్థానిక గైట్ అటానమస్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన గ్రాడ్యుయేష¯ŒS ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ రానున్న దశాబ్ద కాలంలో రానున్న సుమారు 10 కోట్ల మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు సాధ్యం కాదుకాబట్టి ఆసక్తి ఉన్న యువత పారిశ్రామికవేత్తలుగా తయారై తమతోపాటు మరో పది మందికి ఉపాధి చూపాలన్నారు. నేటి సమాజంలో ఆధునికతకే అగ్రస్థానం లభిస్తున్న విషయాన్ని దష్టిలో పెట్టుకుని నూతనావిష్కరణలతో అభివృద్ధి వైపు పయనించాలన్నారు. అధ్యక్షత వహించిన జేఎ¯ŒSటీయూకే వీసీ డాక్టర్ వీవీఎస్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రతి అధ్యాపకుడూ కృషి చేయాలన్నారు. గైట్ కళాశాల ఎండీ కె. శశికిరణ్‌వర్మ మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకులు ఐఐటీలో నూతన బోధనా విధానాలపై శిక్షణ పొందారన్నారు. ఈ కార్యక్రమంలో 166 మంది ఎంబీఏ, ఎంటెక్ పట్టభద్రులకు సర్టిఫికెట్లు, బంగారు పతకాలు అందజేశారు. చైతన్య విద్యాసంస్థల సీఈఓ డాక్టర్ డీఎల్‌ఎ¯ŒS రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ పీవీజీకే జగన్నాథరాజు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేష¯Œ్స డాక్టర్ రాజ¯ŒS మాథ్యూస్, డైరెక్టర్లు డాక్టర్ పీఆర్‌కే రాజు, డాక్టర్ టీవీ ప్రసాద్, జీఎం డాక్టర్ పి.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.