నైట్రో వెహికల్‌కు రూపకల్పన
Published Thu, Nov 3 2016 11:19 PM | Last Updated on Tue, Oct 9 2018 4:06 PM
వెలుగుబంద (రాజానగరం) :
స్థానిక గైట్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ ఆటోమోబైల్ విభాగంలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు సరికొత్త వాహనానికి రూపకల్పన చేశారు. రిమోట్‌తో నియంత్రిస్తూ, పెట్రోలుతో నడిచేలా రూపొందించిన ఈ వాహనానికి ‘నైట్రో వెహికల్’ అనే పేరు పెట్టారు. శీలం వినయ్, వంకమామిడి శివకుమార్, సంపటి సత్యరాఘవ, సన్నపనేని శివ, ఫణి దుర్గాప్రసాద్, మల్లారెడ్డి ప్రవీణ్‌కుమార్‌లు హెచ్‌ఓడీ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో ఈ వాహనం రూపొందించారు.
తయారీ ఇలా..
గడ్డి కోసే యంత్రంలోని చిన్నపాటి అంతర్గత ఇంజ¯ŒSను ఈ వాహనానికి ఉపయోగించారు. రిమోట్ కంట్రోలింగ్‌కు అవసరమైన మోటార్లను ఆ¯ŒSలై¯ŒSలో కొనుగోలు చేశారు. దీని తయారీకి సుమారు రూ.15 వేలు ఖర్చు చేశారు. ఇటువంటి వాహనాలను ఆ¯ŒSలై¯ŒSలో అమ్మకానికి పెడితే రూ.లక్ష వరకూ ధర పలుకుతుందన్నారు. దేశంలో ఐఐటీలు, ఎ¯ŒSఐటీలతోపాటు ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో జరిగే సాంకేతిక వర్క్‌షాపుల్లో ఈవిధమైన వాహనాల పోటీలు జరుగుతాయని హెచ్‌ఓడీ తెలిపారు. ప్రస్తుతం ఆటోమోబైల్ సంస్థలన్నీ డ్రైవర్ లేకుండా నడిచే వాహనాలపైనే దృష్టి సారిస్తున్నాయన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి మాట్లాడుతూ, గ్రహాల పైకి పంపించే రోవర్ల మాదిరిగానే తమ విద్యార్థులు ఈ వాహనం రూపొందించారని తెలిపారు. భారీ వ్యాపార సంస్థలు ఇటువంటి వాహనాలను తమ వ్యాపార సముదాయాల్లో రవాణాకు, కెమెరా అమర్చి ‘నిఘా’ పెట్టేందుకు వినియోగిస్తాయని వివరించారు. నైట్రో వెహికల్ రూపొందించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యంతోపాటు అధ్యాపక బృందం కూడా అభినందించింది.
Advertisement