giet college
-
ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు
- గైట్‌లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రస్థాయి శిక్షణ - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాజానగరం : గత మూడు సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వల్ల దేశంలోని కార్మిక, కర్షక, బడుగు వర్గాలకు జరిగిన మేలంటూ ఏదీ లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. ఈ విధంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల పై వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలతో కలసి ఉద్యమాలు నిర్వహిస్తున్నాయన్నారు. గైట్ ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్‌లో శనివారం నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటువంటి సదస్సుల ద్వారా రాజకీయ అవగాహనను పెంపొందించుకుని, భవిషత్తులో చేపట్టే ఉద్యమాలు, పోరాటాల్లో చురుకైన పాత్రను పోషించడం ద్వారా పాలకులకు మీ ఉనికిని తెలియజేయాలని కార్మిక, కర్షక సంఘాలకు పిలుపునిచ్చారు. బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద పాచికను తీవ్రంగా ఎండగట్టాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు. విజయ్‌మాల్యా, ఆదానీ వంటి వ్యాపారవేత్తలకు రూ.13 లక్షల 50 వేల కోట్లు బ్యాంకుల్లో రుణాలను రద్దు చేయడం, పేటీఎం వంటి సంస్థలకు మేలు చేకూర్చేలా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం వంటి చర్యలు చూస్తుంటే దేశంలో సామాన్యుడి మనుగడ ఏమవుతుందోననే భయం కలుగుతుందన్నారు.నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చి ప్రతి పేదోడి బ్యాంకు అకౌంటులోని జమ చేస్తానని చెప్పిన ప్రధానమంత్రి ఇంతవరకు ఆ పని చేయకుండా ఎందుకు మొహం చాటేస్తున్నారన్నారు. పెద్దనోట్ల రద్దుతో కరెన్సీ కష్టాలు పేద, మధ్య తరగతికి వస్తే పెద్దోళ్లు తమ నల్లధనాన్ని స్వేచ్ఛగా మార్చుకునే వెసులుబాటు కలిగించారన్నారు. జీఎస్టీ ద్వారా ప్రజల ఆర్థిక భారం మోపుతున్నారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీకేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, నగర కార్యదర్శి నల్లా రామారావు, జట్లు సంఘం అధ్యక్షుడు వంగమూడి కొండలరావు, ప్రధాన కార్యదర్శి యడ్ల అప్పారావు, బీకేఎంయు జిల్లా కార్యదర్శి నక్కా కిశోర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిర్ల కృష్ణ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నల్లా భ్రమరాంబ, ప్రధాన కార్యదర్శి ఎం. నాగమణి, సేపేని రమణమ్మ, డీహెచ్‌పీఎస్ ప్రధాన కార్యదర్శి కుంచే అంజిబాబు, తోకల ప్రసాద్, సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభకు అవధిలేని అవకాశాలు
‘గైట్’ గ్రాడ్యుయేష¯ŒS వేడుకలో డాక్టర్ మోహనరెడ్డి 166 మంది ఎంబీఏ, ఎంటెక్ ఉత్తీర్ణులకు పట్టాలు వెలుగుబంద (రాజానగరం) : భారతదేశంలో ప్రతిభ ఉన్న వారి అవకాశాలకు హద్దులు లేవని సైంట్ వ్యవస్థాపకుడు, నాస్కామ్ పూర్వపు చైర్మ¯ŒS పద్మశ్రీ డాక్టర్ బీవీఆర్ మోహనరెడ్డి అన్నారు. ఆధునిక ఆలోచనలతో యువత నూతన ఒరవడికి నాంది పలుకుతూ మంచి పారిశ్రామికవేత్తలుగా తయారుకావాలన్నారు. స్థానిక గైట్ అటానమస్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన గ్రాడ్యుయేష¯ŒS ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ రానున్న దశాబ్ద కాలంలో రానున్న సుమారు 10 కోట్ల మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు సాధ్యం కాదుకాబట్టి ఆసక్తి ఉన్న యువత పారిశ్రామికవేత్తలుగా తయారై తమతోపాటు మరో పది మందికి ఉపాధి చూపాలన్నారు. నేటి సమాజంలో ఆధునికతకే అగ్రస్థానం లభిస్తున్న విషయాన్ని దష్టిలో పెట్టుకుని నూతనావిష్కరణలతో అభివృద్ధి వైపు పయనించాలన్నారు. అధ్యక్షత వహించిన జేఎ¯ŒSటీయూకే వీసీ డాక్టర్ వీవీఎస్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రతి అధ్యాపకుడూ కృషి చేయాలన్నారు. గైట్ కళాశాల ఎండీ కె. శశికిరణ్‌వర్మ మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకులు ఐఐటీలో నూతన బోధనా విధానాలపై శిక్షణ పొందారన్నారు. ఈ కార్యక్రమంలో 166 మంది ఎంబీఏ, ఎంటెక్ పట్టభద్రులకు సర్టిఫికెట్లు, బంగారు పతకాలు అందజేశారు. చైతన్య విద్యాసంస్థల సీఈఓ డాక్టర్ డీఎల్ఎ¯ŒS రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ పీవీజీకే జగన్నాథరాజు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేష¯Œ్స డాక్టర్ రాజ¯ŒS మాథ్యూస్, డైరెక్టర్లు డాక్టర్ పీఆర్కే రాజు, డాక్టర్ టీవీ ప్రసాద్, జీఎం డాక్టర్ పి.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. -
నైట్రో వెహికల్‌కు రూపకల్పన
వెలుగుబంద (రాజానగరం) : స్థానిక గైట్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ ఆటోమోబైల్ విభాగంలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు సరికొత్త వాహనానికి రూపకల్పన చేశారు. రిమోట్‌తో నియంత్రిస్తూ, పెట్రోలుతో నడిచేలా రూపొందించిన ఈ వాహనానికి ‘నైట్రో వెహికల్’ అనే పేరు పెట్టారు. శీలం వినయ్, వంకమామిడి శివకుమార్, సంపటి సత్యరాఘవ, సన్నపనేని శివ, ఫణి దుర్గాప్రసాద్, మల్లారెడ్డి ప్రవీణ్‌కుమార్‌లు హెచ్ఓడీ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో ఈ వాహనం రూపొందించారు. తయారీ ఇలా.. గడ్డి కోసే యంత్రంలోని చిన్నపాటి అంతర్గత ఇంజ¯ŒSను ఈ వాహనానికి ఉపయోగించారు. రిమోట్ కంట్రోలింగ్‌కు అవసరమైన మోటార్లను ఆ¯ŒSలై¯ŒSలో కొనుగోలు చేశారు. దీని తయారీకి సుమారు రూ.15 వేలు ఖర్చు చేశారు. ఇటువంటి వాహనాలను ఆ¯ŒSలై¯ŒSలో అమ్మకానికి పెడితే రూ.లక్ష వరకూ ధర పలుకుతుందన్నారు. దేశంలో ఐఐటీలు, ఎ¯ŒSఐటీలతోపాటు ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో జరిగే సాంకేతిక వర్క్‌షాపుల్లో ఈవిధమైన వాహనాల పోటీలు జరుగుతాయని హెచ్ఓడీ తెలిపారు. ప్రస్తుతం ఆటోమోబైల్ సంస్థలన్నీ డ్రైవర్ లేకుండా నడిచే వాహనాలపైనే దృష్టి సారిస్తున్నాయన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి మాట్లాడుతూ, గ్రహాల పైకి పంపించే రోవర్ల మాదిరిగానే తమ విద్యార్థులు ఈ వాహనం రూపొందించారని తెలిపారు. భారీ వ్యాపార సంస్థలు ఇటువంటి వాహనాలను తమ వ్యాపార సముదాయాల్లో రవాణాకు, కెమెరా అమర్చి ‘నిఘా’ పెట్టేందుకు వినియోగిస్తాయని వివరించారు. నైట్రో వెహికల్ రూపొందించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యంతోపాటు అధ్యాపక బృందం కూడా అభినందించింది.